India Covid-19: భారత్‌లో కొనసాగుతున్న కరోనా విజృంభణ.. నిన్న కూడా 4వేలకు పైగా మరణాలు

India Coronavirus: భారత్‌లో కరోనా ఉధృతి కొనసాగుతూనే ఉంది. రోజురోజుకూ కరోనా కేసుల సంఖ్య, మరణాల సంఖ్య పెరుగుతూనే ఉంది. దేశంలో కరోనా మరణాల సంఖ్య

India Covid-19: భారత్‌లో కొనసాగుతున్న కరోనా విజృంభణ.. నిన్న కూడా 4వేలకు పైగా మరణాలు
Coronavirus
Follow us
Shaik Madar Saheb

|

Updated on: May 13, 2021 | 12:51 PM

India Coronavirus: భారత్‌లో కరోనా ఉధృతి కొనసాగుతూనే ఉంది. రోజురోజుకూ కరోనా కేసుల సంఖ్య, మరణాల సంఖ్య పెరుగుతూనే ఉంది. దేశంలో కరోనా మరణాల సంఖ్య ఇప్పటికే రెండున్నర లక్షలు దాటింది. దేశవ్యాప్తంగా గత 24గంటల్లో కొత్తగా 3,62,727 కేసులు నమోదయ్యాయి. దీంతోపాటు ఈ మహమ్మారి కారణంగా.. 4,120 మంది ప్రాణాలు కోల్పోయారు. దీంతో మొత్తం కరోనా పాజిటివ్‌ కేసుల సంఖ్య 2,37,3,665 కు పెరిగింది. దీంతోపాటు కోవిడ్‌ బాధితుల మరణాల సంఖ్య 2,58,317 కు చేరింది. ఈ మేరకు కేంద్ర వైద్య ఆరోగ్యశాఖ గురువారం హెల్త్ బులెటిన్‌ను విడుదల చేసింది.

కాగా.. దేశంలో గత 24 గంటల్లో రికార్డుస్థాయిలో 3,52,181 మంది బాధితులు కోవిడ్‌ నుంచి కోలుకున్నారు. ఇప్పటివరకు దేశంలో మొత్తం 1,97,34,823 మంది ఈ మహమ్మారి నుంచి డిశ్చార్జ్‌ అయ్యారు. ప్రస్తుతం దేశవ్యాప్తంగా 37,10,525 యాక్టివ్ కేసులున్నాయి. కొత్తగా నమోదైన పాజిటివ్ కేసుల్లో మహారాష్ట్ర, కేరళలో 40 వేల చొప్పున నమోదయ్యాయి. కర్ణాటక, తమిళనాడు రాష్ట్రాల్లో 30 వేలకు పైగా నమోదయ్యాయి. ఉత్తరప్రదేశ్‌లో 15 వేలు, రాజస్థాన్‌లో 18 వేల చొప్పున ఉన్నాయి. మరో 13 రాష్ట్రాల్లో 10 వేలకుపైగా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి.

గత 24 గంటల్లో 18,64,594 మందికి కరోనా పరీక్షలు నిర్వహించారు. కరోనా ప్రారంభం నుంచి ఇప్పటివరకు 30,94,48,585 మందికి కరోనా పరీక్షలు నిర్వహించినట్లు ఐసీఎంఆర్ వెల్లడించింది. ఇదిలా ఉంటే.. దేశంలో వ్యాక్సినేషన్‌ ప్రక్రియ కూడా ముమ్మరంగా కొనసాగుతోంది. నిన్న 18.94లక్షల మందికి టీకా అదించారు. ఇప్పటి వరకు దేశంలో 17,72,14,256 వ్యాక్సిన్ డోసులు ఇచ్చినట్లు కేంద్ర ప్రభుత్వం వెల్లడించింది.

Also Read:

Maharashtra Lockdown: మహారాష్ట్ర సర్కార్ కీలక నిర్ణయం.. జూన్ 1 వరకు లాక్‌డౌన్ ఆంక్షల పొడిగింపు

MIDDLE-EAST WAR: మధ్యప్రాచ్యంలో యుద్ధమేఘాలు.. ఇజ్రాయిల్-పాలస్తీనా మధ్య భీకర పోరు షురూ!

మరణించిన తండ్రిపై మమకారంతో పిల్లలు ఏంచేశారంటే..?
మరణించిన తండ్రిపై మమకారంతో పిల్లలు ఏంచేశారంటే..?
గుడ్‌న్యూస్‌.. గుడ్‌న్యూస్‌.! రూ.27 వేలకే iPhone-15.. వీడియో.
గుడ్‌న్యూస్‌.. గుడ్‌న్యూస్‌.! రూ.27 వేలకే iPhone-15.. వీడియో.
మాది లవ్‌ ఎట్‌ ఫస్ట్‌ సైట్‌! పీవీ సింధు సిగ్గు మొగ్గలేస్తుందిగా.!
మాది లవ్‌ ఎట్‌ ఫస్ట్‌ సైట్‌! పీవీ సింధు సిగ్గు మొగ్గలేస్తుందిగా.!
కుప్పకూలిన విమానం.. ఘటన సమయంలో విమానంలో 72 మంది.!
కుప్పకూలిన విమానం.. ఘటన సమయంలో విమానంలో 72 మంది.!
మన్యంలో మెరుస్తున్న రోడ్లు.! రోడ్ల మరమ్మతులు, నిర్మాణాలపై ఫోకస్‌!
మన్యంలో మెరుస్తున్న రోడ్లు.! రోడ్ల మరమ్మతులు, నిర్మాణాలపై ఫోకస్‌!
వాటర్‌ బాటిల్‌తో చేపలు ఇట్టే పట్టేశారే.. ఐడియా అదిరిందిగా.!
వాటర్‌ బాటిల్‌తో చేపలు ఇట్టే పట్టేశారే.. ఐడియా అదిరిందిగా.!
వీళ్లు మహా కంత్రీగాళ్లు.. నిమిషంలో లక్షలు కొల్లగొట్టారు.!
వీళ్లు మహా కంత్రీగాళ్లు.. నిమిషంలో లక్షలు కొల్లగొట్టారు.!
ఎవరీ బేబీ 81.. ఏంటా కథ.? ప్రపంచం దృష్టిని ఆకర్షించిన బేబీ 81’ కథ.
ఎవరీ బేబీ 81.. ఏంటా కథ.? ప్రపంచం దృష్టిని ఆకర్షించిన బేబీ 81’ కథ.
డిప్ చాయ్ తాగే వాళ్లకు షాకింగ్ న్యూస్.టీ కలిపేటప్పుడు చాలజాగ్రత్త
డిప్ చాయ్ తాగే వాళ్లకు షాకింగ్ న్యూస్.టీ కలిపేటప్పుడు చాలజాగ్రత్త
డ్రగ్ స్మగ్లర్ హత్య.. చంపి పగ తీర్చుకున్న బిష్ణోయ్ గ్యాంగ్.!
డ్రగ్ స్మగ్లర్ హత్య.. చంపి పగ తీర్చుకున్న బిష్ణోయ్ గ్యాంగ్.!