AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

PM Modi: త్వరలో ప్రధాని మోదీ అమెరికా పర్యటన.. వైట్‌ హౌస్‌ కీలక ప్రకటన!

PM Modi: అమెరికా అధ్యక్షుడు ఇటీవల రెండు సారి అధ్యక్ష బాధ్యతలు చేపట్టిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో భారత ప్రధాని నరంద్ర మోదీ డొనాల్డ్‌ ట్రంప్‌కు ఫోన్‌ చేశారు. ఈ ఫోన్‌ సంభాషణలు ఇరువురి మధ్య పలు విషయాలను చర్చించారు. త్వరలో ప్రధాని మోదీ అమెరికా పర్యటనకు వెళ్లనున్నారు. ఈ సందర్భంగా వైట్ హౌస్ కీలక ప్రకటన చేసింది..

PM Modi: త్వరలో ప్రధాని మోదీ అమెరికా పర్యటన.. వైట్‌ హౌస్‌ కీలక ప్రకటన!
Subhash Goud
|

Updated on: Jan 28, 2025 | 10:08 AM

Share

ప్రధాని మోదీ వచ్చేనెలలోనే అమెరికాకు వెళ్ళే అవకాశం ఉంది. ఈ విషయాన్ని అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌ స్వయంగా వెల్లడించారు. ట్రంప్‌కి మోదీ ఫోన్‌కాల్‌ తర్వాత, అమెరికా అధ్యక్షుడి ఈ విషయాన్ని వెల్లడించారు. అమెరికాకు రెండోసారి అధ్యక్షుడిగా ఎన్నికైన డోనాల్డ్‌ ట్రంప్‌కి ప్రధాని మోదీ ఫోన్‌చేసి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా రెండు దేశాల సంబంధాలపై ఇద్దరు నేతలు మాట్లాడుకున్నారు. రెండు దేశాల మధ్య పరస్పర ప్రయోజనకరమైన.. విశ్వాసపూరిత భాగస్వామ్యానికి- భారత్‌ కట్టుబడి ఉందని ట్రంప్‌కు తెలిపారు మోదీ. భారత్‌-అమెరికా ప్రజల సంక్షేమానికి, ప్రపంచ శాంతి సౌభాగ్యాల కోసం కలసి పనిచేద్దామని ట్రంప్‌కు వివరించారు మోదీ.

మోదీ, ట్రంప్‌ చర్చలపై వైట్‌హౌస్‌ అధికారిక ప్రకటన చేసింది. మోదీని అమెరికా పర్యటనకు ఆహ్వానించడంపై ఈ ఫోన్‌కాల్‌లో చర్చ జరిగిందని తెలిపింది. అలాగే రెండుదేశల మధ్య పరస్పర సహకారం పెంపొందించుకోవడంపై ట్రంప్‌, మోదీ మధ్య చర్చ జరిగిందని అమెరికా అధ్యక్ష కార్యాలయం ఈ ప్రకటనలో వివరించింది. దీంతోపాటు అమెరికా తయారుచేసిన‌ ఆయుధాల కొనుగోళ్లను పెంచాల్సిన అవసరాన్ని భారత్‌కు విజ్ఞప్తి చేసినట్లు వైట్‌హౌస్‌ తెలిపింది. పారదర్శకమైన ద్వైపాక్షిక వాణిజ్య బంధాన్ని పెంచాలని కూడా మోదీని ట్రంప్‌ కోరారు. మరోవైపు రెండుదేశాల మధ్య వ్యూహాత్మక భాగస్వామ్యంపై చర్చ జరిగింది. ఈ ఏడాది తొలిసారి భారత్‌లో క్వాడ్‌ సదస్సు నిర్వహణపై మోదీ, ట్రంప్‌ ఈ ఫోన్‌కాల్‌లో చర్చించారని వైట్‌హౌస్‌ వివరించింది.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Follow Us
ధనవంతులు కూడా హోమ్ లోన్ ఎందుకు తీసుకుంటారో తెలుసా?
ధనవంతులు కూడా హోమ్ లోన్ ఎందుకు తీసుకుంటారో తెలుసా?
ఆ స్టార్ హీరోకు వీరాభిమానిని.. కానీ ఆయన సినిమాలో చేయనని చెప్పా
ఆ స్టార్ హీరోకు వీరాభిమానిని.. కానీ ఆయన సినిమాలో చేయనని చెప్పా
తెలుగురాష్ట్రాలకు బిగ్‌ అలర్ట్.. ఈ జిల్లాల్లో భారీ వర్షాలు
తెలుగురాష్ట్రాలకు బిగ్‌ అలర్ట్.. ఈ జిల్లాల్లో భారీ వర్షాలు
చరిత్రలో మొదటిసారి..పగలు రాత్రి కాబోతోంది..
చరిత్రలో మొదటిసారి..పగలు రాత్రి కాబోతోంది..
భారత జట్టుకు కెప్టెన్‎గా ఎంపికవ్వగానే అయ్యర్ అట్టర్ ఫ్లాప్
భారత జట్టుకు కెప్టెన్‎గా ఎంపికవ్వగానే అయ్యర్ అట్టర్ ఫ్లాప్
మీనాక్షి నటరాజన్‌కు బిగ్‌ షాక్.. రాజ్యసభ నామినేషన్ తిరస్కరణ
మీనాక్షి నటరాజన్‌కు బిగ్‌ షాక్.. రాజ్యసభ నామినేషన్ తిరస్కరణ
జీవితం అంటే వీరిదే బాబు.. చిన్న వయసులోనే ప్లాట్ కొనే వారు వీరే..
జీవితం అంటే వీరిదే బాబు.. చిన్న వయసులోనే ప్లాట్ కొనే వారు వీరే..
రైల్వే స్టేషన్లలో మెడికల్ షాప్‌లు ఎందుకు ఉండవో తెలుసా?
రైల్వే స్టేషన్లలో మెడికల్ షాప్‌లు ఎందుకు ఉండవో తెలుసా?
'అష్టాచమ్మా' సెకెండ్ హీరోయిన్ ఎలా చనిపోయిందా తెలుసా? 24 ఏళ్లకే..
'అష్టాచమ్మా' సెకెండ్ హీరోయిన్ ఎలా చనిపోయిందా తెలుసా? 24 ఏళ్లకే..
ఉన్నట్లుండి శ్రీలంకకు పరిగెత్తిన అజిత్ అగార్కర్
ఉన్నట్లుండి శ్రీలంకకు పరిగెత్తిన అజిత్ అగార్కర్