Chiranjeevi: రాజకీయాల్లో రీ ఎంట్రీ పై.. చిరు సెన్సేషనల్ కామెంట్స్
బ్రహ్మానందం, ఆయన కుమారుడు రాజా గౌతమ్ నటించిన చిత్రం ‘బ్రహ్మా ఆనందం’. ప్రియ వడ్లమాని, ఐశ్వర్య హోలక్కల్, వెన్నెల కిశోర్ తదితరులు ప్రధాన పాత్రలు పోషించారు. అన్ని హంగులు పూర్తి చేసుకున్న ఈ సినిమా ఫిబ్రవరి 14న ప్రేక్షకుల ముందుకు రానుంది. ప్రమోషన్లలో భాగంగా ఫిబ్రవరి 11న బ్రహ్మ ఆనందం ప్రీ రిలీజ్ ఈవెంట్ ను నిర్వహించారు.
మెగాస్టార చిరంజీవి ముఖ్య అతిథిగా హాజరై చిత్రం పెద్ద విజయం సాధించాలని ఆకాంక్షించారు. ఇదే సందర్బంగా తన పొలిటికల్ రీ ఎంట్రీపై వస్తోన్న ఊహాగానాలపై క్లారిటీ ఇచ్చారు. తాను రాజకీయాల వైపు మళ్లీ వెళ్తానేమోనని పలువురు అనుకుంటున్నారు. పెద్ద పెద్ద వారిని కలుస్తున్నాడు. ఏంటీ? అటువైపు ఏమైనా వెళ్తాడా?’ అని కొందరు సందేహపడుతున్నారు. అలాంటి డౌట్స్ పెట్టుకోవద్దు. జీవితాంతం కళామతల్లి సేవలోనే ఉంటాను. అంటూ చెప్పారు చిరు. అంతేకాదు సినీరంగానికి సేవల కోసమే రాజకీయ పెద్దలను కలుస్తున్నానని.. అంతకుమించి ఏమీ లేదంటూ చెప్పారు చిరు. రాజకీయంగా తాను అనుకున్న లక్ష్యాలు, సేవలు నెరవేర్చేందుకు తన సోదరుడు, జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఉన్నారని చెప్పారు. జీవితాంతం రాజకీయాలకు దూరంగా ఉంటూ సినిమాలకు అతి దగ్గరగా ఉంటా అంటూ.. మరోసారి బలంగా కుండబద్దలు కొట్టి మరీ చెప్పారు.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
రణభూమిని చీల్చుకుని పుట్టే నాయకుడు.. గూస్ బంప్స్ పుట్టిస్తోన్న VD టీజర్!
TOP 9 ET News: NTR క్రేజ్‌తో దందా..డబ్బు దండుకుంటున్న కేటుగాళ్లు
అయ్యో.. కొంపముంచిన సిబిల్ స్కోర్.. ఏం జరిగిందంటే
రోజూ గ్లాసుడు నీళ్లలో చిటికెడు కలిపి తాగండి శరీరంలో జరిగే మ్యాజిక్ చూడండి
ఈ చిట్కాలతో.. గ్యాస్ సిలెండర్లో గ్యాస్ ఎంత మిగిలిందో తెలుసుకోండి

ఆచి.. తూచి.. అడుగు వెయ్యాలంటారు ఇందుకే..

కొంప ముంచిన కాఫీ.. ఏకంగా రూ.415 కోట్లు పరిహారం..

వేసవిలో బైక్ లు వాడుతున్నారా.. వీటితో జాగ్రత్త!

తాచుపాము కరిచినా..10వ తరగతి పరీక్ష రాసిన విద్యార్థి వీడియో

తెలుగు రాష్ట్రాల్లో బుసలు కొడుతున్న పాములు వీడియో

ఈ కోతికి ఫోన్ కనిపిస్తే చాలు.. వీడియో

ఎక్కడపడితే అక్కడ రీల్స్ చేస్తే ఇలాగే పగుల్తది..
