భార్య కోసం రూ. 15 లక్షలతో రైల్వే ఉద్యోగం కొని.. విడిపోవడంతో.. వీడియో
రైల్వే ఉద్యోగ నియామకాల్లో భారీ కుంభకోణం ఒకటి బయటపడింది. జీవితంలో స్థిరపడాలన్న ఉద్దేశంతో రూ. 15 లక్షలు ఖర్చు చేసి మరీ భార్యకు రైల్వేలో ఉద్యోగం ‘కొన్నాడు’. అయితే, మనస్పర్థల కారణంగా విడిపోవడంతో భార్యపై కోపంతో ఈ విషయాన్ని బయటపెట్టాడు. దీంతో రంగంలోకి దిగిన సీబీఐ దర్యాప్తు ప్రారంభించగా విస్తుపోయే విషయాలు వెలుగులోకి వచ్చాయి.రాజస్థాన్‌లోని కోటాకు చెందిన మనీశ్ మీనా 8 నెలల క్రితం రైల్వే అధికారులను కలిశాడు.
తన భార్య డమ్మీ అభ్యర్థి ద్వారా రైల్వే ఉద్యోగం సాధించిందని, ఇందుకోసం తాను రూ. 15 లక్షలకు పొలాన్ని తాకట్టు పెట్టానని చెప్పడంతో అధికారులు విస్తుపోయారు. రైల్వే గార్డు అయిన రాజేంద్ర అనే ఏజెంట్ ద్వారా రూ. 15 లక్షలు చెల్లించి డమ్మీ అభ్యర్థితో పరీక్ష రాయించినట్టు చెప్పాడు. ఈ డబ్బు కోసం తన పొలాన్ని తాకట్టు పెట్టినట్టు వివరించాడు.ప్రైవేటు రైల్వే ఉద్యోగి అయిన మనీశ్ 2022లో ఆశా మీనాను వివాహం చేసుకున్నాడు. మంచి భవిష్యత్తు కోసం ఆశా బంధువు ద్వారా రైల్వే గార్డును కలిశాడు. జబల్‌పూర్‌లోని సీనియర్ రైల్వే అధికారి పేరుతో గార్డు రూ. 15 లక్షలు తీసుకున్నాడు. అనంతరం ఆశా మీనాకు బదులుగా లక్ష్మీ మీనా అనే మహిళ రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు ఎగ్జామ్ రాసి పాసైంది. అనంతరం పశ్చిమ మధ్య రైల్వే (డబ్ల్యూసీఆర్)లో పాయింట్స్ విమెన్‌గా ఉద్యోగం సంపాదించింది.
మరిన్ని వీడియోల కోసం :
రైతు పొలం దున్నుతుండగా..నాగలికి ఏదో అడ్డు తగిలింది.. ఏంటా అని చూడగా వీడియో
తెల్లవారుజామున ఆ విద్యార్ధి ఇంటి తలుపు తట్టిన కలెక్టర్..ఏం చేశారంటే..! వీడియో