Khalisthan: కెనడాలో ఖలిస్థాన్ ఉగ్రవాదిపై కాల్పులు.. అక్కడిక్కడే మృతి చెందిన హర్దీప్ సింగ్
కెనడాలోని ఖలీస్థాన్ నాయకుడు హరిదీప్ సింగ్ నిజ్జార్ మృతి చెందాడు. బ్రిటీష్ కొలంబియా ప్రావిన్స్‌లో సర్రీ పట్టణంలో ఇద్దరు గుర్తుతెలియని వ్యక్తులు హరిదీప్‌ను తుపాకులతో కాల్చి చంపేశారు. ఈ విషయాన్ని అక్కడి స్థానిక అధికారులు వెల్లడించారు.

కెనడాలోని ఖలీస్థాన్ నాయకుడు హర్దీప్ సింగ్ నిజ్జార్ మృతి చెందాడు. బ్రిటీష్ కొలంబియా ప్రావిన్స్‌లో ఉన్న సర్రీ పట్టణంలోని గురుద్వార ఆలయం బయట ఇద్దరు గుర్తుతెలియని వ్యక్తులు హరిదీప్‌ను తుపాకులతో కాల్చి చంపేశారు. ఈ విషయాన్ని అక్కడి స్థానిక అధికారులు వెల్లడించారు. వివరాల్లోకి వెళ్తే హర్దీప్ సింగ్ సర్రీ పట్టణంలో గురునానక్ సిక్ గురుద్వారకు అధ్యక్షునిగా అలాగే ఖలిస్థాన్ టైగర్ ఫోర్స్‌కు అధినేతగా ఉండేవాడు. బ్రాంప్టన్ పట్టణంలో ఖలిస్థాన్‌పై ప్రజాభిప్రాయ సేకరణ నిర్వహించడంలో కూడా అతడు కీలక పాత్ర పోషించాడు. అంతేకాదు భారత్‌లో నిషేధించిన సిక్స్ ఫర్ జస్టీస్ అనే వేర్పాటువాద సంస్థతో కూడా హరిదీప్‌కు సంబంధాలు ఉన్నాయి. పంజాబ్‌లో తీవ్రవాద చర్యలకు పాల్పడినట్లు అతనిపై గతంలో ఆరోపణలు కూడా వచ్చాయి. దీంతో భారత్ అప్పట్లోనే హర్దీప్‌పై చర్యలు తీసుకోవాలని కెనడా అధికారుల్ని కోరింది.
ఇటీవల భారత ప్రభుత్వం విడుదల చేసిన 40 మంది తీవ్రవాదుల పేర్లతో పాటు అతని పేరు కూడా ఉంది. మరో విషయం ఏంటంటే 2022లో జాతీయ దర్యాప్తు సంస్థ.. హర్దీప్ సింగ్‌ను అరెస్టు చేసేందుకు అతని ఆచూకి తెలియజేస్తే రూ.10 లక్షల రివార్డును అందిస్తామని ప్రకటించింది. భారత్‌లో తీవ్రవాద చర్యలకు పాల్పడిన ఘటనలో అతని హస్తం ఉందని గతంలోనే ఎన్‌ఐఏ అతనిపై చార్జిషీట్ దాఖలు చేసింది. అలాగే పంజాబ్‌లోని జలంధర్‌లో ఓ హిందూ పూజరిని హత్య చేసేందుకు కూడా కుట్రపన్నినట్లు అతనిపై ఆరోపణలు ఉన్నాయి. అయితే హర్దీప్ సింగ్ మాత్రం కెనడాలో అధికారులకు తప్పించుకుంటూ తిరుగుతున్నాడు. ఇప్పుడు తాజాగా ఇద్దరు సాయుధుల చేతిలో అతను మరణించడం ప్రాధాన్యం సంతరించుకుంది.




Guru Nanak Sikh Gurdwara Sahib Surrey’s president and Sikhs for Justice volunteer Hardeep Singh Nijjar has been shot to death at Gurdwara Sahib few minutes ago by two gunmen. pic.twitter.com/9tTFchy2qA
— Sher-E-Punjab AM 600 (@SherEPunjab600) June 19, 2023
మరిన్ని జాతీయ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..
