AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

కేరళలో అణు విద్యుత్ ప్లాంట్ ఏర్పాటు దిశగా అడుగులు.. మంత్రి కీలక ప్రకటన

కేరళ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. అణు విద్యుత్ ప్లాంట్ ఏర్పాటు దిశగా అడుగులు వేస్తోంది. గతంలో పలుమార్లు ఈ ప్రాజెక్టును పట్టాలెక్కించాలని ప్రయత్నం చేయగా.. ప్రజల నుంచి వ్యతిరేకత వచ్చింది. ఇప్పుడు మరోసారి ప్రభుత్వం పవర్ ప్లాంటుపై ముందడుగు వేసింది.

కేరళలో అణు విద్యుత్ ప్లాంట్ ఏర్పాటు దిశగా అడుగులు.. మంత్రి కీలక ప్రకటన
Power Plant
Venkatrao Lella
|

Updated on: Sep 25, 2026 | 2:29 PM

Share

కేరళలో అణు విద్యుత్ ప్లాంట్ ఏర్పాటుకు ప్రభుత్వం సిద్దమవుతోంది. కాసరగోడ్‌లోని చీమనిలో అణు విద్యుత్ కేంద్రం ఏర్పాటు చేయాలనే ప్రతిపాదన మరోసారి తెరపైకి వచ్చింది. గతంలో 440 మెగావాట్ల అణు విద్యుత్ ఉత్పత్తి కేంద్రాన్ని ఏర్పాటు చేయాలని భావించగా.. స్థానిక ప్రజల నుంచి తీవ్ర వ్యతిరేకత వచ్చింది. దీంతో ఆ ప్రతిపాదనను ప్రభుత్వం విరమించుకుంది. ఇప్పుడు మరోసారి ఆ ప్రతిపాదన ముందుకు రావడం చర్చనీయాశంగా మారింది. అయితే ఈ సారి కూడా ప్రజల నుంచి వ్యతిరేకత వ్యక్తమవయ్యే అవకాశముంది.

మూడుసార్లు ప్రజల నుంచి వ్యతిరేకత

1970లో ఎర్నాకులం జిల్లాలోని భూతతాన్‌కెట్టులో ఒక అణు విద్యుత్ కేంద్రాన్ని ఏర్పాటు చేయాలని ప్రతిపాదనలు సిద్దం చేశారు. కానీ ప్రజల నుంచి తీవ్ర వ్యతిరేకత రావడంతో ప్రభుత్వం తన నిర్ణయాన్ని అప్పట్లో వెనక్కి తీసుకుంది. ఆ తర్వాత 1980వ సంవత్సరంలో కాసరగోడ్‌లోని పెరింగోంలో అణు విద్యుత్ కేంద్రం ప్రాజెక్టును చేపట్టాలని నిర్ణయించగా.. 1990లో కె. కరుణాకరన్ మంత్రివర్గం ఆధ్వర్యంలొ ఈ ప్రాజెక్ట్ పనులు వేగవంతమయ్యాయి. కానీ బలమైన వ్యతిరేకత రావడంతో ఆ ప్రాజెక్టును విరమించుకున్నారు. రాజకీయ ఒత్తిడి, సామాజిక, పర్యావరణ బృందాల వ్యతిరేకత కారణంగా వరుస ప్రభుత్వాలు అణు విద్యుత్ ప్రాజెక్టులను చేట్టలేకపోయాయి. అయితే వాతావరణ మార్పులు, తగ్గిన రుతుపవన వర్షపాతం కారణంగా ప్రభుత్వం ప్రస్తుతం రాష్ట్రానికి ప్రత్యామ్నాయ విద్యుత్ వనరుల కోసం అన్వేషిస్తోంది. అలాగే ఇతర రాష్ట్రాలు, సంస్థల నుండి విద్యుత్‌ను కొనుగోలు చేసే అవకాశాన్ని కూడా పరిశీలిస్తోంది. కేరళ విద్యుత్ సంక్షోభంలో కొట్టుమిట్లాడుతోంది. దీనిని అధిగమించాలంటే అణు విద్యుత్ కేంద్రం ఏర్పాటు చేయాలని ప్రయత్నాలు చేస్తోంది.

ఈ సారైనా పట్టాలెక్కుతుందా..?

