ఉదయాన్నే సూట్‌కేసుతో కారు దిగిన ఇద్దరు మహిళలు.. అనుమానం వచ్చి చూడగా.. వామ్మో..
ఉత్తర కోల్‌కతాలోని గంగా నది ప్రాంతం.. ఘాట్ ప్రాంతంలో ఉదయాన్నే చాలామంది వాకింగ్ చేస్తున్నారు.. కొందరు యోగా చేస్తున్నారు.. ఈ క్రమంలోనే.. ఇద్దరు మహిళలు ఓ కారు నుంచి హాడావుడిగా దిగారు.. పెద్ద సూట్ కేస్.. మోయలేకపోతున్నారు.. దీంతో అక్కడ ఉన్న వారంతా వారి వైపే చూడటం మొదలు పెట్టారు.. అయితే.. అంతా చూస్తుండగానే ఇద్దరూ కూడా..

ఉత్తర కోల్‌కతాలోని గంగా నది ప్రాంతం.. ఘాట్ ప్రాంతంలో ఉదయాన్నే చాలామంది వాకింగ్ చేస్తున్నారు.. కొందరు యోగా చేస్తున్నారు.. ఈ క్రమంలోనే.. ఇద్దరు మహిళలు ఓ కారు నుంచి హాడావుడిగా దిగారు.. పెద్ద సూట్ కేస్.. మోయలేకపోతున్నారు.. దీంతో అక్కడ ఉన్న వారంతా వారి వైపే చూడటం మొదలు పెట్టారు.. అయితే.. అంతా చూస్తుండగానే ఇద్దరూ కూడా ఆ సూట్ కేస్ ను నదిలో పడేసేందుకు ముందుకెళ్లారు.. వారిని గమనించిన కొందరు.. ఎందుకు సూట్ కేసుతో అటువైపు వెళ్తున్నారంటూ అడ్డగించారు.. అయినప్పటికీ.. వారు వినలేదు. దానిలో కుక్క మృతదేహం ఉందంటూ ఏవేవో మాయమాటలు చెప్పారు.. ఆ మహిళల సమాధానం సరిగ్గా లేకపోవడంతో సూట్ కేసును తెరచి చూశారు స్థానికులు.. దీంతో ఒక్కసారిగా భయపడ్డారు.. దానిలో ముక్కలు ముక్కలుగా నరికిన మృతదేహం గమనించి పోలీసులకు సమాచారం ఇచ్చారు.. పోలీసుల విచారణలో సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి.. మహిళను కోడలు హత్య చేసి ఉంటుందని.. ఆ తర్వాత ముక్కలుగా నరికి సూట్ కేసులో వేసి.. నదిలో పారేసేందుకు వచ్చినట్లు అనుమానిస్తున్నారు..
ట్రాలీ బ్యాగులో లభ్యమైన మృతురాలి పేరు సుమితా ఘోష్ అని పోలీసులు తెలిపారు. అరెస్టయిన ఇద్దరు మహిళలు ఫల్గుణి ఘోష్, ఆర్తి ఘోష్ గా చెప్పారు.. ఇద్దరూ తల్లీకూతుళ్లు.. అయితే.. మరణించిన సుమితా దేవి.. ఫల్గుణీ దేవి అత్త అని పోలీసులు తెలిపారు. వీరంతా మధ్యగ్రామ్ పోలీస్ స్టేషన్ ప్రాంతంలో నివసిస్తున్నారని తెలిపారు.. ఆ మహిళ ఎలా హత్యకు గురైందో తెలుసుకోవడానికి పోలీసులు స్థానిక పోలీస్ స్టేషన్‌ను సంప్రదించారు. ఆ మహిళను ఎందుకు హత్య చేశారో తెలుసుకోవడానికి నార్త్ పోర్ట్ పోలీస్ స్టేషన్ అధికారులు అరెస్టు చేసిన వారిని విచారిస్తున్నారు.. కుటుంబ కలహాలతోనే ఈ హత్య జరిగిఉంటుందని పోలీసులు పేర్కొంటున్నారు.
అసలేం జరిగిందంటే..
మంగళవారం ఉదయం కోల్‌కతాలోని కుమార్తులి ఘాట్ సమీపంలో ఇద్దరు మహిళలు టాక్సీ నుండి బరువైన ట్రాలీ బ్యాగును దించుతున్నట్లు స్థానికులు చూశారు. ట్రాలీ బ్యాగును చూసిన స్థానిక మహిళలు అనుమానం వచ్చి ఇద్దరు మహిళలను ప్రశ్నించడం ప్రారంభించారు. అప్పుడు ఆ ఇద్దరు మహిళలు ట్రాలీ బ్యాగులో కుక్క శవం ఉందని చెప్పారు. కానీ స్థానికులు దానిని అంగీకరించడానికి ఇష్టపడలేదు. దీని తరువాత, బ్యాగ్ తెరిచి చూడగా, అందులో ఒక మహిళ మృతదేహం ముక్కలు ముక్కలుగా ఉన్నట్లు కనుగొన్నారు. వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు అక్కడికి చేరుకుని ఇద్దరు మహిళలను అరెస్టు చేసి, ట్రాలీ బ్యాగును స్వాధీనం చేసుకున్నారు. శరీర భాగాలను శవపరీక్ష కోసం పంపారు. శవపరీక్ష నివేదిక వచ్చిన తర్వాత మరణానికి కారణం స్పష్టంగా తెలుస్తుందని దర్యాప్తు అధికారులు భావిస్తున్నారు.
మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..