Mauni Amavasya: కుంభమేళాలో అపశృతి.. అమృత స్నానం కోసం పోటెత్తిన భక్తులు.. సెక్టార్-2లో తొక్కిసలాట

మహాకుంభమేళాలో రెండో అమృత్‌స్నానం (షాహీస్నాన్) ప్రారంభమైంది. ఇవాళ మౌని అమావాస్య కావడంతో ప్రయాగ్‌రాజ్‌కు పెద్ద ఎత్తున భక్తజనం తరలివచ్చింది.. తెల్లవారుజాము నుంచే త్రివేణి సంగమంలో భక్తుల పుణ్యస్నానాలు కొనసాగుతున్నాయి.. కాగా.. అమృత స్నానం కోసం జనం ఒక్కసారిగా ఎగబడటంతో తొక్కిసలాట చోటుచేసుకుంది..

Mauni Amavasya: కుంభమేళాలో అపశృతి.. అమృత స్నానం కోసం పోటెత్తిన భక్తులు.. సెక్టార్-2లో తొక్కిసలాట
Mahakumbh Stampede
Follow us
Shaik Madar Saheb

|

Updated on: Jan 29, 2025 | 8:05 AM

మహాకుంభమేళాలో రెండో అమృత్‌స్నానం (షాహీస్నాన్) ప్రారంభమైంది. ఇవాళ మౌని అమావాస్య కావడంతో ప్రయాగ్‌రాజ్‌కు పెద్ద ఎత్తున భక్తజనం తరలివచ్చింది.. తెల్లవారుజాము నుంచే త్రివేణి సంగమంలో భక్తుల పుణ్యస్నానాలు కొనసాగుతున్నాయి.. కాగా.. అమృత స్నానం కోసం జనం ఒక్కసారిగా ఎగబడటంతో తొక్కిసలాట చోటుచేసుకుంది.. 40 మందికిపైగా గాయాలైనట్లు అధికారులు తెలిపారు. గాయాలైన వారిని సెక్టార్-2 ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.. మాఘమాస మౌని అమావాస్య మహిమాన్వితమైన శుభదినం కావడంతో ఇవాళ పుణ్యస్నానాలకు కోట్లాది మంది వస్తారని అంచనా వేశారు.. దానికి తగినట్లు ఏర్పాటు చేశారు.. అయితే.. తొక్కిసలాట ఘటనతో అఖండ పరిషత్ కమిటీ కీలక నిర్ణయం తీసుకుంది. అమృత స్నానాలు రద్దు చేసుకున్నట్లు అఖండ పరిషత్ కమిటీ ప్రకటించింది.. తెల్లవారుజాము నుంచే లక్షలాది మంది పుణ్యస్నానాలు ఆచరిస్తుననారు.. లక్షలాది భక్తులతో ప్రయాగ్‌రాజ్ పరిసరాలు నిండిపోయాయి..

కాగా, మౌనీ అమావాస్య కావడంతో ఇవాళ తెల్లవారుజామున రెండున్నర తర్వాత నుంచి భక్తుల్ని ఘాట్‌లోకి అనుమతి ఇచ్చారు. సెక్టార్-2 ప్రాంతంలో ఓచోట బారీకేడ్ తీసినప్పుడు భక్తులు ఒక్కసారిగా మందుకు తోసుకొచ్చారు.. ఆ సమయంలోనే తొక్కిసలాట చోటుచేసుకుందని.. గాయపడ్డ వారిని వెంటనే ఆస్పత్రులకు తరలించినట్లు అధికారులు తెలిపారు. కాగా.. ఈ విషయం తెలిసిన వెంటనే యూపీ సీఎం యోగితో ప్రధాని మోదీ మాట్లాడారు.. అత్యవసరంగా చేపట్టాల్సిన సహాయ చర్యలపై సమీక్ష చేశారు. ఎలాంటి పొరపాట్లు జరగకుండా.. పకడ్బంధీగా చర్యలు తీసుకోవాలని సూచించారు.

ఎంతో పుణ్యం..

ఈ నెల 13న మొదలైన మహాకుంభమేళ వచ్చే నెల 26 వరకు కొనసాగుతోంది. విభుడు, దేవాదిదేవతలు దివి నుంచి దిగి వచ్చే అమృత కాలమే మహా కుంభమేళ. ఈ 45 రోజుల్లో ఏ రోజులు త్రివేణి సంగమంలో పుణ్య స్నానం ఆచరిస్తే సకల శుభాలు కలుగుతాయనేది భక్తుల విశ్వాసం. అందుకే భువి నలుచెరుగుల నుంచి సాధుసంతులు, అఘోరాలు, మాన్యులు, సామాన్యులు ప్రయాగ్‌ రాజ్‌కు పోటెత్తుతున్నారు. మౌని అమావాస్య రోజున మహాకుంభ మేళలో స్నానమాచరించడమే ఎంతో పుణ్యం. ఇక మాఘ మాస మౌని అమావాస్య కలిసొచ్చిన వేళ.. గంగా స్నానం చేస్తే మరెంతో పుణ్యం. దానాలు చేస్తే జన్మ ధన్యం అనేది భక్తుల విశ్వాసం.. మౌని అమావాస్య ధ్యానానికి జ్ఞానానికి చిహ్నం. ఆరోజు మౌనంగా వుంటూ ..పరమేశ్వుడిని ధ్యానిస్తూ పవిత్ర గంగా స్నానంచేసి పితృదేవుళ్లకు నీరాజనాలు అర్పిస్తారు. తద్వారా పూర్వీకులకు సద్గతులు కలగడం సహా అందరికీ సకల శుభాలు కలుగుతాయంటారు పండితులు. మహాకుంభమేళానే ఎంతో మహిమాన్వితం. ఇక ఈసారి మౌని అమావాస్య కలిసిరావడం మరెంతో శుభప్రదం కావడంతో ఇవాళ ఒక్కరోజే కోట్లాది మంది భక్తులు పుణ్య స్నానాలు ఆచరించనున్నారు.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..