దేశంలో ఇప్పటి వరకు 19 రాష్ట్రాల్లో లాక్‌డౌన్..12 రాష్ట్రాల్లో కర్ఫ్యూ, ఆంక్షలు అమలు..

Lockdown in 19 States : దేశంలో కరోనా కరాళ నృత్యం చేస్తోంది. రోజు రోజుకు కేసులు విస్తృతంగా పెరిగిపోతున్నాయి. ఆస్పత్రుల్లో బెడ్స్

దేశంలో ఇప్పటి వరకు 19 రాష్ట్రాల్లో లాక్‌డౌన్..12 రాష్ట్రాల్లో కర్ఫ్యూ, ఆంక్షలు అమలు..
Lockdown In 19 States
uppula Raju

|

May 13, 2021 | 1:10 PM

Lockdown in 19 States : దేశంలో కరోనా కరాళ నృత్యం చేస్తోంది. రోజు రోజుకు కేసులు విస్తృతంగా పెరిగిపోతున్నాయి. ఆస్పత్రుల్లో బెడ్స్ కరువై పేషెంట్లు నానా అవస్థలు పడుతున్నారు. మరోవైపు బెడ్స్ దొరికినా ఆక్సిజన్ అందక ఎన్నో ప్రాణాలు గాల్లో కలుస్తున్నాయి. ఇటువంటి సమయంలో చాలామంది కరోనా లక్షణాలు ఉన్నవారు ఇంట్లోనే బిక్కుబిక్కుమంటు గడుపుతున్నారు. ఈ పరిస్థితులలో దేశంలో ఇప్పటికే దాదాపు 19 రాష్ట్రాలలో లాక్‌డౌన్‌ విధించగా, మరో 12 రాష్ట్రాలలో కర్ఫ్యూ తరహా ఆంక్షలు అమలులో ఉన్నాయి.

30-01-2020న కరోనా పాజిటివ్ కేసు తొలిసారిగా వెలుగులోకి వచ్చింది. 10-03-2020న కరోనా తొలి మరణం సంభవించింది. 24-03-2020న దేశంలో లాక్‌డౌన్‌ మొదలైంది. అప్పటి వరకు దేశంలో నమోదైన కరోనా కేసలు -536, మరణాలు -10. 2020, మే 31 వరకూ నాలుగు విడతలుగా 70 రోజులు లాక్‌ డౌన్‌ కొనసాగింది. అప్పటివరకు దేశంలో నమోదైన మొత్తం కరోనా కేసుల సంఖ్య1,90,535 , మరణాల సంఖ్య -5,408 నమోదైంది. లాక్‌డౌన్‌ ముగిసేసరికి ఆంధ్రప్రదేశ్‌లో నమోదైన మొత్తం కరోనా కేసులు -3,676, మొత్తం మరణాలు -64. తెలంగాణలో నమోదైన మొత్తం కరోనా కేసులు -2,792, మొత్తం మరణాలు -88

సెకండ్‌ వేవ్‌..
04 ఏప్రిల్‌ 2021 నాటికి కరోనా కేసుల సంఖ్య 1,25,87,920 (కోటి పాతిక లక్షలు).18 ఏప్రిల్‌ 2021 నాటికి కరోనా కేసుల సంఖ్య 1,50,57,767 (కోటిన్నర). 27 ఏప్రిల్‌ 2021 నాటికి నమోదైన కరోనా మరణాలు 2,01,165 (రెండు లక్షలు దాటిన మృతులు).03 మే 2021 నాటికి కరోనా కేసుల సంఖ్య 2,02,75,543 (రెండు కోట్లు)

ఇండియాలో కరోనా విజృంభనపై అమెరికా ఆందోళన వ్యక్తం చేసింది. లాక్‌డౌన్ ఒక్కటే కట్టడికి పరిష్కారం అని అమెరికా చీఫ్ మెడికల్ అడ్వైజర్‌ ఫౌచీ సూచించారు. కనీసం కొన్ని వారాల పాటు లాక్‌డౌన్‌ పెడితే కరోనాను కట్టడి చేయొచ్చని అభిప్రాయపడ్డారు. ప్రస్తుత పరిస్థితుల్లో ఏ దేశం కూడా లాక్‌డౌన్‌ పెట్టడానికి ఇష్టపడడం లేదంటూనే.. అది తప్ప వేరే ఆప్షనే లేదని వెల్లడించారు. వైరస్ వ్యాప్తిని అడ్డుకోవాలంటే అదొక్కటే మార్గమన్నారు సూచించారు.

దేశంలో ఇప్పటికే లాక్‌డౌన్‌ అమలు చేస్తున్న రాష్ట్రాలు…
1.ఢిల్లీ, 2.హరియాణా,3. కేరళ,4. బీహార్‌ 5.ఒడిషా, 6.తమిళనాడు, 7. రాజస్థాన్‌, 8.పుదుచ్చేరి,9. కర్ణాటక, 10.పంజాబ్‌, 11.చత్తీస్‌ఘడ్‌, 12.మహారాష్ట్ర,13. ఉత్తరప్రదేశ్‌,14. ఝార్ఖండ్‌, 15.మధ్యప్రదేశ్‌, 16.హిమాచల్‌ప్రదేశ్‌,17. మిజోరం, 18.పాండిచ్చేరి, 19.తెలంగాణ

కర్ఫ్యూ తరహా ఆంక్షలు..
1.గోవా, 2. గుజరాత్‌, 3.అస్సాం, 4.మణిపూర్‌, 5. నాగాలాండ్‌, 6.అరుణాచల్‌ప్రదేశ్‌, 7.ఉత్తరాఖండ్‌, 8.పశ్చిమబెంగాల్‌, 9. మేఘాలయ, 10.సిక్కిం, 11.జమ్మూ కాశ్మీర్‌,12. ఆంధ్రప్రదేశ్‌

Rythu Bharosa: అన్నదాతలకు అండగా వైఎస్ఆర్ రైతు భరోసా.. ఖాతాల్లో నగదు జమ చేసిన సీఎం వైఎస్ జగన్‌

ఏపీలో ప్రైవేట్ హాస్పటల్స్ పై విజిలెన్స్ దాడులు.. ఇప్పటి వరకు 37 ఆస్పత్రులపై కేసులు నమోదు..

MIDDLE-EAST WAR: మధ్యప్రాచ్యంలో యుద్ధమేఘాలు.. ఇజ్రాయిల్-పాలస్తీనా మధ్య భీకర పోరు షురూ!

లేటెస్ట్ న్యూస్ హైలెట్స్ చూడండి

Follow us on

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Telugu