AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఆ మహిళలకు ఆలయంలోకి ప్రవేశం నిషేధం.. మద్రాస్ హైకోర్టు ఆగ్రహం.. ఎక్కడ.. ఎందుకంటే..

Madras High Court: సామాన్యులు పోలీసులకు పిర్యాదు చేస్తే ఏమవుతుందో.. అక్కడా అదే జరిగింది.. ఇక ఇక్కడ న్యాయం జరగదని భావించిన తంగమణి ఆలయంలో జరుగుతున్న అనాచారంపై మద్రాస్ హైకోర్టును ఆశ్రయించారు.. పిటిషన్ ను స్వీకరించిన న్యాయస్థానం విచారణ జరిపింది.. జస్టిస్ ఆనంద్ వెంకటేష్ ఘటనపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. నేటి స్మార్ట్ యుగంలోనూ ఇంకా ఇలాంటి ఆచారాలు ఉన్నాయా అని ఆశ్చర్యపోయారు ఆతర్వాత నిర్వాహకుల తీరుపై మండిపడ్డారు.. ఎవరైతే వితంతు మహిళను ఆలయంలోకి వెళ్లకుండా అడ్డుకున్నారో..

ఆ మహిళలకు ఆలయంలోకి ప్రవేశం నిషేధం.. మద్రాస్ హైకోర్టు ఆగ్రహం.. ఎక్కడ.. ఎందుకంటే..
Madras High Court
Ch Murali
| Edited By: Sanjay Kasula|

Updated on: Aug 07, 2023 | 3:01 PM

Share

కాలం మారుతున్న మనుషుల ఆలోచనలు.. ఆచారాలు మారడం లేదు.. సైన్స్ ఎంతగానో అభివృద్ధి చెందుతున్న నేటి రోజుల్లో కూడా సాంఘిక అసమానతలు ఆగడం లేదు.. దేశంలో ఇలాంటి ఘటనలు అనేకం జరుగుతూనే ఉన్నాయి.. మారుమూల ప్రాంతాల్లో ముక్కున వేలేసుకునేలా ఇప్పటికి మనం వినని, చూడని ఆచారాలు కొనసాగుతున్నాయి.. ఇక తమిళనాడు లో అయితే నిత్యం ఇలాంటి ఘటనలు వెలుగు చూస్తూనే ఉంటాయి.. ప్రభుత్వ పాఠశాలల్లో దళితులు, అగ్రవర్ణాల విద్యార్థులు పాఠశాల గదిలో వేర్వేరుగా కూర్చోవడం అనే ఆచారం ఇప్పటికీ కొనసాగుతోంది.. ఇక ఆలయంలోకి దళితులకు ప్రవేశం దొరకని ఆలయాలు తమిళనాట ఇంకా వందల్లోనే ఉంటాయి.. ఇక టీ దుకాణాల్లో రెండు గ్లాసుల పద్ధతి తమిళనాట ఇంకా ఉండనే ఉంది.. ఇక తాజాగా తమిళనాడు లో ఇలాంటి దారుణమైన ఘటన వెలుగు చూసింది.. ఈరోడ్ జిల్లా సత్యమంగలం సమీపంలోని నంబియూర్ గ్రామంలో ఈ దారుణ ఘటన జరిగింది.. గ్రామంలో పెరియకరుప్పన్ ఆలయం ఉంది. ఇక్కడ ఆలయంలో స్వామివారిని దర్శించునేందుకు వితంతువులకు ప్రవేశం నిషేధం..

సాధారణ రోజుల్లో నిషేధంపై పర్యవేక్షణ అంతగా ఉండదు.. కాని ఆగస్టు 9,10 రెండు రోజులపాటు స్వామివారికి ప్రత్యేక ఉత్సవాలు జరుగుతాయి.. ఆ సమయంలో వితంతు మహిళలు ఆలయంలోకి వెళ్ళడానికి అనుమతి లేదు.. గత ఏడాది ఆగస్టు 9న ఉత్సవాలను చూసేందుకు స్థానిక మహిళ తంగమణి వచ్చింది. తంగమణి భర్త ఇటీవలే చనిపోయారు.. దీంతో తన కొడుకుతో పాటు ఆలయానికి వచ్చిన తంగమణిని ఆలయ నిర్వాహకులు అయ్యావు, మురళి అనే ఇద్దరు నిర్వాహకులు అడ్డుకున్నారు.. అడ్డుకున్న గ్రామంలో మహిళ పట్ల అసభ్యకరంగా మాట్లాడారు.. ఆచారాలు తెలియవా అంటూ అందరి ముందూ అవమానకరంగా మాట్లాడారు.. దీంతో తంగమణి తనకు జరిగిన అవమానం మరొకరికి జరగకూడదని నిర్ణయించుకుంది. స్థానిక సిరువారూరు పోలీస్ స్టేషన్ లో పిర్యాదు చేసింది తంగమణి.

