PM Modi: ప్రయాగ్‌రాజ్‌లో తొక్కిసలాట.. సీఎం యోగితో మాట్లాడిన ప్రధాని మోదీ.. సహాయక చర్యలపై సమీక్ష..

మౌని అమావాస్య కావడంతో ప్రయాగ్‌రాజ్‌లో తెల్లవారుజామున రెండున్నర గంటల తర్వాత నుంచి ఘాట్‌లోకి భక్తుల్నిఅనుమతిచ్చారు. ఈ సమయంలో సెక్టార్-2 ప్రాంతంలో ఓచోట బారీకేడ్ తీసినప్పుడు భక్తులు ఒక్కసారిగా మందుకు తోసుకొచ్చారు.. దీంతో తొక్కిసలాట చోటుచేసుకుంది. 40 మందికిపైగా భక్తులకు గాయాలైనట్లు పేర్కొంటున్నారు.

PM Modi: ప్రయాగ్‌రాజ్‌లో తొక్కిసలాట.. సీఎం యోగితో మాట్లాడిన ప్రధాని మోదీ.. సహాయక చర్యలపై సమీక్ష..
Pm Modi Cm Yogi
Follow us
Shaik Madar Saheb

|

Updated on: Jan 29, 2025 | 8:47 AM

మహాకుంభమేళాలో అపశృతి చోటుచేసుకుంది. మౌని అమావాస్య రోజున రెండో అమృత్‌స్నానం (షాహీస్నాన్) కావడంతో ప్రయాగ్‌రాజ్‌కు పెద్ద ఎత్తున భక్తులు తరలివచ్చారు.. తెల్లవారుజాము నుంచి త్రివేణి సంగమంలో భక్తుల పుణ్యస్నానాలు కొనసాగుతున్నాయి.. ఈ క్రమంలో సంగం వద్ద అమృత స్నానం కోసం జనం ఒక్కసారిగా ఎగబడటంతో తొక్కిసలాట చోటుచేసుకుంది.. తెల్లవారుజామున రెండున్నర గంటల తర్వాత నుంచి ఘాట్‌లోకి భక్తుల్నిఅనుమతిచ్చారు. ఈ సమయంలో సెక్టార్-2 ప్రాంతంలో ఓచోట బారీకేడ్ తీసినప్పుడు భక్తులు ఒక్కసారిగా మందుకు తోసుకొచ్చారు.. దీంతో తొక్కిసలాట చోటుచేసుకుంది. 40 మందికిపైగా భక్తులకు గాయాలైనట్లు పేర్కొంటున్నారు. గాయాలైన వారిని సెక్టార్-2 ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.. పలువురు మరణించినట్లు సమాచారం.. సంగం వద్ద జరిగినతొక్కిసలాట తీవ్ర గందరగోళం, భయాందోళనల వాతావరణాన్ని సృష్టించింది. అనేక అఖారాలు షాహీ స్నాన్‌ను రద్దు చేశాయి. మౌని అమావాస్య నాడు పుణ్యస్నానానికి పెద్ద సంఖ్యలో ప్రజలు తరలిరావడంతో ప్రయాగ్‌రాజ్ జనసంద్రంగా మారింది.

మహా కుంభమేళాలో తొక్కిసలాట విషయం తెలుసుకున్న ప్రధానమంత్రి నరేంద్ర మోదీ.. వెంటనే యూపీ సీఎం యోగితో ఫోన్‌లో మాట్లాడారు. అత్యవసరంగా చేపట్టాల్సిన సహాయక చర్యలపై సమీక్షించారు. మహాకుంభమేళా ప్రస్తుత పరిస్థితి గురించి, సహాయకచర్యలపై ప్రధాని మోదీ సీఎం యోగిని అడిగి తెలుసుకున్నారు. గాయాలైన వారికి వెంటనే చికిత్స అందించాలని.. పరిస్థితిని ఎప్పటికప్పుడు తెలియజేయాలని సూచించారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా చర్యలు తీసుకోవాలని యోగి ఆదిత్యనాథ్‌ కు సూచించారు. కేంద్రం నుంచి సహాయసహకారాలు అందిస్తామని తెలిపారు.

అదే సమయంలో కేంద్ర హోంమంత్రి అమిత్ షా కూడా సీఎం యోగితో మాట్లాడారు. ఘటనకు సంబంధించిన పూర్తి సమాచారాన్ని అడిగి తెలుసుకున్నారు. తక్షణ సహాయం అందించాల్సిన అవసరాన్ని ఆయన నొక్కి చెప్పారు. కేంద్రం నుంచి పూర్తి మద్దతు లభిస్తుందని ఆయన హామీ ఇచ్చారు.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..