మొటిమలు, మచ్చలు.. ఎప్పుడో అప్పుడు ఈ సమస్యలు తప్పవు. అయితే వీటిని తగ్గించడంలో వేప ఎంతగానో ఉపయోగపడుతుందన్న విషయం తెలిసిందే. అందులోని యాంటీబయాటిక్ గుణాలు చర్మాన్ని అందంగా, ఆరోగ్యంగా ఉంచుతాయి
వేపాకుల పేస్ట్, పసుపు, కొబ్బరి నూనె కలిపి ముఖానికి పూత వేసుకుని పావుగంటాగి చల్లటి నీటితో కడిగేయాలి. ఇలా తరచూ చేస్తే చర్మానికి కావాల్సిన తేమ అందుతుంది. వేపలోని గుణాలు ఎక్స్‌ఫోలియేట్‌లా పనిచేసి చర్మరంధ్రాల్లోని మురికిని పోగొడతాయి
TV9 Telugu
ముఖ్యంగా వేప నూనెను కొన్ని రకాల సబ్బులు, షాంపూలు, లోషన్స్, క్రీమ్స్ వంటి వాటిలో ఉపయోగిస్తారు. దీనికి చర్మాన్ని లోపలి నుంచి శుభ్రం చేసే గుణం ఉంటుంది. దీనివల్ల చర్మం కాంతివంతంగా మారుతుంది. జుట్టు మెరుస్తూ ఉంటుంది
TV9 Telugu
చర్మాన్ని మెరిసేలా చేయడానికి, వివిధ రకాల చర్మ సమస్యలకు చికిత్స చేయడానికి వేపనూనె ఉపయోగపడుతుంది. వేప నూనెను పూయడం వల్ల మొటిమలు, నల్లటి మచ్చల సమస్య తగ్గుతుందని ఆయుర్వేద నిపుణులు చెబుతున్నారు
TV9 Telugu
ముఖంపై వేప నూనెను క్రమం తప్పకుండా రాయడం వల్ల వృద్ధాప్య సంకేతాలు తగ్గుతాయి. ఇది చర్మాన్ని కూడా మెరిసేలా చేస్తుంది. ముఖంపై ఉన్న నల్ల మచ్చలపై వేప నూనెను అప్లై చేసి 10 నిమిషాలు అలాగే ఉంచాలి
TV9 Telugu
తర్వాత ముఖాన్ని గోరువెచ్చని నీటితో కడుక్కోవాలి. ఇలా క్రమం తప్పకుండా చేయడం వల్ల పిగ్మెంటేషన్ తగ్గుతుంది. కొన్ని చుక్కల వేప నూనె, బాదం నూనె కలిపి ముఖానికి అప్లై చేయాలి
TV9 Telugu
ఇలా చేయడం వల్ల పొడి చర్మం సమస్య తొలగిపోతుంది. వేప నూనెలో యాంటీ బాక్టీరియల్, యాంటీ ఫంగల్ లక్షణాలు ఉన్నాయి. ఇది దురద నుంచి ఉపశమనం కలిగించడంలో సహాయపడుతుంది