‘ఆట మొదలైంది’..కోల్ కతా నేతాజీ స్టేడియంలో ఫుట్ బాల్స్ విసురుతూ బీజేపీపై బెంగాల్ సీఎం మమతా బెనర్జీ సెటైర్

బీజేపీ మీద బెంగాల్ సీఎం, తృణమూల్ కాంగ్రెస్ చీఫ్ మమతా బెనర్జీ సోమవారం నిజంగానే 'ఆట మొదలైంది' అంటూ సెటైర్ వేశారు. ఈ సాయంత్రం కోల్ కతా లోని నేతాజీ సుభాష్ స్టేడియంలో ఆమె ఫుట్ బాల్స్ విసురుతూ సందడి చేశారు. 'ఖేలా హోబ్' కార్యక్రమాన్ని...

'ఆట మొదలైంది'..కోల్ కతా నేతాజీ స్టేడియంలో ఫుట్ బాల్స్ విసురుతూ బీజేపీపై బెంగాల్ సీఎం మమతా బెనర్జీ సెటైర్
Khala Hobe Will Be Remembered For Ever Bengal Cm Mamata Banerjee Slogan

బీజేపీ మీద బెంగాల్ సీఎం, తృణమూల్ కాంగ్రెస్ చీఫ్ మమతా బెనర్జీ సోమవారం నిజంగానే ‘ఆట మొదలైంది’ అంటూ సెటైర్ వేశారు. ఈ సాయంత్రం కోల్ కతా లోని నేతాజీ సుభాష్ స్టేడియంలో ఆమె ఫుట్ బాల్స్ విసురుతూ సందడి చేశారు. ‘ఖేలా హోబ్’ కార్యక్రమాన్ని లాంచ్ చేస్తున్నానంటూ ఈ స్లోగన్ చాలా పాపులర్ అయిందన్నారు. త్వరలోనే ఇది పాపులర్ అవుతుందని, దేశ వ్యాప్తమవుతుందని పేర్కొన్నారు. పార్లమెంటులో కూడా ఈ నినాదాన్ని లేవనెత్తడం జరిగిందని కూడా ఆ తరువాత ఆమె ట్వీట్ చేశారు. ‘నమ్మండి..నమ్మకపోండి..ఈ గేమ్ మాత్రం ఇండియా అంతటా వ్యాపిస్తుంది’ అన్నారు. బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా బీజేపీని ఎదుర్కొనేందుకు మొదట తృణమూల్ కాంగ్రెస్ ఈ నినాదాన్ని లేవనెత్తింది. మేం దీన్ని కేవలం బెంగాల్ కే పరిమితం చేయమని, మొత్తం దేశానికంతటికీ వ్యాపింప జేస్తామని మమత పేర్కొన్నారు .

ఈ స్లోగన్ తాలూకు పాటను రచించిన తృణమూల్ నేత దేవాన్ష్ భట్టాచార్జీ.. మమత ఢిల్లీకి వెళ్తే దీన్ని ఆలపిస్తారని అంతకుముందు వ్యాఖ్యానించారు.2024 లో జరిగే లోక్ సభ ఎన్నికల్లో బీజేపీ ప్రభుత్వాన్ని ఎదుర్కొనేందుకు విపక్షాలతో కూడిన నేషనల్ ఫ్రంట్ కు మమత నేతృత్వం వహిస్తారని ఆయన అన్నారు. అయితే ఈ నినాదం బెంగాల్ రాష్ట్రానికే పరిమితమైందని, దేశం మీద ఎలాంటి ప్రభావం చూపదని బీజేపీ నేత రాహుల్ సిన్హా పెదవి విరిచారు. దేశ ప్రజలు సార్వత్రిక ఎన్నికల్లో తృణమూల్ ను ఆదరిస్తారనుకోవడం వట్టి భ్రమ అని ఆయన చెప్పారు.నినాదాలతో కొత్త ప్రభుత్వాలను ఏర్పరచడం సాధ్యమా అని అయన ప్రశ్నించారు.

మరిన్ని ఇక్కడ చూడండి : ఫస్ట్ నైట్ రూమ్ ఒకే.. కానీ మనం..?పెళ్లికూతురి డౌట్ తో షాక్ లో వరుడు పెళ్ళికొడుకు..:First Night Funny video.

 ఉద్యోగాలుల పేరుతో యువతను మోసం చేసిన కి’లేడీ’..నిరుద్యోగ అమాయకత్వమే పెట్టుబడి..:Job cheating Video.

 కృష్ణా జలాలపై ఏపీ దాదాగిరి చేస్తోందా?కేంద్రానిది తెలంగాణ వ్యతిరేక విధానం..:Big News Big Debate LIVE Video.

 ఖాకీ కావరం..బూటుకాలితో తన్నుతూ ఇలా..!మాస్క్‌ పెట్టుకోలేదని..:Police attack Video.

Click on your DTH Provider to Add TV9 Telugu