ఏపీ కరోనా బులెటిన్.. ఆంధ్రప్రదేశ్‌లో కొత్తగా 620 కరోనా కేసులు నమోదు..ఏడుగురు మృతి

ఆంధ్రప్రదేశ్‌లో కరోనా వైరస్ వ్యాప్తి తగ్గుముఖం పడుతోంది. గడిచిన 24 గంటల్లో రాష్ట్ర వ్యాప్తంగా 620 కరోనా పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి.

  • Updated On - 6:27 pm, Sun, 29 November 20 Edited By: Rajesh Sharma
ఏపీ కరోనా బులెటిన్.. ఆంధ్రప్రదేశ్‌లో కొత్తగా 620 కరోనా కేసులు నమోదు..ఏడుగురు మృతి

ఆంధ్రప్రదేశ్‌లో కరోనా వైరస్ వ్యాప్తి తగ్గుముఖం పడుతోంది. తాజాగా గడిచిన 24 గంటల్లో రాష్ట్ర వ్యాప్తంగా 620 కరోనా పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి. వైద్య ఆరోగ్యశాఖ రాష్ట్ర వ్యాప్తంగా 54,710 మందికి కరోనా పరీక్షలు నిర్వహించగా వీరిలో 620 మందికి పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యింది. తాజాగా నమోదైన కేసులతో కలిపి రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటి వరకు 8,67,683 మంది కరోనా బారిన పడ్డారు. 24 గంటల్లో 3,787 మంది కరోనా బాధితులు కోలుకుని ఆస్పత్రుల నుండి డిశ్చార్జి అయ్యారు. దీంతో కరోనా బారి నుండి కోలుకున్న వారి సంఖ్య రాష్ట్రంలో 8,52,298 లకు చేరింది. ప్రస్తుతం రాష్ట్రంలో 8,397 యాక్టీవ్ కేసులు ఉన్నాయి. వీరికి వైద్యుల సమక్షంలో చికిత్స అందిస్తున్నారు. ఇక కోరానా కారణంగా గడిచిన 24 గంటల్లో రాష్ట్ర వ్యాప్తంగా ఏడుగురు చనిపోయారు. మొత్తంగా చూసుకుంటే 6,988 మంది ఇప్పటి వరకు కరోనా మహమ్మారికి బలి అయ్యారు.

గడిచిన 24 గంటల్లో జిల్లాల వారీగా నమోదైన కరోనా కేసుల వివరాలు ఇలా ఉన్నాయి..
అనంతపురం-16
చిత్తూరు – 64
తూర్పు గోదావరి – 40
గుంటూరు – 101
కడప – 48
కర్నూలు – 15
నెల్లూరు – 39
ప్రకాశం – 19
శ్రీకాకుళం – 15
విశాఖపట్నం – 36
పశ్చిమ గోదావరి – 107