UGC Draft Regulations: యూజీసీ కొత్త నిబంధనలను వ్యతిరేకిస్తున్నాం.. ఉన్నత విద్యామండలి ప్రకటన

జనవరి 6న కేంద్రం విడుదల చేసిన UGC తాజా ముసాయిదా నిబంధనలను తెలంగాణ ఉన్నత విద్యా మండలి (TGCHE) విమర్శించింది.చేసింది. తాజాగా టీజీసీహెచ్‌ఈ చైర్మన్‌ వీ బాలకిష్టారెడ్డి దీనిపై మాట్లాడుతూ ఉన్నత విద్యాసంస్థల్లో విద్యా ప్రమాణాలను పలుచన చేసేలా ముసాయిదా రూపొందించారని, యూనివర్సిటీలకు వైస్‌ ఛాన్సలర్ల నియామక విధానాన్ని వ్యతిరేకిస్తున్నట్లు తెలిపారు..

UGC Draft Regulations: యూజీసీ కొత్త నిబంధనలను వ్యతిరేకిస్తున్నాం.. ఉన్నత విద్యామండలి ప్రకటన
TGCHE chairman V Balakista Reddy
Follow us
Srilakshmi C

|

Updated on: Jan 29, 2025 | 8:22 AM

హైదరాబాద్‌, జనవరి 29: తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న యూనివర్సిటీల్లో ప్రొఫెసర్‌ పోస్టుల నియామకాలు, పదోన్నతులు, ఉపకులపతుల ఎంపికకు సంబంధించిన తదితర అంశాలపై యూజీసీ జారీ చేసిన ముసాయిదాను వ్యతిరేకిస్తున్నట్లు రాష్ట్ర ఉన్నత విద్యామండలి ఛైర్మన్‌ వి బాలకృష్టారెడ్డి తెలిపారు. ఈ మేరకు తాజాగా ఉన్నత విద్యామండలి కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన వెల్లడించారు. ఉపాధ్యక్షుడు పురుషోత్తం, కార్యదర్శి శ్రీరాం వెంకటేశ్‌తో కలిసి ఆయన విలేకరులతో మాట్లాడుతూ.. తెలంగాణ రాష్ట్ర యూనివర్సిటీల వీసీల నియామకాన్ని కేంద్రం తన చేతుల్లోకి తీసుకోవడం సరికాదన్నారు. 90 శాతానికిపైగా బడ్జెట్‌ ఇచ్చే రాష్ట్ర ప్రభుత్వాల పాత్ర లేకుండా ఉపకులపతులను కేంద్ర ప్రభుత్వం ఎలా నియమిస్తుందని ప్రశ్నించారు.

ప్రొఫెసర్‌గా కనీసం పదేళ్ల సర్వీస్‌ కూడా లేకుండా ఏ రంగంలోని వారినైనా వీసీగా నియమించేలా యూజీసీ నిబంధనలు మార్చడం సరికాదన్నారు. పదోన్నతులకు కేర్‌ జర్నళ్లలో పరిశోధనా వ్యాసాలు ప్రచురించాలని గతంలో చెప్పిన యూజీసీ ఇప్పుడు దాన్ని ఎత్తివేయడం ఏంటని విమర్శించారు. వీటిపై అధ్యయనం చేసి, త్వరలో సీఎం రేవంత్‌రెడ్డికి నివేదిక అందజేస్తామని ఆయన తెలిపారు. ఈ క్రమంలో అన్ని యూనివర్సిటీలు యూజీసీ నిబంధనలతో విభేదించాలని పిలుపునిచ్చారు.

విద్యార్థి భవిష్యత్‌కు భరోసాకి చదువుతో పాటు జీవనోపాధికి ఉపయోగపడే కోర్సులు

పదో తరగతి, ఇంటర్మీడియట్‌ పూర్తి చేసిన విద్యార్థులు స్వశక్తిపై నిలబడేలా జాతీయ విద్యా విధానంలో భాగంగా ప్రభుత్వ పాఠశాలల్లో సరికొత్త మార్పులకు ఏపీ ప్రభుత్వం శ్రీకారం చుట్టనుంది. దీనిలో భాగంగా 2017లో తెలుగు దేశం పార్టీ ప్రభుత్వం ప్రవేశ పెట్టిన వృత్తి విద్య కోర్సులను మళ్లీ పట్టాలెక్కించే పనిలో పడింది కూటమి సర్కార్‌. వీటిని పాఠశాల స్థాయి నుంచే నేర్పిస్తే భవిష్యత్తులో ఎంతో ఉపయుక్తంగా ఉంటుందని భావిస్తుంది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావడంతో ఈ విద్యా సంవత్సరం నుంచి విద్యార్థులకు ఇంటర్న్‌షిప్‌ పేరుతో పలు రంగాల్లో ప్రత్యేక శిక్షణగా అందించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని విద్యా, ఉద్యోగ వార్తల కోసం క్లిక్‌ చేయండి.