ప్రస్తుతం తమిళనాడు, కర్ణాటకతో సహా భారతదేశంలోని 7 రాష్ట్రాలలో అణు విద్యుత్ కేంద్రాలు ఉన్నాయి. గుజరాత్, తమిళనాడులోని కల్పక్కం, ఉత్తర ప్రదేశ్‌లోని అణు విద్యుత్ కేంద్రాలు 440 మెగావాట్ల సామర్థ్యాన్ని కలిగి ఉన్నాయి. దేశంలోనే అతిపెద్ద అణు విద్యుత్ కేంద్రం తమిళనాడులోని కూడంకులంలో ఉంది. దీని సామర్థ్యం 2000 మెగావాట్లుగా ఉంది. ఇప్పుడు కేరళ కూడా విద్యుత్ సంక్షోభం నుంచి బయట పడేందుకు అణు విద్యుత్ ప్రాజెక్టును చేపట్టేందుకు సిద్దమవుతోంది. ఈ విషయానర్ని విద్యుత్ శాఖ మంత్రి సన్నీ జోసెఫ్ తాజాగా తెలిపారు. పెరుగుతున్న విద్యుత్ కొరత, అత్యవసర విద్యుత్ కాంట్రాక్టులను పొందడంలో ఉన్న అడ్డంకుల దృష్ట్యా రాష్ట్రం అన్ని మార్గాలను అన్వేషించాల్సిన అవసరం ఉందని ఆయన అభిప్రాయపడ్డారు. అయితే  ఈ సారి అయినా ఈ ప్రాజెక్ట్ పట్టాలెక్కుతుందా.. లేదా మధ్యలో నిలిచిపోతుందా అనేది చర్చనీయాంశంగా మారింది.

Follow Us
కేరళలో అణు విద్యుత్ పవర్ ప్లాంట్.. ప్రభుత్వం మరోసారి ముందడుగు..
కేరళలో అణు విద్యుత్ పవర్ ప్లాంట్.. ప్రభుత్వం మరోసారి ముందడుగు..
నిన్ను అందరూ ద్వేషిస్తారు..కొడుకుకు వీరేంద్ర సెహ్వాగ్ షాకింగ్ సలహ
నిన్ను అందరూ ద్వేషిస్తారు..కొడుకుకు వీరేంద్ర సెహ్వాగ్ షాకింగ్ సలహ
హిట్ మ్యాన్ రీఎంట్రీతో స్టార్ ఓపెనర్‌కు నో ఛాన్స్
హిట్ మ్యాన్ రీఎంట్రీతో స్టార్ ఓపెనర్‌కు నో ఛాన్స్
యూఎన్ వేదికపై నెతన్యాహు పేజర్‌ బాంబ్‌..!
యూఎన్ వేదికపై నెతన్యాహు పేజర్‌ బాంబ్‌..!
ఇప్పుడు యోనో యాప్ ద్వారా క్రెడిట్ కార్డులు..కేవలం 10 నిమిషాల్లోనే
ఇప్పుడు యోనో యాప్ ద్వారా క్రెడిట్ కార్డులు..కేవలం 10 నిమిషాల్లోనే
పసుపు ఐస్ క్యూబ్స్‌తో మెరిసే చర్మం.. ఇలా తయారు చేసుకుని వాడారంటే.
పసుపు ఐస్ క్యూబ్స్‌తో మెరిసే చర్మం.. ఇలా తయారు చేసుకుని వాడారంటే.
ఆర్ఎస్ఐ కారు యాక్సిడెంట్‌లో షాకింగ్ ట్విస్ట్!
ఆర్ఎస్ఐ కారు యాక్సిడెంట్‌లో షాకింగ్ ట్విస్ట్!
నాని యంగ్ మదర్ గా కనిపించిన టాలెంటెడ్ బ్యూటీ ఎవరంటే
నాని యంగ్ మదర్ గా కనిపించిన టాలెంటెడ్ బ్యూటీ ఎవరంటే
భారత్-జపాన్ మ్యాచ్‌లో వైడ్ వివాదం.. నిజం బయటపెట్టిన ఆకాష్ చోప్రా
భారత్-జపాన్ మ్యాచ్‌లో వైడ్ వివాదం.. నిజం బయటపెట్టిన ఆకాష్ చోప్రా
ఈ గింజలు తింటే డయాబెటిస్ వెంటనే కంట్రోల్.. అంత పవర్ఫుల్
ఈ గింజలు తింటే డయాబెటిస్ వెంటనే కంట్రోల్.. అంత పవర్ఫుల్