యస్ బ్యాంక్ సంక్షోభం.. ఏడుగురిపై లుక్‌ అవుట్‌ నోటీసులు!

యస్ బ్యాంక్ సంక్షోభానికి సంబంధించి ఏడుగురు నిందితులు, రానా కపూర్, బిందు రానా కపూర్, వారి కుమార్తెలు రాధా, రాఖే, రోషిని, డీహెచ్ఎఫ్ఎల్ ప్రమోటర్ కపిల్ వాధ్వాన్, ఆర్‌కేడబ్ల్యూ ప్రమోటర్ ధీరజ్ వాధ్వాన్ లపై

యస్ బ్యాంక్ సంక్షోభం.. ఏడుగురిపై లుక్‌ అవుట్‌ నోటీసులు!
Follow us
TV9 Telugu Digital Desk

| Edited By:

Updated on: Mar 09, 2020 | 8:25 PM

Yes Bank Scam: యస్ బ్యాంక్ సంక్షోభానికి సంబంధించి ఏడుగురు నిందితులు, రానా కపూర్, బిందు రానా కపూర్, వారి కుమార్తెలు రాధా, రాఖే, రోషిని, డీహెచ్ఎఫ్ఎల్ ప్రమోటర్ కపిల్ వాధ్వాన్, ఆర్‌కేడబ్ల్యూ ప్రమోటర్ ధీరజ్ వాధ్వాన్ లపై సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (సిబిఐ) లుక్ అవుట్ నోటీసులు జారీ చేసింది. రూ.4,300కోట్ల లావాదేవీల విషయంలో రానాకపూర్‌ అవకతవకలకు పాల్పడ్డట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. విచారణ నిమిత్తం ఇప్పటికే ఆయనను అరెస్టు చేసిన ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ అధికారులు ముంబయిలోని కోర్టులో హాజరుపర్చారు.

కాగా.. న్యాయస్థానం ఆయనకు ఈ నెల 11 వరకు రిమాండ్‌ విధించింది. దేశం విడిచి వెళ్ళే ప్రయత్నాలను నివారించడానికి ఈ ఏడుగురు నిందితులపై ఎల్‌ఓసీ జారీ చేసినట్లు అధికారులు తెలిపారు. బ్యాంక్ కార్యకలాపాలలో ఆర్థిక అవకతవకలు, నిధుల దుర్వినియోగం ఆరోపణలతో సీబీఐ ఈ చర్యలకు పూనుకొంది.