రణభూమిని చీల్చుకుని పుట్టే నాయకుడు.. గూస్ బంప్స్ పుట్టిస్తోన్న VD టీజర్!
అలసట లేని భీకర యుద్ధం.. అలలుగా పారే ఏరుల రక్తం.. వలస పోయినా.. అలిసి పోయినా ఆగనిది ఈ మహారణం..ఇంత బీభత్సం ఎవరి కోసం రణభూమిని చీల్చుకుని పుట్టే కొత్త రాజు కోసం.. కాల చక్రాన్ని బద్దలుకొట్టి పునర్జన్మనెత్తిన నాయకుని కోసం.. ! ఎస్! ఇప్పుడా.. నాయకుడే పుట్టాడు. తొందర్లో మన మందుకు రాబోతున్నాడు.
అందుకు జస్ట్ సాంపిల్‌గా.. పవర్ ఫుల్ టీజర్‌తో మన ముందుకు వచ్చాడు. అతడే వీడీ.. విజయ్ దేవరకొండ! విజయ్ దేవరకొండ హీరోగా గౌతమ్ తిన్ననూరి డైరెక్షన్లో సితార ఎంటర్‌టైన్మెంట్ ప్రొడక్షన్లో.. వీడీ 12 వర్కింగ్ టైటిల్ తో గత కొన్ని నెలల నుంచి ఓ సినిమా తెరకెక్కుతోంది. అనౌన్స్ మెంట్ నుంచే మోస్ట్ అవేటెడ్ సినిమాగా ట్యాగ్ వచ్చేలా చేసుకున్న ఈ సినిమా నుంచి తాజాగా టీజర్ బయటికి వచ్చింది. అంతేకాదు ఈ మూవీ టైటిల్ కింగ్ డమ్ అంటూ మేకర్స్ నుంచి అనౌన్స్‌మెంట్ వచ్చింది. ఆ టైటిల్‌తో పాటే.. టీజర్ కూడా ఇప్పుడు యూట్యూబ్‌నే షేక్ చేస్తోంది. విజయ్ దేవరకొండ లుక్స్ .. యంగ్ టైగర్ ఎన్టీఆర్ వాయిస్ ఓవర్.. పవర్ ఫుల్ డైలాగ్స్ … వెరసి ఈ టీజర్ చూస్తున్న వారికి గూస్ బంప్స్ రావడం కామన్ అయిపోయింది. కింగ్ డమ్ సినిమా పై స్కై హై అంచనాలను పెంచేస్తోంది. విజయ్ దేవరకొండ ఫ్యాన్స్‌ను పిచ్చ ఖుషీ అయ్యేలా చేస్తోంది.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
TOP 9 ET News: NTR క్రేజ్‌తో దందా..డబ్బు దండుకుంటున్న కేటుగాళ్లు
అయ్యో.. కొంపముంచిన సిబిల్ స్కోర్.. ఏం జరిగిందంటే
రోజూ గ్లాసుడు నీళ్లలో చిటికెడు కలిపి తాగండి శరీరంలో జరిగే మ్యాజిక్ చూడండి
ఈ చిట్కాలతో.. గ్యాస్ సిలెండర్లో గ్యాస్ ఎంత మిగిలిందో తెలుసుకోండి

ఆచి.. తూచి.. అడుగు వెయ్యాలంటారు ఇందుకే..

కొంప ముంచిన కాఫీ.. ఏకంగా రూ.415 కోట్లు పరిహారం..

వేసవిలో బైక్ లు వాడుతున్నారా.. వీటితో జాగ్రత్త!

తాచుపాము కరిచినా..10వ తరగతి పరీక్ష రాసిన విద్యార్థి వీడియో

తెలుగు రాష్ట్రాల్లో బుసలు కొడుతున్న పాములు వీడియో

ఈ కోతికి ఫోన్ కనిపిస్తే చాలు.. వీడియో

ఎక్కడపడితే అక్కడ రీల్స్ చేస్తే ఇలాగే పగుల్తది..
