Viral Video: బాబోయ్.. ఎంత పె..ద్ద.. లైనో..! మరీ ఇంత కాంపిటీషనైతే ఎలా బ్రో.. వీడియో
ఓ ఐటీ కంపెనీ ఉద్యోగ ప్రకటన ఇచ్చింది. అంతే తెల్లారే సరికి రోడ్డుపై ఈ మూల నుంచి ఆ మూల వరకు నిరుద్యోగులు బారులు తీరి నిలబడ్డారు. చూసిన వారంతా ఇడ్లీ, సాంబర్ కోసం ఏ టిఫిన్ సెంటర్‌లో వద్దనో నిలబడ్డారనే అనుకున్నారంతా. తీర అసలు సంగతి తెలియడంతో నోకెళ్లబెట్టారు. నిరుద్యోగం సమస్య ఇంత తీవ్రంగా ఉందా.. బ్రో? అంటూ తెగ చర్చిస్తున్నారు..

యేటా లక్షలాది మంది ఇంజనీరింగ్ విద్యార్ధులు డిగ్రీ పట్టాలు చేతబడుతున్నా.. ఉద్యోగాలు మాత్రం వేళ్లపై లెక్కపెట్టేలా అందుబాటులో ఉంటున్నాయి. దీంతో దేశంలో నిరుద్యోగుల సంఖ్య కుప్పలుతెప్పలుగా పెరిగిపోతుంది. ముఖ్యంగా IT రంగంలో మంచి జీతంతో కూడిన ఉద్యోగాన్ని సాధించడం యువతకు గగనమై పోతుంది. పైగా ఇటీవలి కాలంలో పలు ఐటీ కంపెనీలు ఎడాపెడా లేఆఫ్ పేరిట ఉద్యోగాలు తొలగించాయి. ప్రస్తుతం కంపెనీలు ప్రత్యేక నైపుణ్యాలు, అధిక అనుభవం ఉన్న అభ్యర్థులకు అధిక ప్రాధాన్యతనిస్తూ మరింత జాగ్రత్తగా ఉద్యోగులను ఎంపిక చేసుకుంటున్నాయి.
ఈ క్రమంలో మహారాష్ట్రలోని పూణెకి చెందిన ఒక ఐటీ కంపెనీ తాజాగా ఓ ఉద్యోగ ప్రకటన ఇచ్చింది. దీంతో ఆ కంపెనీకి ఏకంగా 3 వేల మందికి పైగా ఇంజనీర్లు కంపెనీ ఎందుట భారీగా క్యూ కట్టారు. సదరు కంపెనీ ఎదుట ఇంజనీర్లు బారులు తీరి నిల్చొని ఉన్న వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. పూణే పల్స్ అనే ఎక్స్ హ్యాండిల్‌లో ఈ వీడియోను షేర్ చేశారు. ఈ వీడియోలో పలువురు పురుష, మహిళా ఉద్యోగార్ధులు కంపెనీ బయట బారులు తీరి నిలబడి.. తమ వంతు కోసం ఎదురుచూస్తూ ఉండటం కనిపిస్తుంది. ఈ వైరల్ వీడియోకి ‘3 వేల మంది ఇంజనీర్లు వాక్-ఇన్ ఇంట
Pune: Viral Video Shows Over 3,000 Engineers Queuing for Walk-In Interview, Highlighting Fierce IT Job Market Competition pic.twitter.com/9Tvng35aKO
— Pune Pulse (@pulse_pune) January 25, 2025
దీంతో సోషల్ మీడియాలో ఈ వీడియోపై పెద్ద చర్చే నడుస్తుంది. పలువురు నెటిజన్లు ఈ వీడియోపై స్పందిస్తున్నారు. ఇది కూడా ఒక విధమైన వేధింపు. మా కన్సల్టింగ్ వర్క్‌కు ఇంత హైప్ అవసరం లేదు. మంచి రెజ్యూమ్ ఉన్న వ్యక్తిని నియమించుకోండి. అతను బాగా పని చేయకపోతే అతనిని తొలగించండి అని ఓ యూజర్, నేను 2015 సంవత్సరంలో ఇంటర్వ్యూ కోసం పూణె వెళ్ళినప్పుడు CTS విషయంలో కూడా అదే పరిస్థితి ఉందని మరో యూజర్ చెప్పుకొచ్చారు. విద్యావంతులైన యువతలో నిరుద్యోగుల స్థాయి పెరుగుతోంది. వారికి భవిష్యత్తు లేదు. తల్లిదండ్రులు తమ చదువుల కోసం అనవసరంగా డబ్బు ఖర్చు చేస్తున్నారని మరో వినియోగదారు ఆవేధన వ్యక్తం చేశాడు.
మరిన్ని జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి.