Lok Sabha Election 2024: ఓటు వేయడానికి ఉదయాన్నే బయలుదేరాడు.. కేంద్రం సమీపంలోకి రాగానే..

దేశవ్యాప్తంగా మూడో దశ పోలింగ్‌ ఉత్సాహంగా కొనసాగుతోంది. 11 రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లోని 93 నియోజకవర్గాల్లో మూడో దశ ఎన్నికలు జరుగుతున్నాయి. ఈ విడతలో 120 మంది మహిళలు సహా 1,351 మంది అభ్యర్థులు పోటీలో ఉన్నారు. గుజరాత్‌లో 26, కర్నాటకలో 14, మహారాష్ట్రలో 11..

Lok Sabha Election 2024: ఓటు వేయడానికి ఉదయాన్నే బయలుదేరాడు.. కేంద్రం సమీపంలోకి రాగానే..
Lok Sabha Election 2024
Follow us

|

Updated on: May 07, 2024 | 1:27 PM

దేశవ్యాప్తంగా మూడో దశ పోలింగ్‌ ఉత్సాహంగా కొనసాగుతోంది. 11 రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లోని 93 నియోజకవర్గాల్లో మూడో దశ ఎన్నికలు జరుగుతున్నాయి. ఈ విడతలో 120 మంది మహిళలు సహా 1,351 మంది అభ్యర్థులు పోటీలో ఉన్నారు. గుజరాత్‌లో 26, కర్నాటకలో 14, మహారాష్ట్రలో 11, ఉత్తరప్రదేశ్‌లో 10, మధ్యప్రదేశ్‌లో 8, ఛత్తీస్‌గఢ్‌లో 7, బీహార్‌లో 5, అస్సాంలో 4, పశ్చిమ బెంగాల్‌లో 4, గోవాలో 2 స్థానాల్లో, దాద్రా నగర్ హవేలీ 1, డామన్ డయ్యు 1 స్థానంలో మూడో దశ పోలింగ్ జరుగుతోంది. అయితే, గుజరాత్లోని సూరత్ నియోజకవర్గం ఒకటి ఏకగ్రీవం కగా.. అక్కడ పోలింగ్ జరగడంలేదు.. ఇదిలాఉంటే.. కొన్ని ప్రాంతాల్లో ఉష్ణోగ్రతలు భారీగా పెరిగాయి. ఎండ వేడికి జనం అల్లాడుతున్నారు. అయినప్పటికీ.. ఓటు వేసేందుకు ఆసక్తిచూపుతున్నారు. ఈక్రమంలో మహారాష్ట్రలోని రాయ్‌ఘడ్ లోక్ సభ పరిధిలోని మహాద్‌లో విషాదం చోటుచేసుకుంది. ఓటు వేయడానికి వచ్చిన వ్యక్తి పోలింగ్‌ కేంద్రం సమీపంలోనే మృతి చెందడం ఆందోళన కలిగించింది.

చనిపోయిన ఓటరు పేరు ప్రకాష్ చింకటే. చింకటే మహద్ తాలూకాలోని దభేకర్ కొండ్ (కింజోల్లి బు) నివాసి. దభేకర్‌ కోండ్‌లోని పోలింగ్‌ కేంద్రంలో ఓటు వేసేందుకు ఆయన ఉదయాన్నే ఇంటి నుంచి బయలుదేరారు. ఉదయం 9 గంటలకు కాలినడకన పోలింగ్‌ కేంద్రానికి బయలుదేరారు. గ్రామానికి చెందిన కొందరు వ్యక్తులతో కలిసి ఎంతో ఉత్సాహంతో పోలింగ్ కేంద్రానికి సమీపంలోకి వచ్చారు.

అయితే పోలింగ్‌ బూత్‌కు 100 మీటర్ల దూరంలో ఉండగా ఒక్కసారిగా కళ్లు తిరగడంతో.. అక్కడికక్కడే కుప్పకూలారు. దీంతో అతని సహచరులు వెంటనే అతడిని ఆస్పత్రికి తరలించారు. అయితే అప్పటికే అతను చనిపోయాడని వైద్య అధికారులు నిర్ధారించారు. అప్పటివరకు తమతో ఉన్న సహచరుడు అకస్మాత్తుగా చనిపోవడాన్ని నమ్మలేకపోతున్నామని గ్రామస్తులు ఆవేదన వ్యక్తంచేస్తున్నారు.

కాగా, రాయ్‌గఢ్‌ లోక్‌సభ నియోజకవర్గంలో ఎన్‌సీపీకి చెందిన సునీల్ తట్కరే ఠాక్రే గ్రూపునకు చెందిన అనంత్ గీతతో తలపడుతున్నారు.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

ఇంట్లో పెట్స్‌ని పెంచుకునేవాళ్లు తప్పక చూడాల్సిన న్యూస్‌ ఇది..
ఇంట్లో పెట్స్‌ని పెంచుకునేవాళ్లు తప్పక చూడాల్సిన న్యూస్‌ ఇది..
ఛీ.. ఇదేం పాడుపని.. మహిళా కారులో ఉండగానే డ్రైవర్‌ గలీజు పని..
ఛీ.. ఇదేం పాడుపని.. మహిళా కారులో ఉండగానే డ్రైవర్‌ గలీజు పని..
ఈ ఏడాది సకాలంలోనే రుతుపవనాలు.. ముందుగానే వర్ష సూచన.
ఈ ఏడాది సకాలంలోనే రుతుపవనాలు.. ముందుగానే వర్ష సూచన.
పైకి చూస్తే ఉల్లిపాయల బస్తాలు.. లోపల చూస్తే షాకింగ్‌ సీన్‌..
పైకి చూస్తే ఉల్లిపాయల బస్తాలు.. లోపల చూస్తే షాకింగ్‌ సీన్‌..
ట్రాఫిక్‌ రూల్సా మజాకా.! కారులో హెల్మెట్ పెట్టుకోలేదని ఫైన్.
ట్రాఫిక్‌ రూల్సా మజాకా.! కారులో హెల్మెట్ పెట్టుకోలేదని ఫైన్.
లే ఆఫ్ ఎదుర్కొంటున్న హెచ్ 1బీ వీసాదారులకు గుడ్‌ న్యూస్‌.
లే ఆఫ్ ఎదుర్కొంటున్న హెచ్ 1బీ వీసాదారులకు గుడ్‌ న్యూస్‌.
పసిప్రాణం కోసం ఆరాటం.. రూ.17.5 కోట్ల ఇంజెక్షన్‌కు నిధుల సేకరణ.!
పసిప్రాణం కోసం ఆరాటం.. రూ.17.5 కోట్ల ఇంజెక్షన్‌కు నిధుల సేకరణ.!
హిట్టా.? ఫట్టా.? ఆహాలో రిలీజ్ అయ్యిన విద్యా వాసుల అహం రివ్యూ.
హిట్టా.? ఫట్టా.? ఆహాలో రిలీజ్ అయ్యిన విద్యా వాసుల అహం రివ్యూ.
ధనుష్ ఒక గే.. సుచిత్ర షాకింగ్ కామెంట్స్. వీడియో వైరల్..
ధనుష్ ఒక గే.. సుచిత్ర షాకింగ్ కామెంట్స్. వీడియో వైరల్..
తప్ప తాగి ట్రిపుల్ రైడింగ్.. ఆపిన పోలీసుపై వీరంగం.. వీడియో వైరల్
తప్ప తాగి ట్రిపుల్ రైడింగ్.. ఆపిన పోలీసుపై వీరంగం.. వీడియో వైరల్