AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఇంట్లో పాత తలగడని చెత్తలో పడేశారు.. కట్ చేస్తే ఊరంతా పరుగులు! అసలు సంగతిదే..

కుమార్తె వివాహం కోసం ఓ తల్లి 25 తులాల బంగారు నగలను తలగడ దిండులో దాచింది. అనుకోకుండా ఆ దిండును పోగొట్టుకుని లబోదిబోమంది. అనూహ్యంగా ఆ నగలు మధురై ఆరోగ్య సూపర్‌వైజర్‌, పారిశుధ్య కార్మికురాలి చేతికి వచ్చాయి. వాటిని తిరిగి బాధితురాలి చేతికి అందజేయడంతో కథ సుఖాంత మైంది. ఈ విచిత్ర ఘటన తమిళనాడులోని మధురైలో చోటు చేసుకుంది. వివరాల్లోకెళ్తే..

ఇంట్లో పాత తలగడని చెత్తలో పడేశారు.. కట్ చేస్తే ఊరంతా పరుగులు! అసలు సంగతిదే..
Woman Mistakenly Throne Gold Jewellery In Garbage Bin
Srilakshmi C
|

Updated on: Dec 03, 2025 | 11:04 AM

Share

మధురై, డిసెంబర్‌ 3: మధురై కార్పొరేషన్‌లోని 75వ వార్డు పరిధిలోని సుందరరాజపురం న్యూ రైస్ మిల్ 2వ వీధి ప్రాంతంలో తంగం (52) అనే మహిళ కుటుంబంతో కాపురం ఉంది. వచ్చే జనవరిలో తంగం తన కుమార్తె వివాహం కోసం ఏర్పాట్లు చేసుకుంది. ఇందుకోసం, ఆమె తన ఇంట్లో ఒక చిన్న దిండులో 25 తులాల బంగారు నగలను దాచింది. తమ కూతురి వివాహం సమీపిస్తుండటంతో కుటుంబ సభ్యులు పెళ్లి పనులు ప్రారంభించారు. ఇందులో భాగంగా తాజాగా ఉదయాన్నే నిద్రలేచి ఇంటిని శుభ్రం చేశారు. ఆ సమయంలో కుటుంబ సభ్యులు ఇంట్లోని పాత వస్తువులు, బట్టలు తీసి సమీపంలోని మున్సిపల్ చెత్త డబ్బాలో పడేశారు. వీటితోపాటు తంగం తన ఇంట్లో బంగారు నగలు దాచిన దిండును కూడా కుటుంబ సభ్యులు పనికిరాని చెత్తగా భావించి చెత్తబుట్టలో పడేశారు.

ఆ మరుసటి రోజు ఉదయం తంగం 25 తులాల బంగారు నగలు దాచిన దిండు కోసం ఇల్లంతా వెతికింది. ఎక్కడా కనిపించకపోవడంతో.. ఇంట్లో ఇతర కుటుంబ సభ్యులను అడిగితే, వారు దానిని చెత్తబుట్టలో పడేసినట్లు చెప్పడంతో తంగం కాళ్ల కింద భూమి కంపించినట్లైంది. వెంటనే తంగం తన ఇంటి దగ్గర ఉన్న చెత్తబుట్ట వద్దకు వెళ్లి వెతికింది. అయితే అందులో దిండు, బంగారు నగలు కనిపించకపోవడంతో ఏడుస్తూ 75వ వార్డు హెల్త్ సూపర్‌వైజర్ మరుతు పాండియన్‌ను సంప్రదించి జరిగిన విషయాన్ని చెప్పింది. చెత్త డబ్బాలో చెత్తను సేకరించిన పారిశుధ్య కార్మికురాలు మీనాక్షికి ఆయన ఫోన్ చేసి ప్రశ్నించారు. ఆమె సేకరించిన చెత్తను గ్రేడ్‌ చేస్తుండగా.. అందులో ఒక చిన్న దిండు కనిపించిందని, ఆమె దిండు తెరిచి చూడగా లోపల 25 తులాల బంగారు నగలు కనిపించినట్లు వెల్లడించింది. దీంతో ఆమె ఆ నగలను తీసుకువచ్చి హెల్త్ సూపర్‌వైజర్ మరుదు పాండియన్‌కు ఇచ్చింది.

Gold Jewellery In Garbage Bin

ఇవి కూడా చదవండి

హెల్త్ సూపర్‌వైజర్ పాండియన్ వెంటనే బాధితురాలిని సంప్రదించి పారిశుద్ధ కార్మికురాలు అందజేసిన 25 తులాల బంగారు నగలను అందించాడు. ఆ నగలను అందుకున్న యజమాని తంగం.. ఈ నగలు తాను సంపాదించిన డబ్బుతో తన కుమార్తె వివాహం కోసం జీవితాంతం దాచుకున్నవని చెప్పాడు. దానిని తిరిగి ఇచ్చిన సూపర్‌వైజర్‌కు, పారిశుధ్య కార్మికులకు కన్నీళ్లతో కృతజ్ఞతలు తెలిపింది. ఈ వార్త స్థానికంగా కలకలం రేపింది.

మరిన్ని జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి.