AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Election Result: ఉండడానికి గుడిసె కూడా లేదు.. 12 లక్షలు అప్పు చేసి మరీ ఎన్నికల బరిలో నిలిచి ఎమ్మెల్యేగా గెలిచిన నిరుపేద వ్యక్తి..

కమలేశ్వర్ ఒక గుడిసెలో నివసిస్తున్నాడు. వర్షం కురిస్తే తమ పూరి గుడిసెను టార్పాలిన్‌తో కప్పి .. వర్షపు నీరు ఇంట్లో పడకుండా లోపల ఉన్నవారు తడవ కుండా ఈ కుటుంబం ప్రయత్నిస్తుంది. అంత నిరుపేద కుటుంబం నుంచి వచ్చిన కమలేశ్వర్ ఎమ్మెల్యేగా ఎన్నికల బరిలో దిగాడు. ఆదివారం ఎన్నికల ఓట్లు కౌంటింగ్ జరిగే సమయంలో.. సమీప ప్రత్యర్థులకు తనకు మధ్య వ్యత్యాసం పెరుగుతుండడంతో, చుట్టుపక్కల ప్రజలు కమలేశ్వర్ అభినందనలు తెలుపుతూనే ఉన్నారు.

Election Result:  ఉండడానికి గుడిసె కూడా లేదు.. 12 లక్షలు అప్పు చేసి మరీ ఎన్నికల బరిలో నిలిచి ఎమ్మెల్యేగా గెలిచిన నిరుపేద వ్యక్తి..
Mla Kamleshwar Dodiyar
Surya Kala
|

Updated on: Dec 04, 2023 | 10:10 AM

Share

దేశ వ్యాప్తంగా ఉత్కంఠంగా ఎదురుచూసిన నాలుగు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు వెలువడ్డాయి. మధ్యప్రదేశ్, రాజస్థాన్, ఛత్తీస్‌గఢ్‌లలో బీజేపీ విజయ బావుటా ఎగురవేసింది. అయితే తెలంగాణలో మాత్రం కాంగ్రెస్‌కు కొంత ఊరట లభించింది. ఎన్నికలు జరిగిన అన్ని రాష్ట్రాల్లో హేమాహేమీలతో తలపడుతూ కొందరు పేద అభ్యర్థులు పోటీకి దిగారు. అత్యంత పేదరికంలో బాధపడుతూ కూడా తమ అదృష్టాన్ని పరీక్షించుకున్నారు. వారిలో కొందరికి డిపాజిట్ కూడా దక్కకపోయినా.. ఒకరు మాత్రం ప్రస్తుతం వార్తల్లో నిలుస్తున్నాడు. అతనే మధ్యప్రదేశ్‌కు చెందిన కమలేశ్వర్ దొడియార్.

రాష్ట్రంలోని రత్లాంకు చెందిన కమలేశ్వర్ దొడియార్ ఎన్నికల బరిలో నిలిచాడు. అయితే అతని వద్ద ఎన్నికల్లో పోటీ చేసేందుకు తగినంత డబ్బు లేదు. అత్యంత పేదకుటుంబానికి చెందిన కమలేశ్వర్ 12 లక్షల అప్పు తీసుకున్నాడు. మహామహలు రంగంలో ఉన్న తన నియోజ వర్గంలో ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీకి నిలబడ్డాడు. రాష్ట్రంలోనే అత్యధిక ఓట్లు ఈ స్థానంలో పోలైన సైలానా స్థానం నుంచి కాంగ్రెస్ అభ్యర్థి హర్ష్ విజయ్ గెహ్లాట్‌పై కమలేశ్వర్ 4618 ఓట్ల తేడాతో విజయం సాధించాడు. కమలేశ్వర్‌కు 71219 ఓట్లు రాగా, హర్ష్‌కు 66601 ఓట్లు వచ్చాయి. బీజేపీకి చెందిన సంగీతా చారెల్ మూడో స్థానంలో నిలీచాడు. ఇక్కడ మొత్తం 90.08 శాతం ఓటింగ్ జరిగింది.

కమలేశ్వర్ ఒక గుడిసెలో నివసిస్తున్నాడు. వర్షం కురిస్తే తమ పూరి గుడిసెను టార్పాలిన్‌తో కప్పి .. వర్షపు నీరు ఇంట్లో పడకుండా లోపల ఉన్నవారు తడవ కుండా ఈ కుటుంబం ప్రయత్నిస్తుంది. అంత నిరుపేద కుటుంబం నుంచి వచ్చిన కమలేశ్వర్ ఎమ్మెల్యేగా ఎన్నికల బరిలో దిగాడు. ఆదివారం ఎన్నికల ఓట్లు కౌంటింగ్ జరిగే సమయంలో.. సమీప ప్రత్యర్థులకు తనకు మధ్య వ్యత్యాసం పెరుగుతుండడంతో, చుట్టుపక్కల ప్రజలు కమలేశ్వర్ అభినందనలు తెలుపుతూనే ఉన్నారు చివరకు భారీ మెజార్టీటీతో గెలిచిన కమలేశ్వర్ కు విజయాన్ని ఇరుగుపొరుగు సంబరంగా జరుపుకున్నారు.

