Kolkata: మాట మార్చిన నిందితుడు.. కోల్‌కతా వైద్యురాలి ఘటనలో ఊహించని ట్విస్ట్‌

ఈ నేపథ్యంలోనే ప్రధాన నిందితుడు సంజయ్‌ రాయ్‌ను సీబీఐ విచారిస్తోంది. ఇందులో భాగంగానే తాజాగా సీబీఐ అధికారులు కోర్టులో హాజరుపర్చారు. అయితే ఈ సందర్భంగా సంజయ్‌ సంచలన వ్యాఖ్యలు చేసినట్లు తెలుస్తోంది. ఇందుకు సంబంధించి కొన్ని నేషనల్‌ మీడియాలో కథనాలు వస్తున్నాయి. అంతకు ముందు తానే హత్యాచారం చేశానని...

Kolkata: మాట మార్చిన నిందితుడు.. కోల్‌కతా వైద్యురాలి ఘటనలో ఊహించని ట్విస్ట్‌
Kolkata Doctor Case
Follow us
Narender Vaitla

|

Updated on: Aug 24, 2024 | 11:41 AM

కోల్‌కతాలో జరిగిన వైద్యురాలి హత్యాచరణ ఘటన దేశవ్యాప్తంగా ఎంతటి సంచలనం సృష్టించిందో చెప్పాల్సిన పనిలేదు. కేసు విచారణ సరిగ్గా జరగడం లేదని, కోల్‌కతా ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుందని రకరకాల ఆరోపణలు వస్తున్నాయి. దీంతో దేశ్యాప్తంగా నిరసనలు హోరెత్తుతున్నాయి. నిందితుడిని కఠినంగా శిక్షించాలని డిమాండ్‌ చేస్తున్నారు. కాగా ప్రస్తుతం ఈ కేసును సీబీఐ విచారిస్తోంది.

ఈ నేపథ్యంలోనే ప్రధాన నిందితుడు సంజయ్‌ రాయ్‌ను సీబీఐ విచారిస్తోంది. ఇందులో భాగంగానే తాజాగా సీబీఐ అధికారులు కోర్టులో హాజరుపర్చారు. అయితే ఈ సందర్భంగా సంజయ్‌ సంచలన వ్యాఖ్యలు చేసినట్లు తెలుస్తోంది. ఇందుకు సంబంధించి కొన్ని నేషనల్‌ మీడియాలో కథనాలు వస్తున్నాయి. అంతకు ముందు తానే హత్యాచారం చేశానని కావాలంటే ఉరి తీసుకోండని సంజయ్‌ వ్యాఖ్యానించినట్లు వార్తలు వచ్చిన విషయం తెలిసిందే. అయితే ఇప్పుడు నిందితుడు మాట మార్చినట్లు తెలుస్తోంది.

కేసులో భాగంగా పాలీగ్రాఫ్‌ పరీక్షకు నిందితుడు సమ్మతించడంతో.. అధికారులకు కోర్టు అనుమతించింది. ఈ క్రమంలో జరిగిన విచారణ సమయంలో సంజయ్‌ సంచలన వ్యాఖ్యలు చేసినట్లు తెలుస్తోంది. తనను కావాలనే ఇరికించారని సంజయ్‌ కన్నీళ్లు పెట్టుకున్నట్లు సమాచారం. పాలీగ్రాఫ్‌ పరీక్షకు ఎందుకు సమ్మతిస్తున్నావ్‌? అని మేజిస్ట్రేట్‌ నిందితుడిని ప్రశ్నించగా.. అతడు భావోద్వేగానికి గురైనట్లు సమాచారం. తాను అమాయకుడిని. ఏ తప్పు చేయలేదు. కావాలనే తనను ఇందులో ఇరికించారని వాపోయినట్లు తెలుస్తోంది. ఈ పరీక్షతో అసలు విషయం బయటపడుతుందని సంజయ్‌రాయ్‌ చెప్పిన్లు అంటున్నారు. దీంతో కేసు కీలక మలుపు తీసుకున్నట్లు అయ్యింది.

ఈ వార్తలతో అసలేం జరిగిందన్న వార్తలు మళ్లీ తెరపైకి వస్తున్నాయి. ప్రిన్సిపల్ వ్యవహారశైలిపై వస్తున్న ఆరోపణలకు ఈ వార్తలు బలం చేకూర్చినట్లవుతోందని కొందరు అభిప్రాయపడుతున్నారు. నిందితుడు అంత ధైర్యంగా పాలీగ్రాఫ్‌ పరీక్షకు ఎందుకు అంగీకరించి ఉంటాడన్న చర్చ జరుగుతోంది. మరి ఈ కేసు మరెన్ని మలుపులు తీసుకుంటుందో కాలమే నిర్ణయించాలి.

అయితే సంఘటన జరిగిన ఆర్‌జీ కర్‌ మెడికల్‌ కాలేజీలో అర్ధరాత్రి సమయంలో నిందితుడు వెళ్తున్న దృశ్యాలు సీసీటీవీ కెమెరాల్లో రికార్డయ్యాయి. తాజాగా అధికారులు వీటికి సంబంధించిన వీడియోలను విడుదల చేశారు. ఈ సమయంలో నిందితుడు బ్లూటూత్ ఇయర్‌ ఫోన్స్‌ ధరించి ఉన్నాడు. కాగా సెమినార్‌ హాల్‌లో వైద్యురాలి మృతదేహం గుర్తించిన ప్రాంతంలో ఈ బ్లూటూత్‌ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. సీసీటీవీ ఫొటో ఆధారంగానే సంజయ్‌ని పోలీసులు అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే.

మరిన్ని జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి..