MP Election 2023: మళ్లీ వార్తల్లో నిలిచిన షాదోల్ జిల్లా.. చరిత్ర పునరావృతం చేసేందుకు సిద్ధమవుతున్న థర్డ్ జెండర్
MP Election 2023: 23 సంవత్సరాల తర్వాత, మధ్యప్రదేశ్‌లో మరోసారి థర్డ్ జెండర్ ఎమ్మెల్యే బరిలో నిలిచారు. థర్డ్ జెండర్ కాజల్ అభ్యర్థిత్వం తర్వాత, షాదోల్ అసెంబ్లీ నియోజకవర్గం ఎన్నికల రాజకీయం మరోసారి వార్తల్లోకి వచ్చింది. షాదోల్ జిల్లాలోని జైత్‌పూర్ అసెంబ్లీ స్థానం నుంచి కాజల్ అనే థర్డ్ జెండర్ నామినేషన్ దాఖలు చేశారు.

23 సంవత్సరాల తర్వాత, మధ్యప్రదేశ్‌లో మరోసారి థర్డ్ జెండర్ ఎమ్మెల్యే బరిలో నిలిచారు. థర్డ్ జెండర్ కాజల్ అభ్యర్థిత్వం తర్వాత, షాదోల్ అసెంబ్లీ నియోజకవర్గం ఎన్నికల రాజకీయం మరోసారి వార్తల్లోకి వచ్చింది. షాదోల్ జిల్లాలోని జైత్‌పూర్ అసెంబ్లీ స్థానం నుంచి కాజల్ అనే థర్డ్ జెండర్ నామినేషన్ దాఖలు చేశారు.
నామినేషన్ సమర్పణకు చివరి తేదీ కావడంతో కాజల్ రియల్ ఇండియా పార్టీ తరపున షాదోల్ జిల్లాలోని జైత్‌పూర్ అసెంబ్లీ స్థానం నుండి తన నామినేషన్ దాఖలు చేశారు. ప్రజల అభివృద్ధి కోసమే రాజకీయాల్లోకి వచ్చానన్నారు కాజల్. బీజేపీ, కాంగ్రెస్ లు ప్రజలకు తప్పుడు హామీలు ఇస్తున్నాయని, జనం సమస్యలను పరిష్కరించడంలో విఫలమయ్యారని విమర్శించారు. ప్రజల నిత్య జీవితానికి సంబంధించిన అనేక సమస్యలు ఉన్నాయని, వాటిని పరిష్కరించాల్సిన అవసరం ఉందని.. ఎమ్మెల్యేగా ఎన్నికైతే ఈ దిశగా కృషి చేస్తానన్నారు కాజల్.
23 ఏళ్ల క్రితం థర్డ్ జెండర్ కమ్యూనిటీకి చెందిన అభ్యర్థిని ఎన్నికల్లో గెలిపించి షాదోల్ జిల్లా భారత రాజకీయాల్లో చరిత్ర సృష్టించింది. వాస్తవానికి, 2000 సంవత్సరంలో షాదోల్ జిల్లా సోహగ్‌పూర్ స్థానం నుండి మాజీ ఎమ్మెల్యే కెపి సింగ్ మరణించిన తర్వాత. .ఫిబ్రవరి నెలలో ఉప ఎన్నికలు జరుగాయి. ఈ ఎన్నికల్లో విజయం సాధించిన థర్డ్ జెండర్ షబ్నమ్ మౌసీ, దేశంలోనే తొలిసారి ఎమ్మెల్యేగా గెలిచిన థర్డ్ జెండర్‌గా చరిత్రకెక్కారు. షాదోల్ జిల్లాలోని సోహగ్‌పూర్ అసెంబ్లీ స్థానం ఎప్పుడూ కాంగ్రెస్‌కు కంచుకోట. దేశంలో ఎమర్జెన్సీ తర్వాత జరిగిన ఎన్నికల్లో మాజీ ప్రధాని ఇందిరాగాంధీ కూడా ఓడిపోయారు. అప్పుడు షాదోల్‌లోని సోహగ్‌పూర్‌లో కాంగ్రెస్‌కు చెందిన కెపి సింగ్ ఘన విజయం సాధించారు.
స్వతంత్ర అభ్యర్థిగా నామినేషన్ దాఖలు థర్డ్ జెండర్ షబ్నమ్ అనుప్పూర్‌లో నివసించారు. ఎమ్మెల్యే కాకముందు వీధుల్లో డ్యాన్స్ చేస్తూ, పాటలు పాడుతూ జీవనం సాగించేది. రాజకీయ పార్టీల పట్ల ప్రజల్లో తీవ్ర ఆగ్రహం ఉన్న కాలం అది. కాంగ్రెస్ దిగ్విజయ్ ప్రభుత్వంపై ప్రజలు తీవ్ర ఆగ్రహంతో ఉన్నారు. షబ్నమ్ సుహాగ్‌పూర్ స్థానం నుండి ఉప ఎన్నికలో పోటీ చేయడానికి ప్రజల నుండి మద్దతు పొందారు. షబ్నమ్ స్వతంత్ర అభ్యర్థిగా ఎమ్మెల్యేగా నామినేషన్ దాఖలు చేశారు. కాంగ్రెస్, బీజేపీల అధికార అభ్యర్థులతో కలిపి మొత్తం 9 మంది బరిలో నిలిచారు. షబ్నమ్ స్వతంత్ర అభ్యర్థిగా ఎన్నికల గుర్తు గాలిపటం పొందారు. ప్రచారంలో ఇతర అభ్యర్థులు ఆమె దగ్గరకు కూడా చేరుకోలేకపోయారు. థర్డ్ జెండర్ కమ్యూనిటీ నుంచి వచ్చిన షబ్నమ్ ఇక్కడి ఎన్నికల్లో గెలిచి భారత రాజకీయాల్లో కొత్త అధ్యాయాన్ని లిఖించారు. ఇప్పుడు కాజల్ కూడా షబ్నమ్‌లా విజయం సాధించి ఎమ్మెల్యేగా మరోసారి చరిత్ర పునరావృతం చేస్తుందో లేదో చూడాలి..!
మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి…