కోవిడ్ లక్షణాలున్నవారితోనే నాలుగు రెట్లు అధికంగా వైరస్ వ్యాప్తి… లండన్‌కు చెందిన ఇంపీరియల్ కాలేజీ అధ్యయనంలో వెల్లడి…

కోవిడ్-19 లక్షణాలున్న వ్యక్తుల నుంచే నాలుగు రెట్లు అధికంగా కరోనా వైరస్‌ వ్యాప్తి చెందుతుందని ఒక అధ్యయనంలో వెల్లడయ్యింది. కరోనా బాధితులతో నివసించే వారు ముఖ్యంగా కుటుంబసభ్యులకు వైరస్‌ సోకే ముప్పు ఎక్కువని లండన్‌కు చెందిన ఇంపీరియల్ కాలేజీ అధ్యయనంలో గుర్తించారు.

కోవిడ్ లక్షణాలున్నవారితోనే నాలుగు రెట్లు అధికంగా వైరస్ వ్యాప్తి... లండన్‌కు చెందిన ఇంపీరియల్ కాలేజీ అధ్యయనంలో వెల్లడి...
Follow us
uppula Raju

|

Updated on: Nov 29, 2020 | 5:50 PM

కోవిడ్-19 లక్షణాలున్న వ్యక్తుల నుంచే నాలుగు రెట్లు అధికంగా కరోనా వైరస్‌ వ్యాప్తి చెందుతుందని ఒక అధ్యయనంలో వెల్లడయ్యింది. కరోనా బాధితులతో నివసించే వారు ముఖ్యంగా కుటుంబసభ్యులకు వైరస్‌ సోకే ముప్పు ఎక్కువని లండన్‌కు చెందిన ఇంపీరియల్ కాలేజీ అధ్యయనంలో గుర్తించారు. దీంతో కరోనా వైరస్‌ నిర్ధారణ కాగానే ఆ వ్యక్తిని ఐసోలేషన్‌లో ఉంచడం ద్వారా వైరస్‌ వ్యాప్తిని అరికట్టే అవకాశం ఉందని సూచించింది.

ఇళ్లలోనే వైరస్ వేగంగా వ్యాప్తి…

వైరస్‌ వ్యాప్తి తీరుపై ఇంపీరియల్‌ కాలేజీ పరిశోధకులు అధ్యయనం నిర్వహించారు. కార్యాలయాలు, ఇతర పని ప్రదేశాలు, సామాజిక కార్యక్రమాల్లో కంటే ఇళ్లలోనే వైరస్‌ వేగంగా వ్యాపిస్తుందని అధ్యయనంలో పేర్కొంది. కరోనా బాధితుడితో వరుసగా ఐదు రోజులు ఇల్లు పంచుకునే కుటుంబ సభ్యులకు వైరస్‌ సోకే ప్రమాదం అధికంగా ఉంటుందని తెలియజేసింది. ప్రపంచవ్యాప్తంగా జరిగిన 45‘కాంటాక్ట్‌ ట్రేసింగ్‌’అధ్యయనాలపై స్టాటిస్టికల్‌ రివ్యూ నిర్వహించిన ఈ ఫలితాలను వెల్లడించింది ఆ సంస్థ.

