స్పీడ్ బోటులో షికారు చేస్తున్న పర్యాటకులు..నది మధ్యలోకి వెళ్లగానే..
నీటి ఏనుగు నిజానికి ఇది శాకాహారి. భారీ శరీరం కలిగి ఎక్కువగా నీటిలోనే జీవిస్తుంది. ఇది సహారా ఎడారి దిగువ భాగంలో దక్షిణ ఆఫ్రికా దేశాల్లో ఎక్కువగా కనిపిస్తుంది. నీటి ఏనుగులకు సంబంధించిన అనేక వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతూ ఉంటాయి. శాకాహారి జంతువే అయినా దీనికి దూకుడు ఎక్కువ. నీటి ఏనుగుకు తెక్కరేగిందంటే పులులు, సింహాలు సైతం భయంతో తోక ముడిచి పారిపోవాల్సిందే. అలాగే పర్యాటకుల పైన కూడా అటాక్ చేస్తూ ఉంటాయి. తాజాగా నీటి ఏనుగుకు సంబంధించిన ఓ వీడియో నెట్టింట వైరల్ అవుతోంది. నది మధ్యలో బోటు శికాారు చేస్తున్న పర్యాటకులను వెంబడించి వారికి చెమటలు పట్టించింది. నీటి ఏనుగు వెంటబడిన తీరును చూస్తే షాక్ అవ్వాల్సిందే.
కొందరు పర్యాటకులు స్పీడ్ బోటులో ప్రకృతి అందాలను వీక్షిస్తుంటారు. కొంత దూరం వెళ్ళేసరికి వారికి ఓ నీటి ఏనుగు కనిపించింది. అదేం చేస్తుందిలే అనుకుని దానికి దగ్గరగా వెళ్లారు. అప్పటివరకు సైలెంట్ గా ఉన్న ఆ నీటి ఏనుగు పర్యాటకులకు సడన్ షాక్ ఇచ్చింది. ఉన్నట్టుండి వారిపై దాడికి యత్నించింది. నీటి ఏనుగు తమవైపు రావడాన్ని గమనించిన వారు కంగారుపడ్డారు. బోటు వేగాన్ని పెంచారు. అయినా నీటి ఏనుగు బోటును వదలకుండా వెంబడించింది. దీంతో వారు బోటు వేగాన్ని మరింత పెంచి దూరంగా వెళ్ళిపోయారు. నీటి ఏనుగు కూడా తగ్గేదేలే అన్నట్టు వారిని చాలా దూరం వరకు వెంబడించింది. ఈ క్రమంలో దాని విన్యాసాలు నిజంగా ఆకట్టుకునేలా ఉన్నాయి. అయితే బోటు వేగం మరింతగా పెంచి నీటి ఏనుగుకు చాలా దూరంగా వెళ్లిపోయారు పర్యాటకులు. అది గమనించిన నీటి ఏనుగు జాగ్రత్త మళ్ళీ ఇటు వచ్చారో ఇక అంతే అన్నట్టుగా ఓ లుక్ ఇచ్చి వెనక్కి వెళ్ళిపోయింది. ఇదంతా బోటులో ఉన్నవారు వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేయటంతో వైరల్ గా మారి నెటిజన్లను ఆకట్టుకుంటోంది. ఈ వీడియోను ఇప్పటికే 20 మిలియన్ల మందికి పైగా వీక్షించారు. 6 లక్షల మందికి పైగా లైక్ చేశారు. ఈ వీడియో పై తమదైన శైలిలో స్పందించారు. ఈ ఘటన ఆస్ట్రేలియాలో చోటుచేసుకున్నట్లు తెలుస్తోంది.
మరిన్ని వీడియోల కోసం :
రైతు పొలం దున్నుతుండగా..నాగలికి ఏదో అడ్డు తగిలింది.. ఏంటా అని చూడగా వీడియో
తెల్లవారుజామున ఆ విద్యార్ధి ఇంటి తలుపు తట్టిన కలెక్టర్..ఏం చేశారంటే..! వీడియో