LPG Cylinder: ఐదేళ్లలో గ్యాస్ సిలిండర్ ధర ఎంత పెరిగింది.. ఎన్నిసార్లు పెరిగిందో తెలుసా…?

ఇటీవల కాలంలో ఎప్పుడూ చూసినా గ్యాస్ ధరలు పెరిగాయి, పెట్రోలు, డీజిల్ ధరలు పెరిగాయనే వార్తలు ఎక్కువుగా వినిపిస్తున్నాయి. ఎప్పుడో తప్పితే దీనికి సంబంధించిన వార్తలు లేని రోజులు తక్కువనే చెప్పుకోవాలి. గతంతో..

LPG Cylinder: ఐదేళ్లలో గ్యాస్ సిలిండర్ ధర ఎంత పెరిగింది.. ఎన్నిసార్లు పెరిగిందో తెలుసా...?
Follow us
Amarnadh Daneti

|

Updated on: Sep 03, 2022 | 12:20 PM

LPG Cylinder: ఇటీవల కాలంలో ఎప్పుడూ చూసినా గ్యాస్ ధరలు పెరిగాయి, పెట్రోలు, డీజిల్ ధరలు పెరిగాయనే వార్తలు ఎక్కువుగా వినిపిస్తున్నాయి. ఎప్పుడో తప్పితే దీనికి సంబంధించిన వార్తలు లేని రోజులు తక్కువనే చెప్పుకోవాలి. గతంతో పోలిస్తే వంట గ్యాస్ ధరలు ఎక్కువుగా పెరగడంతో సామాన్యుడికి పెను భారంగా మారింది. ప్రతిపక్ష పార్టీలు సైతం గ్యాస్ ధరల పెంపు విషయంలో కేంద్రప్రభుత్వం తీరును తప్పుపడుతూ నిరసనలు సైతం తెలిపాయి. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత వంట గ్యాస్ ధరలు అధికంగా పెరిగాయంటూ విమర్శలు గుప్పిస్తున్నాయి. ఈదశలో గత ఐదేళ్ల కాలంలో గ్యాస్ రేట్లు ఎన్నిసార్లు పెరిగాయి.. ఎంత మేర పెరిగాయనేది చూసుకుంటే.. గతంలో ఎన్నడూ లేని విధంగా ఐదేళ్ల కాలంలో సుమారు 58 సార్లు గ్యాస్ ధరల హెచ్చు, తగ్గులు చోటుచేసుకున్నాయి.

కేంద్ర పెట్రోలియం మంత్రిత్వ శాఖ అధికారిక డేటా ప్రకారం 2017 ఏప్రియల్ 1వ తేదీ నుంచి 2022 జులై 6వ తేదీ మధ్య 58 సార్లు గ్యాస్ ధరలు సవరించబడ్డాయి. వీటిలో పెరుగుదల, తగ్గుదల రెండూ కలిపి ఉన్నాయి. అయితే 58 సార్లు వంట గ్యాస్ ధరల సవరణ ద్వారా 45% మేర గ్యాస్ ధరలు పెరిగాయి. 2017 ఏప్రిల్ లో LPG సిలిండర్ ధర రూ.723 ఉండగా, జూలై 2022 నాటికి 45 శాతం పెరిగి రూ.1,053కి చేరింది. 2021 జూలై 1వ తేదీ నుంచి 2022 జులై6వ తేదీ మధ్య 12 నెలల కాలంలో వంట గ్యాస్ సిలిండర్ ధర 26శాతం పెరిగిందని కేంద్ర పెట్రోలియం మంత్రిత్వ శాఖ వెల్లడించిన అధికారిక డేటా ప్రకారం తెలుస్తోంది. 2021 జూలైలో అదే LPG సిలిండర్ ధర రూ. 834 ఉండగా.. 2022 జూలై నాటికి దీని ధర 26 శాతం పెరిగి రూ. 1,053కి చేరుకుంది. ఇదిలా ఉంటే LPG సిలిండర్ ధరలు ప్రతి రాష్ట్రంలో విభిన్నంగా ఉంటాయ. ఒక్కో చోట ఒక్కో విధంగా ధరలు ఉంటాయి. ప్రాంతాలను బట్టి స్వల్పంగా మాత్రమే ఈధరలో తేడా కన్పించినప్పటికి.. భారీగా ఢిఫరెన్స్ ఉండదు. వ్యాట్, రవాణా ఛార్జీల ఆధారంగా ప్రాంతాలను బట్టి ధరలు ఆధారపడి ఉంటాయి.

ఇవి కూడా చదవండి

మరిన్ని జాతీయ వార్తల కోసం చూడండి..

నువ్వు గల్లీ క్రికెట్‌ ఆడుతున్నావా? జైస్వాల్‌కు రోహిత్ వార్నింగ్
నువ్వు గల్లీ క్రికెట్‌ ఆడుతున్నావా? జైస్వాల్‌కు రోహిత్ వార్నింగ్
ఇంటి వద్దనే డైట్ చేస్తూ ఏకంగా 18 కేజీల బరువు తగ్గిన లేడీ..
ఇంటి వద్దనే డైట్ చేస్తూ ఏకంగా 18 కేజీల బరువు తగ్గిన లేడీ..
హార్మోన్ ఇన్‌‌బ్యాలెన్స్ వల్లే కంట్రోల్ తప్పాను.. విష్ణుప్రియ
హార్మోన్ ఇన్‌‌బ్యాలెన్స్ వల్లే కంట్రోల్ తప్పాను.. విష్ణుప్రియ
Jio, Airtel నుంచి దిమ్మదిరిగే ప్లాన్‌.. రూ.650తో ఏడాది పాటు డేటా
Jio, Airtel నుంచి దిమ్మదిరిగే ప్లాన్‌.. రూ.650తో ఏడాది పాటు డేటా
యాదాద్రి జిల్లాలో నకిలీ కరెన్సీ కలకలం..కేటుగాళ్ల టార్గెట్‌ ఎవరంటే
యాదాద్రి జిల్లాలో నకిలీ కరెన్సీ కలకలం..కేటుగాళ్ల టార్గెట్‌ ఎవరంటే
అప్పటి వరకు చెప్పులు వేసుకోను.. అన్నామలై సంచలన ప్రకటన
అప్పటి వరకు చెప్పులు వేసుకోను.. అన్నామలై సంచలన ప్రకటన
ఫ్రిజ్ వాడుతున్నారా? అయితే ఈ పొరపాట్లు అస్సలు చేయకండి!
ఫ్రిజ్ వాడుతున్నారా? అయితే ఈ పొరపాట్లు అస్సలు చేయకండి!
ఈ పండు క్యాన్సర్‌ని కూడా నయం చేస్తుంది..! రోజుకు రెండు తింటే చాలు
ఈ పండు క్యాన్సర్‌ని కూడా నయం చేస్తుంది..! రోజుకు రెండు తింటే చాలు
గోల్డ్ లోన్ కంపెనీలు మీ బంగారాన్ని ఎందుకు వేలం వేస్తున్నాయి?
గోల్డ్ లోన్ కంపెనీలు మీ బంగారాన్ని ఎందుకు వేలం వేస్తున్నాయి?
పెళ్లిళ్లలో క్యాటరింగ్ గర్ల్.. ఇప్పుడు నెట్టింట ఫేమస్..
పెళ్లిళ్లలో క్యాటరింగ్ గర్ల్.. ఇప్పుడు నెట్టింట ఫేమస్..