AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Srinagar G 20: శ్రీనగర్‌లో విజయవంతంగా ముగిసిన G-20 సదస్సు.. చిగురిస్తున్న కశ్మీరీల కొత్త ఆశలు..

G-20 వర్కింగ్‌ గ్రూప్‌ సమావేశం విజయవంతంగా శ్రీనగర్‌లో ముగియడంతో కశ్మీర్‌ వాసుల్లో ఆనందం వ్యక్తమవుతోంది. కచ్చితంగా ఇది మార్పుకు ప్రతిబింబమని అంటున్నారు. గతంలో జరిగిన సమావేశాలకు ఈ సమావేశాన్ని ఎంతో తేడా ఉందనే విషయాన్ని కశ్మీర్‌ వాసులు గుర్తించారు. గడిచిన 30-40 ఏళ్లుగా తాము ఎదుర్కొన్న కష్టాలు తమ పిల్లలకు వద్దని ముక్తకంఠంతో చెప్తున్నారు.

Srinagar G 20: శ్రీనగర్‌లో విజయవంతంగా ముగిసిన G-20 సదస్సు.. చిగురిస్తున్న కశ్మీరీల కొత్త ఆశలు..
Srinagar G20
Sanjay Kasula
|

Updated on: May 25, 2023 | 8:44 PM

Share

పర్యాటకుల స్వర్గధామం కశ్మీర్‌లో దాదాపు నాలుగేళ్ల విరామం తర్వాత తొలి అంతర్జాతీయ సదస్సు విజయవంతంగా ముగిసింది. జీ-20 కూటమికి అధ్యక్షత వహిస్తున్న భారత్‌- దేశంలోని ప్రధాన నగరాల్లో వర్కింగ్‌ గ్రూప్స్‌తో కీలక సమావేశాలు నిర్వహిస్తోంది. ఇందులో భాగంగా కేంద్ర పాలిత ప్రాంతం కశ్మీర్‌లో G-20 టూరిజం వర్కింగ్‌ గ్రూప్‌ సమావేశాన్ని ఏర్పాటు చేసింది. ఈ నెల 22 నుంచి 24 వరకు జరిగిన ఈ సదస్సులో G-20లో భాగంగా ఉన్న 27 దేశాలకు చెందిన 61 మంది ప్రతినిధులు హాజరయ్యారు. కశ్మీర్‌లో G-20 సదస్సును అక్కడి ప్రజలు స్వాగతిస్తున్నారు. దీని ద్వారా తమకు ముఖ్యంగా టూరిజంపై ఆధారపడిన వారికి మేలు జరుగుతుందని భావిస్తున్నారు.

గతంలో మాదిరిగా రావడం, పోవడం, కేవలం ప్రకటనలకే పరిమితం కాకుండా ఈ G-20 సదస్సు ఇక్కడి సమస్యలు ముఖ్యంగా నిరుద్యోగంపై దృష్టి సారించి దాన్ని రూపుమాపాల్సిన అవసరం ఉంది. ఇక్కడి నిరుద్యోగ యువకులను ప్రధాన స్రవంతిలోకి తీసుకురావాలి.

శ్రీనగర్‌లోని వివిధ ప్రదేశాలను సందర్శించిన విదేశీ ప్రతినిధులు అక్కడి అందాలు చూసి మురిసిపోయారు. ఇది భూతల స్వర్గమని కొనియాడారు. కశ్మీర్‌ అద్భుతమైన ప్రదేశామని, ఇక్కడ ప్రజలు సహృదయులని దక్షిణ కొరియా రాయబారి ప్రశంసించారు. కశ్మీర్‌ అందాలు చూసేందుకు, ఇక్కడి వైవిధ్యాన్ని తిలకించేందుకు చాలా మంది వస్తారని ఆకాంక్షించారు. G20 సదస్సు కశ్మీర్‌ను తిరిగి టూరిజం మ్యాప్‌పై నిలబెట్టిందని నెదర్లాండ్స్‌ ప్రతినిధి తెలిపారు.

తాను ఇంతకు ముందు ఎప్పుడు కశ్మీర్‌ చూడలేదు. ఇలా ఉంటుందని నేను ఊహించలేదు. ఇది ప్రమాదకరమైన ప్రదేశం, మంచి ప్లేస్‌ కాదని మా ప్రభుత్వం చెప్పింది. కాని ఇది నిజంగా భూమిపై ఉన్న స్వర్గం. ఇది చాలా అద్భుతమైన ప్రదేశం.

మరో వైపు అంతర్జాతీయ సదస్సు శ్రీనగర్‌లో జరగడంతో జమ్ము-కశ్మీర్‌ వాసులు ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఈ సదస్సు ద్వారా పర్యాటకం, వ్యాపారం పెరుగుతుందని ఆకాంక్షిస్తున్నారు. ముఖ్యంగా టూరిజం రంగానికి ఇది మేలు చేస్తుంది. అంతర్జాతీయ ఖ్యాతిగాంచిన హస్తకళలు, కుంకుమ పూవు వంటివి ఇక్కడ చాలా ఉన్నాయి. వీటికి చాలా పెద్ద మార్కెట్‌ ఉందన్నారు శ్రీనగర్‌ వ్యాపారి.

శ్రీనగర్‌లో జరిగిన G-20 సదస్సుపై కశ్మీర్‌ వాసులు భారీ అంచనాలు పెట్టుకున్నారు. గడిచిన కొన్నేళ్లుగా ఉగ్రవాదంతో పెనుసమస్యలు ఎదుర్కొన్న కశ్మీర్‌ వాసులు ఇప్పుడు మార్పును కోరుకుంటున్నారు. తాజా పరిణామాలతో పరిస్థితుల్లో సానుకూలత ఏర్పడుతుందని భావిస్తున్నారు. తాము చూసిన సమస్యలను తమ తర్వాతి తరం చూడకూడదని కోరుకుంటున్నామని కశ్మీర్‌ వాసుల కోరుకుంటున్నారు. తన చిన్నతనంలో అంటే 90 దశకాల్లో తాము చూసిన సమస్యలను మా పిల్లలు చూడకూడదని తాము కోరుకుంటున్నామని అన్నారు కశ్మీర్‌ వాసి. ఇప్పుడు కొత్త తరం వాటిని చూడకూడదని తాను అనుకుంటున్నాని అన్నారు.

మూడు రోజుల పాటు శ్రీనగర్‌లో G-20 వర్కింగ్‌ గ్రూప్‌ సమావేశం విజయవంతంగా సాగేందుకు కేంద్ర ప్రభుత్వం కట్టుదిట్టమైన భద్రతా చర్యలు చేపట్టింది. ఈ సదస్సు సందర్బంగా శ్రీనగర్‌లో ఎటువంటి అవాంఛనీయ సంఘటన జరగకుండా చూసేందుకు NSG – మెరైన్‌ కమాండోలను మొహరించింది. ఏది ఏమైనా ఈ సదస్సు విజయవంతం కావడం మారుతున్న కశ్మీర్‌ పరిస్థితులకు అద్దం పడుతోంది.

మరిన్ని జాతీయ వార్తల కోసం