కోల్‌కతాలో భూకంపం.. రిక్టర్ స్కేల్ పై తీవ్రత 5.1 నమోదు
బంగాళాఖాతంలో భూకంపం వచ్చింది. అదే కోల్‌కతా సమీపంలో బంగాళాఖాతంలో ఈ భూకంపం వచ్చింది. ఉదయం 6.10గంటలకు ప్రకంపనలు వచ్చాయి. రిక్టర్ స్కేల్‌పై భూకంప తీవ్రత 5.1గా నమోదైంది. సముద్రగర్భంలో 91 కి.మీ లోతున భూకంప కేంద్రం ఉన్నట్లు నేషనల్ సెంటర్ ఫర్ సెస్మాలజీ తెలిపింది. అయితే సునామీ హెచ్చరికలు మాత్రం జారీకాలేదు.

Earthquake
మొన్నామధ్య నార్త్‌ఇండియాలోని కొన్ని ప్రాంతాల్లో భూకంపం భయపెట్టింది. ఈ ఉదయం దేశంలోని తూర్పు ప్రాంతంలో ప్రకంపనలు వచ్చాయి. కోల్‌కతా, ఒడిశాలోని భువనేశ్వర్ సమీపంలోని బంగాళాఖాతంలో భూకంపం వచ్చింది. రిక్టర్ స్కేలుపై 5.1గా భూకంప తీవ్రత నమోదైంది. కోల్‌కతాతో పాటు పశ్చిమ బెంగాల్, ఒడిశాలోని పలు ప్రాంతాల్లో భూమి కంపించింది. దీంతో ఆయా ప్రాంతాల్లో ప్రజలు భయాందోళనకు గురయ్యారు. భూకంపం వల్ల ఎలాంటి ప్రాణ, ఆస్తి నష్టం జరగలేదు. ఒడిశాకు 175 కిమీ దూరంలో భూకంప కేంద్రాన్ని గుర్తించగా, దీని ప్రభావం బంగ్లాదేశ్‌లోనూ కనిపించింది.




