13 February 2025
ప్రభాస్, పవన్ కళ్యాణ్ గురించి నిధి అగర్వాల్ ఆసక్తికర కామెంట్స్..
Rajitha Chanti
Pic credit - Instagram
చాలా కాలంగా సరైన హిట్టు కోసం ఎదురుచూస్తున్న హీరోయిన్ నిధి అగర్వాల్. ప్రస్తుతం ఈ అమ్మడు చేతిలో రెండు సినిమాలు ఉన్నాయి.
పవన్ కళ్యాణ్ నటిస్తోన్న హరిహర వీరమల్లు సినిమాలో కథానాయికగా నటిస్తుంది నిధి. అలాగే ప్రభాస్ జోడిగా రాజాసాబ్ సినిమా కూడా.
కొన్ని నెలలుగా ఈ రెండు సినిమాలు శరవేగంగా షూటింగ్ జరుగుతున్నాయి. తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న ఆమె ఆసక్తికర కామెంట్స్ చేసింది.
పవన్ కళ్యాణ్, ప్రభాస్ ఇద్దరితో వర్క్ చేయడం చాలా ఆనందంగా ఉందన్నారు. 2022లో విరామం తీసుకోవడానికి కారణాన్ని వివరించింది.
హరిహర వీరమల్లు సినిమాలో తన పాత్ర ఇప్పటివరకు చేసిన వాటిల్లో అత్యుత్తమమైనదని.. ఆ పాత్ర కోసం క్లాసికల్ డ్యాన్స్, స్వారీ శిక్షణ తీసుకుందట.
అలాగే కథక్ నేర్చుకున్నానని.. తన కల నిజమైందని తెలిపింది. అలాగే హారర్ సినిమాలంటే తనకు గతంలో భయం ఉండేదని తెలిపింది నిధి.
పవన్ సెట్స్ లో ఉన్నప్పుడు ఎంతో ఏకాగ్రతతో ఉంటారని.. యాక్షన్ చెప్పగానే పూర్తిగా లీనమైపోతుంటారని.. చుట్టూ ఏం జరుగుతున్న పట్టించుకోరు.
అలాగే ప్రభాస్ సెట్స్ లో ఎప్పుడూ ఫన్నీగా ఉంటారని తెలిపింది. ఈ రెండు సినిమాలు తన ప్రేక్షకుల ముందుకు వస్తాయని వెయిట్ చేస్తున్నట్లు తెలిపింది.
మరిన్ని వెబ్ స్టోరీస్
తల్లి కావాలని ఇప్పటికీ కలలు కంటాను.. ఆలస్యం అనుకోవట్లేదు.. సమంత.
డాక్టర్ కమ్ హీరోయిన్.. నెట్టింట గ్లామర్ ఫోజులు చూస్తే ఫ్యూజుల్ అవుట్
షాప్స్ క్లీన్ చేసిన అమ్మాయి.. ఇప్పుడు స్టార్ హీరోలకు లక్కీ హీరోయిన్