ఇవి కూడా చదవండి

33 ఏళ్ల కమలేశ్వర్ భరత్ ఆదివాసీ పార్టీ నుండి ఎమ్మెల్యేగా విజయం సాధించాడు. ఇతని తల్లి సీతాబాయి కూలి. సోదరులు, 3 సోదరీమణులలో కమలేశ్వర్ చిన్నవాడు. కూలీ కుటుంబానికి చెందిన కమలేశ్వర్  డిగ్రీ చదివిన తర్వాత కోటకు ఉపాధి నిమిత్తం వెళ్ళాడు. ఇంటి నిర్మాణ కూలీగా పనిచేస్తున్నాడు. చిన్నప్పటి నుంచి ఇప్పటి వరకు పేదరికాన్ని దగ్గరగా చుసిన వ్యక్తి కమలేశ్వర్.

మధ్యప్రదేశ్‌లో తిరిగి బీజేపీ ప్రభుత్వం

మధ్యప్రదేశ్ ఎన్నికల ఫలితాలను పరిశీలిస్తే ఇక్కడ బీజేపీ అద్భుత ప్రదర్శన చేసిందనే చెప్పవచ్చు. అధికార వ్యతిరేకత ఎక్కడా ప్రభావం చూపించలేదు. మొత్తం 165 సీట్లు గెలుచుకుని ప్రభుత్వం ఏర్పాటుకు రంగం సిద్ధం చేసుకుంది. కాంగ్రెస్‌కు 63 సీట్లు మాత్రమే వచ్చాయి. మధ్యప్రదేశ్‌లో బీజేపీ అధికారంలోకి వచ్చి రెండు దశాబ్దాలు అయింది. అయితే తాజాగా గెలుపుతో అధికార పార్టీ పై వ్యతిరేకత లేదని ఎన్నికల ఫలితాలు చెబుతున్నాయి. ఎన్నికల ఫలితాల్లో బంపర్ విజయం సాధించిన తర్వాత సీఎం ఎంపిక బీజేపీకి తలనొప్పిగా మారింది. శివరాజ్‌సింగ్ చౌహాన్‌ను ముఖ్యమంత్రిని చేస్తారా లేక రాష్ట్రంలోని మరే ఇతర నేతకైనా అవకాశం ఇస్తుందా అన్నది చూడాలి మరి

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

రోజూ ఇవి రెండు తింటే చాలు.. లెక్కలేనన్ని ఆరోగ్య ప్రయోజనాలు..
రోజూ ఇవి రెండు తింటే చాలు.. లెక్కలేనన్ని ఆరోగ్య ప్రయోజనాలు..
టీ20 వరల్డ్ కప్ స్క్వాడ్ ఫైనల్ నేడే..ఈ 5 కీలక అంశాలపైనే అందరిచూపు
టీ20 వరల్డ్ కప్ స్క్వాడ్ ఫైనల్ నేడే..ఈ 5 కీలక అంశాలపైనే అందరిచూపు
ఉదయం Vs రాత్రి.. స్నానం చేయడానికి బెస్ట్ టైమ్ ఏదీ..?
ఉదయం Vs రాత్రి.. స్నానం చేయడానికి బెస్ట్ టైమ్ ఏదీ..?
నిరుద్యోగులకు గుడ్‌న్యూస్.. త్వరలో రైల్వే ఉద్యోగ నోటిఫికేషన్‌
నిరుద్యోగులకు గుడ్‌న్యూస్.. త్వరలో రైల్వే ఉద్యోగ నోటిఫికేషన్‌
మహిళలకు గుడ్‌న్యూస్‌.. బ్యాంక్‌ అకౌంట్‌లోకి రూ.15 వేలు
మహిళలకు గుడ్‌న్యూస్‌.. బ్యాంక్‌ అకౌంట్‌లోకి రూ.15 వేలు
ప్లీజ్ కామెరాన్.. ఇక ఆపేస్తే బెటరేమో బాస్.. అవతార్ 3 రివ్యూ
ప్లీజ్ కామెరాన్.. ఇక ఆపేస్తే బెటరేమో బాస్.. అవతార్ 3 రివ్యూ
పురుషుల మూత్రం ఆ రంగులో ఉంటే.. క్యాన్సర్ సంకేతమా? వాస్తవం ఏంటి.?
పురుషుల మూత్రం ఆ రంగులో ఉంటే.. క్యాన్సర్ సంకేతమా? వాస్తవం ఏంటి.?
ఊరు ఊరంతా కరెంట్‌ షాక్‌.. సెల్‌ఫోన్‌ ఛార్జింగ్‌ పెడుతూ యువకుడు
ఊరు ఊరంతా కరెంట్‌ షాక్‌.. సెల్‌ఫోన్‌ ఛార్జింగ్‌ పెడుతూ యువకుడు
11 సినిమాలు చేస్తే అన్ని అట్టర్ ప్లాప్.. ఫాలోయింగ్ చూస్తే..
11 సినిమాలు చేస్తే అన్ని అట్టర్ ప్లాప్.. ఫాలోయింగ్ చూస్తే..
కొబ్బరి, బెల్లం కలిపి తిన్నారంటే..
కొబ్బరి, బెల్లం కలిపి తిన్నారంటే..