కోవిడ్ -19 వ్యాక్సిన్‌ను డెవలప్ చేస్తున్న మూడు టీంలతో ప్రధాని ముఖాముఖి.. నవంబర్ 30న కీలక నిర్ణయాలు!

కోవిడ్ -19 వ్యాక్సిన్‌ ను డెవలప్ చేస్తున్న మూడు టీం లతో రేపు(సోమవారం) ప్రధాని నరేంద్రమోదీ సంభాషించబోతున్నారు...

  • Venkata Narayana
  • Publish Date - 9:20 pm, Sun, 29 November 20
కోవిడ్ -19 వ్యాక్సిన్‌ను డెవలప్ చేస్తున్న మూడు టీంలతో ప్రధాని ముఖాముఖి.. నవంబర్ 30న కీలక నిర్ణయాలు!

కోవిడ్ -19 వ్యాక్సిన్‌ను డెవలప్ చేస్తున్న మూడు టీం లతో రేపు (సోమవారం) ప్రధాని నరేంద్రమోదీ సంభాషించబోతున్నారు. వీడియో కాన్ఫరెన్సింగ్ ద్వారా ఈ ముఖాముఖి జరుగనుంది. కరోనా టీకాలు అభివృద్ధి చేస్తోన్న జెన్నోవా బయోఫార్మా, బయోలాజికల్ ఇ, డాక్టర్ రెడ్డీ లకు చెందిన ఈ మూడు బృందాలతో మోదీ మాట్లాడనున్నారు. ఈ మేరకు ప్రధాని కార్యాలయం ఆదివారం ఒక ట్వీట్‌లో వెల్లడించింది. వ్యాక్సిన్‌ను అభివృద్ధి చేయడంలో విశేషంగా కృషి చేస్తోన్న ఈ మూడు బృందాల సభ్యులను మోదీ ఈ సందర్భంగా అభినందించే అవకాశం ఉంది. నిన్న హైదరాాబాద్ లో భారత్ బయోటెక్, పూణెలోని సీరం ఇన్సిస్ట్యూట్ శాస్త్రవేత్తలను నేరుగా కలిసిన మోదీ కొవిడ్ వ్యాక్సిన్ ను విజయవంతంగా అభివృద్ధి చేస్తున్నందుకు ధన్యవాదాలు, శుభాకాంక్షలు వెల్లడించిన సంగతి తెలిసిందే.