Narendra Modi: మూడు రాష్ట్రాల్లో బీజేపీ గెలుపుపై తొలిసారి స్పందించిన ప్రధాని మోదీ..
దేశ వ్యాప్తంగా నాలుగు రాష్ట్రాల్లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల ఫలితాలపై ప్రధాని నరేంద్ర మోదీ మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. మొత్తం నాలిగింట మూడు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ గెలవడంపై ప్రధాని మోదీ హర్షం వ్యక్తం చేశారు. ప్రజలు బీజేపీ సుపరిపాలనకు ప్రజలు ఓటు వేశారన్నారు. మూడు రాష్ట్రాల్లో విజయం సాధించడంతో బీజేపీ క్యాడర్ లో కొత్త ఉత్సాహం కలిగించిందని కాసేపట్లో పార్లమెంట్ శీతాకాల సమావేశాలు జరుగుతున్నాయని తెలిపారు.

దేశ వ్యాప్తంగా నాలుగు రాష్ట్రాల్లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల ఫలితాలపై ప్రధాని నరేంద్ర మోదీ మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. మొత్తం నాలిగింట మూడు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ గెలవడంపై ప్రధాని మోదీ హర్షం వ్యక్తం చేశారు. ప్రజలు బీజేపీ సుపరిపాలనకు ప్రజలు ఓటు వేశారన్నారు. మూడు రాష్ట్రాల్లో విజయం సాధించడంతో బీజేపీ క్యాడర్ లో కొత్త ఉత్సాహం కలిగించిందని కాసేపట్లో పార్లమెంట్ శీతాకాల సమావేశాలు జరుగుతున్నాయని తెలిపారు. కొత్త పార్లమెంట్ లో నిర్మాణాత్మక, అర్థవంతమైన చర్చ జరగాలి. దానికి ప్రతిపక్షం సహకరించాలని కోరారు. కొన్ని కీలక బిల్లులు ప్రవేశ పెట్టే అవకాశం ఉన్నట్లు తెలిపారు. విపక్షాలు నెగిటివ్ గా ఆలోచించడం మానేయాలని సూచించారు.
నాలుగు రాష్ట్రాల ఎన్నికల ఫలితాల తరువాత జరగనున్న పార్లమెంట్ సమావేశాలు కావడంతో దేశ వ్యాప్తంగా ఆసక్తికరంగా నెలకొంది. పార్లమెంట్ శీతాకాల సమావేశాల నిర్వహణపై గతంలో అఖిలపక్ష భేటీకి కేంద్రం పిలుపునిచ్చిన సంగతి మనకు తెలిసిందే. అన్ని పార్టీల పార్లమెంట్ సభ్యులను సమావేశానికి రావాలంటూ ఆహ్వానించింది. ఈ సెషన్‌లో పలు కీలక బిల్లులను పార్లమెంట్‌లో ప్రవేశపెట్టాలనుకుంటోంది బీజేపీ ప్రభుత్వం. ఉదయం 10 గంటలకు సభ ప్రారంభమైంది. ముందుగా సభలోని సభ్యులందరూ మూడు రాష్ట్రాల్లో బీజేపీ గెలవడంపై మోదీకి శుభాకాంక్షలు తెలిపారు. ప్రస్తుతం 37 బిల్లులు పెండింగ్‌లో ఉండగా.. కొత్తగా మరో 7 బిల్లులను ప్రవేశపెట్టబోతోంది. అలాగే, భారతీయ శిక్షా స్మృతి, నేర శిక్షా స్మృతి, సాక్ష్యాధారాల చట్టాల స్థానంలో కొత్త బిల్లులను సభ ముందుంచనుంది. చీఫ్ ఎలక్షన్ కమిషనర్, ఎలక్షన్ కమిషనర్ల నియామక బిల్లునూ ప్రవేశపెట్టే అవకాశముంది. ఈసారి శీతాకాల సమావేశాలు వాడివేడిగా జరుగుతాయని చెప్పాలి. దీనిపై ప్రతిపక్షాలు ఏవిధంగా స్పందిస్తాయో కూడా వేచి చూడాలి.
మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..