AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Hanuman Chalisa Row: సినీ నటి, ఎంపీ నవనీత్‌ రాణా దంపతులకు మరో షాక్‌.. దావూద్‌ గ్యాంగ్‌తో సంబంధాలున్నట్టు ఆరోపణలు!

ముంబైలోని మాతోశ్రీ వెలుపల హనుమాన్ చాలీసా పఠన ప్రకటన తర్వాత వివాదంలోకి వచ్చిన అమరావతి స్వతంత్ర ఎంపీ నవనీత్ రాణా, ఢిల్లీ పోలీస్ కమిషనర్‌కు శివసేన నాయకుడు సంజయ్ రౌత్‌పై ఫిర్యాదు చేశారు.

Hanuman Chalisa Row: సినీ నటి, ఎంపీ నవనీత్‌ రాణా దంపతులకు మరో షాక్‌.. దావూద్‌ గ్యాంగ్‌తో సంబంధాలున్నట్టు ఆరోపణలు!
Navneer Rana Sanjay Raut
Balaraju Goud
|

Updated on: Apr 27, 2022 | 3:31 PM

Share

Hanuman Chalisa Row: ముంబైలోని మాతోశ్రీ వెలుపల హనుమాన్ చాలీసా పఠన ప్రకటన తర్వాత వివాదంలోకి వచ్చిన అమరావతి స్వతంత్ర ఎంపీ నవనీత్ రాణా, ఢిల్లీ పోలీస్ కమిషనర్‌కు శివసేన నాయకుడు సంజయ్ రౌత్‌పై ఫిర్యాదు చేశారు. నవనీత్ రాణా, ఢిల్లీ పోలీస్ కమిషనర్‌కు లేఖ రాస్తూ, శివసేన ఎంపీని కుల పదాలను దూషించారని ఆరోపిస్తూ చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. 420కి కాల్ చేసి సంజయ్ రౌత్ తన పరువు తీశాడని ఫిర్యాదులో పేర్కొన్నారు. మరోవైపు, ఎంపీ నవనీత్‌ రాణా దంపతులకు మరో షాక్‌ ఇవ్వడానికి రెడీ అవుతున్నారు ముంబై పోలీసులు. దావూద్‌ గ్యాంగ్‌తో సంబంధాలున్నట్టు నవనీత్‌ రాణా దంపతులపై కేసు నమోదు కాబోతున్నారు. శివసేన ఎంపీ సంజయ్‌ రౌత్‌ ఇచ్చిన ఫిర్యాదుపై ముంబై పోలీసులు కేసు నమోదు చేయనున్నట్లు తెలుస్తోంది.

దావూద్‌ గ్యాంగ్‌కు సన్నిహితుడైన బాలీవుడ్‌ నిర్మాత యూసఫ్‌ లక్డావాలా నుంచి రాణా దంపతులు 80 లక్షల రూపాయలు అక్రమంగా వసూలు చేసినట్టు ముంబై పోలీసులకు ఫిర్యాదు చేశారు సంజయ్‌ రౌత్‌. దావూద్‌ గ్యాంగ్‌తో సంబంధాలపై ఇప్పటికే ముంబై పోలీసులు లక్డావాలాను అరెస్ట్‌ చేశారు. తనను ముంబై పోలీసులు అక్రమంగా అరెస్ట్‌ చేశారని కేంద్రహోంశాఖకు ఫిర్యాదు చేశారు నవనీత్‌ రాణా. ఈ వ్యవహారంలో మహారాష్ట్ర ప్రభుత్వం నుంచి నివేదిక కోరింది కేంద్ర హోంశాఖ.

అయితే, నవనీత్‌ రాణా కూడా సంజయ్‌రౌత్‌పై ఢిల్లీ పోలీసులకు ఫిర్యాదు చేశారు. అమరావతి లోక్‌సభ నియోజకవర్గం షెడ్యూల్డ్ కులాలకు రిజర్వ్ చేయబడినందున, నేను మొదటిసారిగా 2014లో శివసేన అభ్యర్థిపై పోటీ చేశానని ఆయన తన ఫిర్యాదులో పేర్కొన్నారు. నా మొదటి ఎన్నికల నుండి, శివసేన అభ్యర్థులు, వారి కార్యకర్తలు నన్ను బెదిరిస్తున్నారు.నా కులం గురించి తప్పుడు ఆరోపణలు చేస్తున్నారు. తనను కులం పేరుతో రౌత్‌ దూషించారని , వెంటనే చర్యలు తీసుకోవాలని ఆమె ఢిల్లీ పోలీసు కమిషనర్‌ రాకేశ్‌ ఆస్థానాకు లేఖ రాశారు.

ఇదిలావుంటే, మహారాష్ట్ర సీఎం ఉద్దవ్‌థాక్రే ఇంటి ముందు హనుమాన్‌ చాలీసా పఠిస్తామని సవాల్‌ విసిరి జైలు పాలయ్యారు నవనీత్‌ రాణా దంపతులు.

Read  Also… Prashant Kishor: ఎవరి దారి వారిది.. ప్రశాంత్ కిషోర్ నిర్ణయం వెనుక అసలు కారణం ఇదేనా?