ఇలాంటి ఇడియట్స్‌కు దూరంగా ఉండాలి.. రేణూ దేశాయ్ సంచలన పోస్ట్
రేణూ దేశాయ్! సినిమాల్లో నటించకపోయినా తన సామాజిక సేవా కార్యక్రమాలతో అందరి మన్ననలు అందుకుంటున్నారు. ముఖ్యంగా మహిళలు, చిన్న పిల్లల కోసం తన వంతు మంచి పనులు చేస్తున్నారు. అలాగే మూగ జీవాల సంరక్షణ కోసం కృషి చేస్తున్నారు. ఇక సోషల్ మీడియాలోనూ యాక్టివ్ గా ఉండే రేణూ దేశాయ్ సమాజంలో జరుగుతోన్న కొన్ని ఆటవిక సంఘటనలపై తన గళాన్ని వినిపిస్తుంటారు.
మరోసారి అదే ప్రయత్నం చేశారు. ఓ షోలో ఇద్దరు యూట్యూబర్స్ చేసిన అసభ్యకర కామెంట్స్ పై కాస్త అసహనం వ్యక్తం చేశారు. ఇక అసలు విషయం ఏంటంటే..! రణ్ వీర్ అలహాబాదియా.. ప్రస్తుతం ఎక్కడ చూసినా అతని పేరే వినిపిస్తోంది. సోషల్ మీడియాలోనూ ఈ పేరు మార్మోగిపోతోంది. సమయ్ రైనా ‘ఇండియాస్ గాట్ లాటెంట్’ షోలో అభ్యంతరకరమైన, వివాదాస్పద కామెంట్స్ చేసి చిక్కుల్లో పడ్డాడు రణ్ వీర్. దీంతో అతను ప్రతి చోటా తీవ్రమైన వ్యతిరేకతను ఎదుర్కొంటున్నాడు. సినీ ప్రముఖులు కూడా రణ్ వీర్ వ్యాఖ్యలపై మండిపడుతున్నారు. తాజాగా రేణూ దేశాయ్ కూడా రణ్ వీర్ అసభ్యకరమైన కామెంట్స్ పై స్పందించారు. ఈ మేరకు సోషల్ మీడియాలో ఒక పోస్ట్ పెట్టారు. ప్రస్తుతం ఇది తెగ వైరల్ అవుతోంది. మీ పిల్లలను జాగ్రత్తగా చూసుకోవాలని, మంచిగా, బాధ్యతగా పెంచాలి అనుకుంటే రణ్‌వీర్ లాంటి ఇడియట్స్‌ను దూరం పెట్టండి. వారిని అన్‌ఫాలో చేయాలి. యంగ్ జనరేషన్ అంతా కూడా ఎంతో బాధ్యతగా ఉండాలి. ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ అనే కేటగిరీ కింద వల్గారిటీ అనేది ఈ యూత్ యాక్సెప్ట్ చేస్తుంది అని రేణూ దేశాయ్ తన పోస్టులో రాసుకొచ్చారు.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
Rashmi Gautam: ఆసుపత్రి బెడ్‌పై జబర్దస్త్ యాంకర్ రష్మీ.. ఆందోళనలో ఫ్యాన్స్
చిక్కుల్లో సంజనా.. పాత కేసుతో మళ్లీ జైలుకు వెళ్లక తప్పదా?
త్రిష ఎక్స్ ఖాతాలో షాకింగ్ పోస్ట్ ! అసలు విషయం చెప్పిన హీరోయిన్
Chiranjeevi: రాజకీయాల్లో రీ ఎంట్రీ పై.. చిరు సెన్సేషనల్ కామెంట్స్
రణభూమిని చీల్చుకుని పుట్టే నాయకుడు.. గూస్ బంప్స్ పుట్టిస్తోన్న VD టీజర్!

ఆరేళ్లుగా ఆఫీసుకు వెళ్లకపోయినా నెలనెలా జీతం.. చివరికి..

యూట్యూబ్ చూసి సొంతంగా ఆపరేషన్ ఏం జరిగిందంటే? వీడియో

పాముతో పసిపిల్లవాడు ఆటలా ?? ఏమైనా జరిగితే.. నెటిజన్స్ మండిపాటు

ప్రేమించి పెళ్ళాడిన భర్తను ముక్కలుగా నరికేసిన భార్య

అరె ! కుక్క కోసం రూ.50 కోట్లా వీడియో

గుడ్లు పెట్టే వరకేనండోయ్.. ఆ తర్వాత తల్లి పక్షి జంప్ ..

ఎండతాపాన్ని తట్టుకోలేకపోయిన పాము..పాపం ఇలా..వీడియో