వైరస్ వ్యాప్తిని అరికట్టడంలో లక్షణాలు బయటపడనివారే సవాల్‌గా మారిందని తెలిపింది. లక్షణాలు లేకపోవడం వల్లే ‘కాంటాక్ట్‌ ట్రేసింగ్‌’లో అసలు వైరస్‌ను ఎవరు వ్యాప్తి చేస్తున్నారో గుర్తించలేకపోతున్నామని పేర్కొంది. వ్యాప్తికి, వయసుకి సంబంధం ఉన్నట్లు ఎలాంటి ఆధారాలు లభించలేదని తెలిపింది. వివిధ ప్రదేశాల్లో వైరస్‌ వ్యాప్తి తీరు ఎలా ఉందో అర్థం చేసుకోడానికి ఇది ఉపయోగపడుతుందని అధ్యయనంలో పాల్గొన్న ప్రొఫెసర్‌ హేలే థామ్సన్‌ అభిప్రాయపడ్డారు. దీని వల్ల మహమ్మారి వ్యాప్తిని అడ్డుకోవడానికి మరింత కట్టుదిట్టమైన చర్యలు తీసుకునేందుకు మార్గదర్శకాలు రూపొందించొచ్చని తెలిపారు. లక్షణాల్లేని కేసులు కంటే లక్షణాలు బయటపడ్డ వ్యక్తుల ద్వారానే వైరస్ వ్యాప్తి ఎక్కువని తొలిసారిగా శాస్త్రీయ ఆధారం లభించింది. ఇది ఇంటిలో వైరస్ వ్యాప్తి ప్రాముఖ్యతను మరింత బలోపేతం చేస్తుంది.. ప్రత్యేకించి రోగలక్షణాలున్న కేసులను వేరుచేయలేమని ఇంపీరియల్ కాలేజీ ప్రొఫెసర్ నీల్ ఫెర్గూసన్ చెప్పారు.

ఈ లావాదేవీలకు ఆదాయపు పన్ను శాఖ నోటీసు పంపుతుందా?
ఈ లావాదేవీలకు ఆదాయపు పన్ను శాఖ నోటీసు పంపుతుందా?
హైకోర్టులో క్లర్క్‌ ఉద్యోగాలకు నోటిఫికేషన్‌ విడుదల
హైకోర్టులో క్లర్క్‌ ఉద్యోగాలకు నోటిఫికేషన్‌ విడుదల
సికింద్రాబాద్ ​నుంచి కుంభమేళాకు IRCTC ప్యాకేజీ.. వివరాలు ఏమిటంటే
సికింద్రాబాద్ ​నుంచి కుంభమేళాకు IRCTC ప్యాకేజీ.. వివరాలు ఏమిటంటే
ఓటీటీలో అద్దిరిపోయే సర్వైవల్ థ్రిల్లర్.. స్ట్రీమింగ్ ఎందులోనంటే?
ఓటీటీలో అద్దిరిపోయే సర్వైవల్ థ్రిల్లర్.. స్ట్రీమింగ్ ఎందులోనంటే?
దక్షిణాది నుంచి బీజేపీలో కీలక నేతగా కిషన్ రెడ్డి
దక్షిణాది నుంచి బీజేపీలో కీలక నేతగా కిషన్ రెడ్డి
EPFO: పీఎఫ్‌ ఖాతాదారులకు గుడ్‌న్యూస్‌.. PF ATM కార్డ్‌, యాప్‌!
EPFO: పీఎఫ్‌ ఖాతాదారులకు గుడ్‌న్యూస్‌.. PF ATM కార్డ్‌, యాప్‌!
ఆ స్టార్ డైరెక్టర్ వల్లే నా కెరీర్ డ్యామేజ్ అయ్యింది..
ఆ స్టార్ డైరెక్టర్ వల్లే నా కెరీర్ డ్యామేజ్ అయ్యింది..
ఛత్తీస్‌గఢ్‌లో మావోయిస్టుల ఘాతుకం.. 9 మంది జవాన్లు మృతి..!
ఛత్తీస్‌గఢ్‌లో మావోయిస్టుల ఘాతుకం.. 9 మంది జవాన్లు మృతి..!
విద్యార్ధులకు అలర్ట్.. స్కాలర్‌షిప్‌ దరఖాస్తు గడువు పెంపు
విద్యార్ధులకు అలర్ట్.. స్కాలర్‌షిప్‌ దరఖాస్తు గడువు పెంపు
ఇంగ్లిష్‌లో మాట్లాడినందుకు స్టార్ హీరో కూతురిపై ట్రోల్స్
ఇంగ్లిష్‌లో మాట్లాడినందుకు స్టార్ హీరో కూతురిపై ట్రోల్స్