అయ్యో.. కొంపముంచిన సిబిల్ స్కోర్.. ఏం జరిగిందంటే
పూర్వం ఒక పెళ్లి చేయాలంటే అటు ఏడు తరాలు ఇటు ఏడు తరాలు చూసి ఇవ్వాలనేవారు. వరుడికి ధూమపానం, మద్యపానం ఇటువంటి అలవాట్లు ఉంటే అలాంటి వరుడికి అమ్మాయిని ఇచ్చేందుకు ఇష్టపడేవారు కాదు. కానీ ఈ రోజుల్లో ఈ లక్షణాలు కామన్ అయిపోయాయి. ప్రస్తుత కాలంలో వరుడి ప్యాకేజీ ఎంత, అతడి బ్యాంక్ బ్యాలెన్స్ ఎంత ఉంది, వధువు ఏం చదువుకుంది, ఎంత సంపాదిస్తుంది అనేవి చూడటం తప్పనిసరి అయిపోయాయి.
ఇలాంటి వివాహ బంధాలు అనుబంధాల మీద కాకుండా బ్యాంక్ బ్యాలెన్స్ లో, ప్యాకేజీల పై ఆధారపడి సాగుతున్నాయి అనడం అతిశయోక్తి కాదనిపిస్తుంది. తాజాగా ఒక వ్యక్తి వివాహం అతని సివిల్ స్కోర్ కారణంగా క్యాన్సిల్ అయిపోయింది. మహారాష్ట్రలోని ముర్తిజాపూర్ కి చెందిన ఒక యువతికి అదే ప్రాంతానికి చెందిన ఒక యువకుడితో పెద్దలు పెళ్లి సంబంధం కుదుర్చారు. వివాహానికి కావలసిన అన్ని విషయాలు మాట్లాడుకొని ముహూర్తం సైతం ఫిక్స్ చేసుకున్నారు. అయితే వివాహానికి కొన్ని రోజుల ముందు వధువు మేనమామ వరుడి సివిల్ స్కోర్ ను చెక్ చేయగా అతడు అనేక బ్యాంకుల నుంచి రుణాలు తీసుకున్నట్లు కనుగొన్నారు. అంతేకాకుండా సివిల్ స్కోర్ కూడా తక్కువ ఉండటంతో వారి పెళ్లికి నిరాకరించారు. ఇప్పటికే అనేక ఆర్థిక సమస్యలు ఎదుర్కుంటున్న ఆ యువకుడు ఆ అమ్మాయికి ఆర్థిక భద్రతను ఎలా కల్పించగలడని ప్రశ్నించారు. అందుకే ఈ వివాహం రద్దు చేసుకుంటున్నట్లు పేర్కొన్నారు. ప్రస్తుతం ఈ ఘటన సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. దీంతో వధువు కుటుంబం తీసుకున్న నిర్ణయాన్ని నెటిజన్లు ప్రశంసిస్తున్నారు. అమ్మాయిలకు వివాహం చేయాలంటే తప్పకుండా అన్ని విషయాలు చెక్ చేయాలని అప్పుడే వారికి సరైన భవిష్యత్తును అందించాలని ఒక నెటిజన్ పేర్కొన్నారు.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
రోజూ గ్లాసుడు నీళ్లలో చిటికెడు కలిపి తాగండి శరీరంలో జరిగే మ్యాజిక్ చూడండి
ఈ చిట్కాలతో.. గ్యాస్ సిలెండర్లో గ్యాస్ ఎంత మిగిలిందో తెలుసుకోండి
కోనసీమ జిల్లాలో అద్భుతం...150 ఏళ్ల నాటి రావి చెట్టుకు పునర్జన్మ
ఉపాధిహామీ పనులు చేస్తున్న కూలీలు.. ఇంతలో అరుదైన దృశ్యం
కెనడా అమ్మాయి..తెలంగాణ అబ్బాయి..నిజామాబాద్లో ఒక్కటైన జంట!
పోలీస్ స్టేషన్ వద్దే రెచ్చిపోయిన దొంగలు
ఇంట్లో అమ్మ చనిపోతే ఇల్లు ఖాళీ చేయాలనే మూఢనమ్మకంతో
జీతం పెరిగినా బ్యాంక్ బ్యాలెన్స్ పెరగటం లేదా..?
వరలక్ష్మీ వ్రతం చేశారు...అమ్మవారికి పెట్టిన నగలు కాలువలో పడేశారు!

