AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Supreme Court: ఇకపై అలాంటివి చెల్లవు.. రిలేషన్‌షిప్‌-అత్యాచార కేసులపై సుప్రీం కోర్టు సంచలన తీర్పు!

సుప్రీం కోర్టు కీలక తీర్పులో, దీర్ఘకాలిక సహజీవనం తర్వాత వివాహ హామీతో మోసం చేశారనే అత్యాచార ఆరోపణలను కొట్టివేసింది. పెళ్లి చేసుకుంటాననే హామీతోనే శారీరక సంబంధం ఏర్పడిందని నిరూపించడం కష్టమని పేర్కొంది. 16 ఏళ్ల సహజీవనం తర్వాత అత్యాచారం ఆరోపణ చేసిన మహిళా లెక్చరర్ పిటిషన్‌ను తోసిపుచ్చింది. కోర్టు, పరస్పర అంగీకారంతో సంబంధం కొనసాగిందని, దీర్ఘకాలిక సంబంధాలలో అటువంటి ఆరోపణలు విశ్వసనీయతను కోల్పోతాయని అభిప్రాయపడింది.

Supreme Court: ఇకపై అలాంటివి చెల్లవు.. రిలేషన్‌షిప్‌-అత్యాచార కేసులపై సుప్రీం కోర్టు సంచలన తీర్పు!
Supreme Court Of India
SN Pasha
|

Updated on: Mar 05, 2025 | 8:32 PM

Share

సుదీర్ఘ కాలం పాటు ఓ వ్యక్తితో సహజీవనం చేసి ఆ తర్వాత తనను పెళ్లి పేరుతో మోసం చేసి శారీరక సంబంధం పెట్టుకున్నాడంటూ మహిళలు పెట్టే అత్యాచారం కేసులు చెల్లవంటూ సుప్రీంకోర్టు తీర్పునిచ్చింది. అలాంటి సందర్భాలలో పెళ్లి చేసుకుంటాననే హామీతో మాత్రమే వారి మధ్య శారీరక సంబంధం ఏర్పడిందని కచ్చితంగా నిర్ధారించలేమని సుప్రీంకోర్టు పేర్కొంది. లివ్-ఇన్ పార్టనర్ అత్యాచారం చేశాడని ఆరోపించిన బ్యాంకు అధికారిపై క్రిమినల్ చర్యలను రద్దు చేస్తూ కోర్టు ఈ వ్యాఖ్యలు చేసింది. వివాహం చేసుకుంటానని చెప్పడంతోనే అతనితో 16 సంవత్సరాలుగా శారీరక సంబంధం పెట్టుకున్నానని ఆరోపించిన మహిళా లెక్చరర్ దాఖలు చేసిన పిటిషన్‌ను న్యాయమూర్తులు విక్రమ్ నాథ్, సందీప్ మెహతాలతో కూడిన ధర్మాసనం తోసిపుచ్చింది.

ఇద్దరు వ్యక్తులు బాగా చదువుకున్నారని, ఇష్టపూర్వకంగా ఏకాభిప్రాయ సంబంధాన్ని కొనసాగించారని, వేర్వేరు పట్టణాల్లో నివసిస్తున్నప్పటికీ తరచుగా ఒకరి ఇళ్లను ఒకరు సందర్శించేవారని కోర్టు అభిప్రాయపడింది. ఈ కేసు లవ్‌ ఫెయిల్యూర్‌ లేదా లివింగ్-ఇన్ బ్రేకప్‌గా కోర్టు పరిగణించింది. 16 సంవత్సరాల సుదీర్ఘ కాలం పాటు సన్నిహిత సంబంధం కొనసాగినందున, వారి మధ్య16 సంవత్సరాల పాటు లైంగిక సంబంధాలు నిరంతరాయంగా కొనసాగాయి, వారి బంధంలో నిందితుడు ఎప్పుడూ బలవంతం లేదా పెళ్లి పేరుతో మోసం చేశాడని అనుకోలేం.

ఎందుకంటే దాదాపు 16 ఏళ్లుగా వాళ్లు కలిసే ఉన్నారు. ఇన్నేళ్ల పాటు అతను కేవలం పెళ్లి చేసుకుంటాననే మాట చెబుతూ ఆమెను లైంగికంగా వాడుకున్నాడని కచ్చితంగా చెప్పలేం. ఇద్దరి పరస్పద అంగీకరంగాతోనే వారి మధ్య శారీరక సంబంధం ఏర్పడి ఉంటుందని అత్యున్నత న్యాయస్థానం వ్యాఖ్యానించింది. పెళ్లి పేరుతో మోసం చేశాడని భావించినప్పటికీ, కేవలం పెళ్లి చేసుకుంటాడనే నమ్మకంతోనే ఇన్నేళ్లు ఆమె, అతనితో శారీరక సంబంధం పెట్టుకుందని భావించడం సరికాదని కోర్టు పేర్కొంది. బంధం ఎక్కువ కాలం కొనసాగినప్పుడు అటువంటి వాదనలు విశ్వసనీయతను కోల్పోతాయని కోర్టు వెల్లడించింది.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.