Viral Video: చాలా గ్యాప్ తరువాత తెరుచుకున్న మద్యం దుకాణాలు.. మందు బాటిల్‌కు పూజలు.. వీడియో వైరల్..

Viral Video: కరోనా ఆంక్షల సడలింపులో భాగంగా రాష్ట్రంలో మద్యం దుకాణాలు తెరుచుకోవచ్చు అని తమిళనాడు ప్రభుత్వం ప్రకటించింది.

Viral Video: చాలా గ్యాప్ తరువాత తెరుచుకున్న మద్యం దుకాణాలు.. మందు బాటిల్‌కు పూజలు.. వీడియో వైరల్..
Liquor

Viral Video: కరోనా ఆంక్షల సడలింపులో భాగంగా రాష్ట్రంలో మద్యం దుకాణాలు తెరుచుకోవచ్చు అని తమిళనాడు ప్రభుత్వం ప్రకటించింది. దాంతో సోమవారం నుంచి రాష్ట్ర వ్యాప్తంగా మద్యం దుకాణాలు తెరుచుకున్నాయి. అయితే, మద్యం దుకాణాలు అలా తెరిచారో లేదో.. అప్పటికే వందలాది మంది మందు బాబులు మద్యం దుకాణాల వద్ద పడిగాపులు కాస్తున్నారు. తాజాగా మధురైలోని ఓ మద్యం దుకాణం వద్ద చోటు చేసుకున్న సంఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో తెగ హల్ చల్ చేస్తోంది.

ఇంతకీ ఆ వీడియోలో ఏముందంటే.. మద్యం దుకాణం తెరిచినందుకు ఓ వ్యక్తి చాలా సంతోషంగా ఉన్నాడు. షాపు ఓపెన్ చేయడానికి ముందు.. అతను ఒక దీపం వెలిగించి హారతి పట్టాడు. ఆ తరువాత కౌంటర్‌కి వెళ్లి రెందు మద్యం బాటిళ్లు కొనుగోలు చేశాడు. అలా కొనుగోలు చేసిన మద్యం బాటిళ్ల నుంచి కొంత అంతకు ముందు వెలిగించిన దీపం ముందు అర్పించాడు. అనంతరం ఎత్తిన బాటిల్ దించకుండా గుటుక్కున మింగేశాడు. ఇతను ఇలా ఉంటే.. ఇతని తరువాత వచ్చిన మరో వ్యక్తి కూడా అదే పని చేశాడు. మద్యం బాటిళ్లకు పూజలు చేసి.. అనంతరం మద్యం సేవించారు.

ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో తెగ వైరల్ అవుతోంది. కాగా, తమిళనాడులో 35 రోజుల విరామ తరువాత జూన్ 14న 27 జిల్లాల్లో సెలూన్లు, పార్కులు, ప్రభుత్వం ఆధీనంలో ఉన్న మద్యం షాపులు తిరిగి ప్రారంభించారు. ఈ సడలింపులు రాష్ట్ర వ్యా్ప్తంగా అమల్లోకి వస్తాయి. అయితే, జూన్ 21వ తేదీ వరకు లాక్‌డౌన్‌ను పొడిగించారు. అలాగే మతపరమైన, పర్యాటక ప్రదేశాలను మూసివేశారు.

Twitter Video:

Also read:

Vijayasanthi : ఠికాణా లేక భూములు అమ్ముకునేంత వరకు తీసుకువచ్చిన మీకు.. ఈ కోట్ల విలువైన కార్ల పంపిణీ ఎందుకు? : విజయశాంతి