మధ్యప్రదేశ్‌లో అత్యవసర భేటీకి బీజేపీ పిలుపు..!

మధ్యప్రదేశ్‌లో రాజకీయ సమీకరణాలు మారుతోన్న విషయం తెలిసిందే. అధికార పార్టీ కాంగ్రెస్‌కు చెందిన 17 మంది ఎమ్మెల్యేలు బెంగళూరుకు వెళ్లడంతో కలకలం మొదలైంది.

మధ్యప్రదేశ్‌లో అత్యవసర భేటీకి బీజేపీ పిలుపు..!

మధ్యప్రదేశ్‌లో రాజకీయ సమీకరణాలు మారుతోన్న విషయం తెలిసిందే. అధికార పార్టీ కాంగ్రెస్‌కు చెందిన 17 మంది ఎమ్మెల్యేలు బెంగళూరుకు వెళ్లడంతో కలకలం మొదలైంది. అందులో ఆరుగురు మంత్రులు కూడా ఉండగా.. వీరంతా 48 గంటల్లోగా తమ పదవులకు రాజీనామా చేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో బీజేపీ అప్రమత్తమైంది. మంగళవారం సాయంత్రం 6 గంటలకు ఎమ్మెల్యేలతో అత్యవసర సమావేశం ఏర్పాటు చేసింది. ఈ సమావేశానికి అందరూ ఎమ్మెల్యేలు భోపాల్‌కు రావాలని ఆదేశించింది.

కాగా కొద్ది రోజులుగా కాంగ్రెస్‌ అధిష్టానంపై అలకబూనిన ఆ రాష్ట్ర యువ నేత జ్యోతిరాదిత్య సింథియా ఆ పార్టీ నుంచి బయటకు రావాలని ఆలోచిస్తున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఈ క్రమంలో ఆయన బీజేపీ పెద్దలతో సంప్రదింపులు జరిపినట్లు కూడా విశ్వసనీయ వర్గాల సమాచారం. ఇదిలా ఉంటే 17మంది ఎమ్మెల్యేలు రాజీనామా చేస్తే.. మధ్యప్రదేశ్‌లో కమల్‌నాథ్ ప్రభుత్వం ఇబ్బందుల్లో పడుతుంది. 230 స్థానాలున్న శాసనసభలో బీజేపీకి 108మంది ఎమ్మెల్యేలు ఉండగా.. కాంగ్రెస్ బలం 104కు తగ్గుతుంది. దీంతో ప్రభుత్వం కూలిపోయే అవకాశాలు ఉన్నాయి.

Read This Story Also: ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికలకు నోటిఫికేషన్ విడుదల