రైతుల్ని టెర్రరిస్టుల్లా చూస్తున్నారు, శివసేన నేత సంజయ్ రౌత్ ఫైర్, అఖిలేష్, మాయావతి కూడా !

రైతు చట్టాలను వ్యతిరేకిస్తూ ఢిల్లీకి వస్తున్న అన్నదాతలను కేంద్రం టెర్రరిస్టుల్లా, ఖలిస్తానీయులుగా వ్యవహరిస్తోందని శివసేన నేత సంజయ్ రౌత్ ఆరోపించారు. పోలీసుల అమానుష దాడులకు బెదరకుండా నాలుగు రోజులుగా..

రైతుల్ని టెర్రరిస్టుల్లా చూస్తున్నారు, శివసేన నేత సంజయ్ రౌత్ ఫైర్, అఖిలేష్, మాయావతి కూడా !
Follow us
Umakanth Rao

| Edited By: Pardhasaradhi Peri

Updated on: Nov 29, 2020 | 6:36 PM

రైతు చట్టాలను వ్యతిరేకిస్తూ ఢిల్లీకి వస్తున్న అన్నదాతలను కేంద్రం టెర్రరిస్టుల్లా, ఖలిస్తానీయులుగా వ్యవహరిస్తోందని శివసేన నేత సంజయ్ రౌత్ ఆరోపించారు. పోలీసుల అమానుష దాడులకు బెదరకుండా నాలుగు రోజులుగా హస్తిన చేరుతున్న రైతుల పట్ల ప్రభుత్వం ఇలా వ్యవహరించడం వారిని అవమానపరచడమే అన్నారు. వారిని ఈ దేశ పౌరులుగా చూడడంలేదన్నారు. పంజాబ్, హర్యానా రాష్ట్రాల నుంచి సిక్కులు వస్తున్నారు గనుక ఖలిస్తానీయులుగా పరిగణిస్తారా అని సంజయ్ ప్రశ్నించారు. అటు సమాజ్ వాదీ పార్టీ అధినేత అఖిలేష్ యాదవ్, బహుజన్ సమాజ్ పార్టీ అధినేత్రి మాయావతి కూడా కేంద్రం వైఖరిని దుయ్యబట్టారు. దేశవ్యాప్తంగా రైతులు తీవ్ర ఆగ్రహంగా ఉన్నారని,  ఇప్పటికైనా రైతు చట్టాలపై కేంద్రం పునస్సమీక్ష చేయాలని ఆమె ఆ కోరారు. అన్నదాతల ఆమోదం పొందకుండానే ఈ చట్టాలు తెచ్చారని మాయావతి మండిపడ్డారు.

ధనికులకు, కార్పొరేట్ సంస్థలకు ఈ దేశాన్ని తాకట్టు పెట్టాలని కేంద్రం చూస్తోందని అఖిలేష్ యాదవ్ ఆరోపించారు. రైతులను ఉగ్రవాదులుగా చూడడం బీజేపీ దౌర్భాగ్య వైఖరికి నిదర్శనం అన్నారు. వారు ఉగ్రవాదులే అయితే వారు పండించిన పంట ధాన్యాలను ముట్టబోమని, వారి ఆహారాన్ని తినబోమని బీజేపీ నాయకులు, కార్యకర్తలు ప్రమాణం చేయాలని అఖిలేష్ యాదవ్ డిమాండ్ చేశారు.