Madhyapradesh floods: వరదల్లో చిక్కుకున్న మధ్యప్రదేశ్ మంత్రి..హెలికాఫ్టరే రక్షించింది మరి ..!

పెనుగాలులు, భారీ వర్షాలు, వరదలతో మధ్యప్రదేశ్ తల్లడిల్లుతోంది. వాగులు, వంకలు, నదులు పొంగిపొర్లుతున్నాయి. అనేక చోట్ల గ్రామాలకు గ్రామాలే జలమయమయ్యాయి. దాతియా జిల్లాలో అనేక గ్రామాలు నీటి ముంపునకు గురయ్యాయి.

Madhyapradesh floods: వరదల్లో చిక్కుకున్న మధ్యప్రదేశ్ మంత్రి..హెలికాఫ్టరే రక్షించింది మరి ..!
Madhyapradesh Minister Air Lifted After Trying Flood Rescue Measures On Boat
Follow us
Umakanth Rao

| Edited By: Anil kumar poka

Updated on: Aug 05, 2021 | 10:02 AM

పెనుగాలులు, భారీ వర్షాలు, వరదలతో మధ్యప్రదేశ్ తల్లడిల్లుతోంది. వాగులు, వంకలు, నదులు పొంగిపొర్లుతున్నాయి. అనేక చోట్ల గ్రామాలకు గ్రామాలే జలమయమయ్యాయి. దాతియా జిల్లాలో అనేక గ్రామాలు నీటి ముంపునకు గురయ్యాయి. ఈ జిల్లా ఎమ్మెల్యే, హోమ్ మంత్రి కూడా అయిన నరోత్తం మిశ్రా.. నిన్న వరద ప్రాంతాలను సందర్శించి సహాయక చర్యలను సమీక్షించారు. ఈ క్రమంలో బాధితులను రక్షించేందుకు బోటులో వెళ్తుండగా దగ్గరలోని ఓ చెట్టు ఆ బోటుపై పడడంతో అది ఆగిపోయింది. అప్పటికే ఓ ఇంటి చుట్టూ నీరు చేరడంతో ఆ ఇంటివారంతా ఇంటి రూఫ్ పైకి ఎక్కి బిక్కుబిక్కు మంటూ గడిపారు. అతి కష్టం మీద నరోత్తం మిశ్రా కూడా ఆ ఇంటిని చేరారు. అయితే చుట్టూ నీరు ప్రవహిస్తుండడంతో ఆయన కూడా వారితో బాటు ఆ ఇంటిపైనే చిక్కుకుపోయారు.. ఎటూ వెళ్లే దారి లేక ఆయన అధికారులకు ఫోన్ లో సందేశాలు పంపడంతో అధికారులు వైమానిక దళాన్ని సంప్రదించి ఆ ప్రాంతానికి హెలికాఫ్టర్ పంపారు. అందులోని సిబ్బంది హెలికాఫ్టర్ నుంచి తాడును కిందికి వదలడంతో దాన్ని పట్టుకుని ఆయన పైకి చేరగలిగారు. ఇతర సహాయక సిబ్బందిని, బాధితులను కూడా ఇలాగే సిబ్బంది రక్షించారు.

తన నియోజకవర్గంలో ముంపు గ్రామాలను విజిట్ చేసి మిశ్రా సహాయక చర్యల్లో నిమగ్నమయ్యారని.. అనేకమందిని సురక్షిత ప్రాంతాలకు తరలించారని ప్రభుత్వ వర్గాలు పేర్కొన్నాయి. ఇదే జిల్లాలో రెండు బ్రిడ్జీలు వరదల ధాటికి పూర్తిగా కూలిపోయాయి. కాగా మంత్రి నరోత్తం మిశ్రా చర్యను కాంగ్రెస్ పార్టీ ఓ స్టంట్ గా అభివర్ణించింది. ఇది పబ్లిక్ స్టంట్ అని, కానీ పాపం రాంగ్ వే లో వెళ్లిందని ఈ పార్టీ నేతలు వ్యాఖ్యానించారు.

