Father’s Love: ఇదీ నాన్న ప్రేమంటే.. పిల్లల కోసంఏకంగా బుల్లి మహీంద్రా జీపునే తయారుచేసిన తండ్రి.. ఎక్కడంటే…

Father's Love: మనం ఎక్కువగా తల్లిప్రేమను పేగు బంధాన్ని గుర్తుకు తెచ్చుకుంటాం.. కీర్తిస్తుంటాం.. అయితే నాన్న తన పిల్లల పై చూపించే ప్రేమ కూడా గొప్పదే...

Father's Love: ఇదీ నాన్న ప్రేమంటే.. పిల్లల కోసంఏకంగా బుల్లి మహీంద్రా జీపునే తయారుచేసిన తండ్రి.. ఎక్కడంటే...
Car
Follow us

|

Updated on: Apr 20, 2021 | 7:19 PM

Father’s Love: మనం ఎక్కువగా తల్లిప్రేమను పేగు బంధాన్ని గుర్తుకు తెచ్చుకుంటాం.. కీర్తిస్తుంటాం.. అయితే నాన్న తన పిల్లల పై చూపించే ప్రేమ కూడా గొప్పదే.. తన పిల్లల కోసం ఏ త్యాగానికైనా వెరవని నైజం తండ్రిది.. తన ఖర్చులు తగ్గించుకుని మరీ.. పిల్లలు అడిగే కోర్కెలను తీర్చాలనుకుంటాడు.. సాధారణంగా పిల్లలకు ఇష్టమైన బొమ్మలు తల్లిదండ్రులు కొనిస్తుంటారు. వారికి నచ్చినవి కొనిచ్చి వారి కళ్లలో ఆనందం చూసి హ్యాపీగా ఫీల్ అవుతారు. అయితే, కేరళకు చెందిన ఓ వ్యక్తి తన పిల్లల కోసం మరో అడుగు ముందుకేశాడు. తన క్రియేటివిటీతో తన పిల్లలు ఆడుకోవడానికి ఏకంగా ఓ బుల్లి జీపునే తయారు చేసి ఇచ్చాడు.

కేరళ మలప్పురం జిల్లాకు చెందిన ఆరికోడ్ గ్రామంలో నివసించే షకీర్ తన పిల్లల కోసం ఒక చిన్న సాఫ్ట్ టాప్ మహీంద్రా జీపును తయారు చేశాడు. అతడు తయారు చేసిన జీపు వీడియోను సోషల్​ మీడియాలో షేర్​ చేయగా.. అది కాస్తా వైరల్‌గా మారింది. ఈ వీడియో చూసిన నెటిజన్లు.. పిల్లల పట్ల ఆ తండ్రి చూపించిన ప్రేమకు హాట్సాఫ్​ చెబుతున్నారు. అచ్చం మహీంద్రా జీప్ వలే ఉన్న ఈ జీప్ 1000 వాట్స్ మోటారుతో పనిచేస్తుందని షకీర్​ చెబుతున్నాడు. దీనిలో మాన్యువల్ గేర్‌బాక్స్, పవర్ స్టీరింగ్, డిటాచెబుల్​ సాఫ్ట్ టాప్, హెడ్‌లైట్‌ వంటి ఫీచర్లను అందించాడు.

ఈ ప్రాజెక్టును పూర్తి చేయడానికి షకీర్‌కు ఒక సంవత్సరం పట్టిందని చెప్పుకొచ్చాడు. అయితే, తాను ఈ జీపును 5-6 సంవత్సరాల క్రితమే తయారు చేసినప్పటికీ, ఈ చిన్న జీప్​ వీడియో ఇప్పడు వైరల్ అయ్యిందని వివరించాడు. సుమారు 60- నుండి 70 కిలోమీటర్ల డ్రైవింగ్ రేంజ్ కలిగి ఉన్న ఈ జీపు తయారు చేయడానికి దాదాపు రూ .1.5 లక్షలు ఖర్చయ్యిందని షకీర్​ తన వీడియోలో చెప్పుకొచ్చాడు.

Also Read: రోజూ గంటల తరబడి ఎక్సర్సైజ్ లు చేస్తున్నారా.. అయితే మీరు ప్రాబ్లెమ్ లో పడినట్లే..

మోకాళ్ల మధ్య దిండు పెట్టుకుని పడుకుంటున్నారా.. ఈ విషయాలు మీకోసమే!
మోకాళ్ల మధ్య దిండు పెట్టుకుని పడుకుంటున్నారా.. ఈ విషయాలు మీకోసమే!
యూత్‌ని చెవిటివారిగా చేసిన డీజే సౌండ్.. పలువురిపై కేసు నమోదు
యూత్‌ని చెవిటివారిగా చేసిన డీజే సౌండ్.. పలువురిపై కేసు నమోదు
మిర్చిబండి వద్ద స్నాక్స్‌ తిని యూపీఐ చెల్లింపు చేసిన కేంద్రమంత్రి
మిర్చిబండి వద్ద స్నాక్స్‌ తిని యూపీఐ చెల్లింపు చేసిన కేంద్రమంత్రి
కాలేజ్ ఫెస్ట్‏లో సాయి పల్లవి మాస్ డాన్స్.
కాలేజ్ ఫెస్ట్‏లో సాయి పల్లవి మాస్ డాన్స్.
నయా ట్రెండ్ సినిమాటిక్ యూనివర్స్.. ఆ బాటలో ఎవరున్నారంటే.?
నయా ట్రెండ్ సినిమాటిక్ యూనివర్స్.. ఆ బాటలో ఎవరున్నారంటే.?
ఈ ఆప్టికల్ ఇల్యూషన్‌లో 264 నెంబర్‌ని కనిపెట్టండి చూద్దాం..
ఈ ఆప్టికల్ ఇల్యూషన్‌లో 264 నెంబర్‌ని కనిపెట్టండి చూద్దాం..
వ్యాపారం మీ లక్ష్యం అయితే.. పెట్టుబడి ప్రభుత్వమే ఇస్తుంది.. అదెలా
వ్యాపారం మీ లక్ష్యం అయితే.. పెట్టుబడి ప్రభుత్వమే ఇస్తుంది.. అదెలా
కేసీఆర్ ఇంటి పక్కనే క్షుద్రపూజలు.. రాత్రివేళ ఏం జరిగింది..?
కేసీఆర్ ఇంటి పక్కనే క్షుద్రపూజలు.. రాత్రివేళ ఏం జరిగింది..?
గుండెపోటుకు చెక్‌ పెట్టి రక్త ప్రసరణను మెరుగుపరిచే ఆహారాలు
గుండెపోటుకు చెక్‌ పెట్టి రక్త ప్రసరణను మెరుగుపరిచే ఆహారాలు
అనుకూలంగా శుక్ర గ్రహం.. ఈ రాశులకు చెందిన మహిళలకు మహా యోగాలు!
అనుకూలంగా శుక్ర గ్రహం.. ఈ రాశులకు చెందిన మహిళలకు మహా యోగాలు!