శరీరానికి సమతులంగా పోషకాలు అందకపోతే ఎన్నో అనారోగ్యాలు. పోషకాలు పుష్కలంగా అందాలన్నా, మరిన్ని ఆరోగ్య ప్రయోజనాలు చేకూరాలన్నా.. రోజూ కాసిన్ని మొలకలు తినండి
TV9 Telugu
ఆహారపుటలవాట్లు, జీవనశైలి కారణాలేవైతేనేం... మహిళలందరూ హార్మోన్ల అసమతుల్యతతో బాధపడుతున్నారు. అధికబరువు, నెలసరి క్రమం తప్పడం...లాంటి ఎన్నో సమస్యలకు మూలం
TV9 Telugu
ఈ పరిస్థితిని అదుపులోకి తేవాలంటే రోజూ గుప్పెడు మొలకల్ని తినాలి. పెసర్లు, రాగులూ, బొబ్బర్లు, రాజ్మా వంటివన్నీ కలగలిపి వాటితో పాటూ ఒక ఖర్జూరం కలిపి తీసుకుంటే సరి. ఇవి విటమిన్లూ, ఖనిజాలూ, ప్రొటీన్ వంటి పోషకాలన్నింటినీ సమతులంగా శరీరానికి అందిస్తాయి
TV9 Telugu
ముఖ్యంగా పెసర్లను మొలకెత్తించి తినడం వల్ల శరీరానికి అనేక ప్రయోజనాలు అందుతాయి. ఎందుకంటే వీటి ద్వారా ప్రోటీన్, ఐరన్, విటమిన్ సి, కాల్షియం వంటి అనేక విటమిన్లు, ఖనిజాలు శరీరానికి అందుతాయి
TV9 Telugu
బరువు తగ్గాలనుకునే వారికేకాదు కండరాలు బలపడటంతో పాటు, బరువు పెరగాలనుకునే వారికి కూడా మొలకలు ఉపయోగకరం. ఉదయం వేళ పెసర్ల మొలకలు తినడం వల్ల చెప్పలేనన్ని లాభాలు ఉన్నాయి
TV9 Telugu
చాలా మంది మొలకలను సలాడ్‌గా తినడానికి ఇష్టపడతారు. కానీ అసలు చిక్కు ఏంటంటే.. వీటిని ఉడికించి తినాలా? లేదంటే పచ్చిగానే తినాలా? ఆయుర్వేద నిపుణులు ఏం చెబుతున్నారంటే
TV9 Telugu
పచ్చి మొలకలు తినడం కంటే ఉడికించిన మొలకలు తినడం ఎక్కువ ప్రయోజనకరంగా ఉంటుందని ఆయుర్వేదం చెబుతోంది. అయితే వాటిని ఎక్కువగా ఉడికించకూడదు. లేకుంటే పోషకాలు తగ్గుతాయి
TV9 Telugu
నిజానికి, పచ్చి మొలకలలో బ్యాక్టీరియా పెరిగే అవకాశం ఉంది. అవి జీర్ణం కావడం కూడా కష్టం. కాబట్టి మొలకలను కాస్త లేత మంటపై ఉడికించి తినడం మంచిదటున్నారు ఆయుర్వేధ నిపుణులు