మరిన్ని ఇక్కడ చూడండి : News Watch : మధ్యవర్తిత్వానికి జగన్ ఎందుకు నో చెప్పారంటే ! మరిన్ని వార్తా కధనాల సమాహారం కొరకు వీక్షించండి న్యూస్ వాచ్..( వీడియో )

 మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ జిమ్‌ కష్టాలు మాములుగా లేవుగా..గనీ సినిమా అప్డేట్ తో ముందుకు..:Varun Tej workouts Video.

 పెళ్లికూతురు ఆ సమయంలోనూ పుషప్స్ కొట్టింది..! ఫిట్‌నెస్‌ విషయంలో కచ్చితంగా ఉన్న వధువు…:Viral Video.

 అరాచకం టీవీని ఇలా కూడా ఆన్‌ చేస్తారా..?రిమోట్ లేకుండా ఎలా ఆన్ చెయ్యాలో ఇక్కడ చూడండి..:TV Viral Video.

KYC పేరుతో ఆఫీసర్‌కి మెసేజ్‌.. క్షణాల్లోనే రూ.13 లక్షలు మయం!
KYC పేరుతో ఆఫీసర్‌కి మెసేజ్‌.. క్షణాల్లోనే రూ.13 లక్షలు మయం!
'గేమ్ ఛేంజర్' బెనిఫిట్‌ షోలకు గ్రీన్ సిగ్నల్.. టికెట్ రేట్లు ఇవే
'గేమ్ ఛేంజర్' బెనిఫిట్‌ షోలకు గ్రీన్ సిగ్నల్.. టికెట్ రేట్లు ఇవే
ఘాటు ఘాటుగా మటన్ దాల్ ఘోస్ట్.. ఇలా చేస్తే టేస్ట్ వేరే లెవల్!
ఘాటు ఘాటుగా మటన్ దాల్ ఘోస్ట్.. ఇలా చేస్తే టేస్ట్ వేరే లెవల్!
మోడీ చేతుల మీదుగా.. చర్లపల్లి టెర్మినల్ ఓపెనింగ్ కు సర్వం సిద్దం
మోడీ చేతుల మీదుగా.. చర్లపల్లి టెర్మినల్ ఓపెనింగ్ కు సర్వం సిద్దం
విమానంలో ఉచిత Wi-Fi ఎక్కడ నుండి వస్తుంది? డేటా ఎందుకు పని చేయదు?
విమానంలో ఉచిత Wi-Fi ఎక్కడ నుండి వస్తుంది? డేటా ఎందుకు పని చేయదు?
అలా అయితేనే వైసీపీకి రాష్ట్రంలో పూర్వవైభవం.. జగనే మారాలట..!
అలా అయితేనే వైసీపీకి రాష్ట్రంలో పూర్వవైభవం.. జగనే మారాలట..!
శంకర్ గారితో పనిచేయడాన్ని ఎంజాయ్ చేశాను.. రామ్ చరణ్
శంకర్ గారితో పనిచేయడాన్ని ఎంజాయ్ చేశాను.. రామ్ చరణ్
బ్రహ్మకమలాలు విరబూస్తే నిజంగా సిరులు కురుస్తాయా?
బ్రహ్మకమలాలు విరబూస్తే నిజంగా సిరులు కురుస్తాయా?
అతి మూత్ర వ్యాధితో బాధ పడుతున్నారా.. ఇలా కంట్రోల్ చేయవచ్చు..
అతి మూత్ర వ్యాధితో బాధ పడుతున్నారా.. ఇలా కంట్రోల్ చేయవచ్చు..
'ఆ సౌత్ డైరెక్టర్ అర్ధరాత్రి ఫోన్ చేసి హోటల్‌కు రమ్మన్నాడు'..
'ఆ సౌత్ డైరెక్టర్ అర్ధరాత్రి ఫోన్ చేసి హోటల్‌కు రమ్మన్నాడు'..