అయితే స్థానికంగా పలుకుబడి ఉన్న వారిపై సామాన్యులు పోలీసులకు పిర్యాదు చేస్తే ఏమవుతుందో.. అక్కడా అదే జరిగింది.. ఇక ఇక్కడ న్యాయం జరగదని భావించిన తంగమణి ఆలయంలో జరుగుతున్న అనాచారంపై మద్రాస్ హైకోర్టును ఆశ్రయించారు.. పిటిషన్ ను స్వీకరించిన న్యాయస్థానం విచారణ జరిపింది.. జస్టిస్ ఆనంద్ వెంకటేష్ ఘటనపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. నేటి స్మార్ట్ యుగంలోనూ ఇంకా ఇలాంటి ఆచారాలు ఉన్నాయా అని ఆశ్చర్యపోయారు ఆతర్వాత నిర్వాహకుల తీరుపై మండిపడ్డారు.. ఎవరైతే వితంతు మహిళను ఆలయంలోకి వెళ్లకుండా అడ్డుకున్నారో వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆదేశించించారు.. తంగమణి, ఆమె కుమారుడికి భద్రత కల్పించాలని మద్రాస్ హైకోర్టు ఆదేశించింది.. ఇప్పుడు జరగనున్న ఉత్సవాల్లో పాల్గొనేందుకు అనుమతి ఇవ్వాలి.. పోలీసు భద్రతతో దర్శన అవకాశం కల్పించాలని ఆదేశించింది..

మరిన్ని జాతీయ వార్తల కోసం

కేవలం వడ్డీతోనే రూ.2లక్షల ఆదాయం.. పోస్టాఫీస్‌లో అదిరే స్కీమ్..
కేవలం వడ్డీతోనే రూ.2లక్షల ఆదాయం.. పోస్టాఫీస్‌లో అదిరే స్కీమ్..
2026లో మరో 30 శాతం పెరగనున్న బంగారం! నివేదికలో ఆశ్చర్యకరమైన విషయం
2026లో మరో 30 శాతం పెరగనున్న బంగారం! నివేదికలో ఆశ్చర్యకరమైన విషయం
20 సార్లు ఓడిన తర్వాత రాహుల్ చిట్కా పనిచేసిందంటున్న ఫ్యాన్స్
20 సార్లు ఓడిన తర్వాత రాహుల్ చిట్కా పనిచేసిందంటున్న ఫ్యాన్స్
టెస్టులకు కూడా దొరకని వ్యాధి.. వదిలేస్తే యమ డేంజర్!
టెస్టులకు కూడా దొరకని వ్యాధి.. వదిలేస్తే యమ డేంజర్!
రూ.100 కంటే తక్కువ ప్లాన్స్‌ గురించి తెలుసా? 30 రోజుల వ్యాలిడిటీ
రూ.100 కంటే తక్కువ ప్లాన్స్‌ గురించి తెలుసా? 30 రోజుల వ్యాలిడిటీ
చూడటానికి ఇంత ఉంది.. సింహానికి కూడా సుస్సు పోయిస్తుంది..
చూడటానికి ఇంత ఉంది.. సింహానికి కూడా సుస్సు పోయిస్తుంది..
వెంకటగిరి రాజా ఫ్యామిలీ కోసం తయారైన స్పెషల్ రెసిపి..టేస్ట్ చేశారా
వెంకటగిరి రాజా ఫ్యామిలీ కోసం తయారైన స్పెషల్ రెసిపి..టేస్ట్ చేశారా
పర్సనల్ లోన్ తీసుకునే ముందు ఈ విషయాలు తప్పక తెలుసుకోండి..
పర్సనల్ లోన్ తీసుకునే ముందు ఈ విషయాలు తప్పక తెలుసుకోండి..
ఇంట్లో గులాబీలు గుత్తులుగా పూస్తున్నాయా?.. వాస్తు చెప్పే రహస్యం..
ఇంట్లో గులాబీలు గుత్తులుగా పూస్తున్నాయా?.. వాస్తు చెప్పే రహస్యం..
పాస్‌వర్డ్ లేకుండా వైఫైని ఎలా కనెక్ట్ చేయాలి? సులభమైన ట్రిక్‌
పాస్‌వర్డ్ లేకుండా వైఫైని ఎలా కనెక్ట్ చేయాలి? సులభమైన ట్రిక్‌