AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Working Out Every Day: రోజూ గంటల తరబడి ఎక్సర్సైజ్ లు చేస్తున్నారా.. అయితే మీరు ప్రాబ్లెమ్ లో పడినట్లే..

Health Tips: ఆధునిక జీవితంలో బతుకు బండి నడవాలంటే.. ఉరుకులు పరుగులు పెట్టాల్సిందే.. ఓ వైపు పని ఒత్తిడి.. మానసిక, శారీరక ఆరోగ్యంపై ప్రభావం చూపుతుంది...

Working Out Every Day: రోజూ గంటల తరబడి ఎక్సర్సైజ్ లు చేస్తున్నారా.. అయితే మీరు ప్రాబ్లెమ్ లో పడినట్లే..
Surya Kala
|

Updated on: Apr 20, 2021 | 5:06 PM

Share

Health Tips: ఆధునిక జీవితంలో బతుకు బండి నడవాలంటే.. ఉరుకులు పరుగులు పెట్టాల్సిందే.. ఓ వైపు పని ఒత్తిడి.. మానసిక, శారీరక ఆరోగ్యంపై ప్రభావం చూపుతుంది. మానసికంగా ఆరోగ్యంగా ఉండడానికి యోగాని ఆశ్రయిస్తే.. శారీరక దృఢత్వానికి క్రమం తప్పకుండా వ్యాయామం చేయాల్సిందే.. ఎక్సర్సైజ్ లు ఆరోగ్యానికి మంచిది.. అయితే వ్యాయామం ప్రతిరోజూ చేయాలని నియమాలు పెట్టుకోవద్దు. ఒకవేళ ప్రతిరోజూ వ్యాయామాలు చేసేవారికి ఆరోగ్య నిపుణులు కొన్ని సూచనలు చేశారు. వ్యాయామం ఓ పరిధిమేరకు, పరిమిత సమయంలోనే చేయాలని అధ్యయనాలు చెబుతున్నాయి.

ఎక్సర్‌సైజ్ చేస్తే కండరాలు ఉత్తేజితమై, మీకు మానసిక ప్రశాంతత లభిస్తుంది. పరిమితికి మించి అధికంగా జిమ్ వర్కౌట్స్ , ఎక్సర్‌సైజ్ వంటివి చేయడం వలన అనేక అనారోగ్య సమస్యలు తలెత్తుతాయట. ముఖ్యంగా అధికంగా శారీరక శ్రమ చేయడం వల్ల తలనొప్పి, డిప్రెషన్ సహ ఎన్నో ఆరోగ్య సమస్యలు వస్తాయట.

నేటి యువతకు సన్నగా సన్నజాజిలాంటి శరీరాకృతి ఇష్టం.. అందుకోసం ఓ వైపు డైట్ అంటూ.. తినే ఆహారపదార్ధాలను పక్కకు పెట్టేస్తున్నారు. మరోవైపు అధికంగా శారీరక శ్రమను చేస్తున్నారు. అయితే ఇలా అత్యధికంగా వర్కౌట్స్ చేస్తే.. మధ్యమధ్యలో కాస్త విరామ సమయం తీసుకోవడం ఆరోగ్యానికి శ్రేయస్కరం. ప్రతిరోజూ వర్కౌట్స్ అధికంగా చేసినా వీకెండ్ రోజు కచ్చితంగా విశ్రాంతి తీసుకోవాలని లేని పక్షంలో ఆరోగ్యంపై ప్రభావంచూపిస్తుందని ఆరోగ్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. ముఖ్యంగా శరీరానికి తగిన విశ్రాంతి ఇవ్వకుండా అధికంగా కసరత్తులు, శ్రమ చేస్తే బరువు పెరిగే అవకాశాలున్నాయని 2015లో ఓ సర్వేలో తేలింది. ఫిట్‌నెస్ అంటూ అధికంగా వర్కౌట్లు చేస్తే అనారోగ్య సమస్యలు తలెత్తుతాయని హెచ్చరిస్తున్నారు.. ముఖ్యంగా కొన్ని రోజులు చేస్తూ.. కొన్ని రోజులు మానేస్తు ఉన్నా శరీరం పై ప్రభావం చూపిస్తుందని అంటున్నారు.

Also Read: మానవత్వమా నీ చిరునామా ఎక్కడ..? కోవిడ్ పాజిటివ్ దంపతులను ఇంట్లో పెట్టి.. లాక్ వేసిన ఎదురింటి ప్లాట్ ఓనర్

రూ.100, రూ.500 నోట్లపై ఉండే ఈ గీతల వెనుక సీక్రెట్ తెలుసా..?
రూ.100, రూ.500 నోట్లపై ఉండే ఈ గీతల వెనుక సీక్రెట్ తెలుసా..?
దేవుడి ఆభరణాలు దొంగలించిన పిల్లలకు భజంత్రీలతో ఊరెగింపు
దేవుడి ఆభరణాలు దొంగలించిన పిల్లలకు భజంత్రీలతో ఊరెగింపు
రింకుకు షాకిచ్చిన కేటుగాళ్లు.. ఫేస్‌బుక్ హ్యాక్ చేసి ఏం చేశారంటే?
రింకుకు షాకిచ్చిన కేటుగాళ్లు.. ఫేస్‌బుక్ హ్యాక్ చేసి ఏం చేశారంటే?
రోజూ ఉల్లిపాయ తింటే డాక్టర్ల అవసరం ఉండదా.. శరీరంలో..
రోజూ ఉల్లిపాయ తింటే డాక్టర్ల అవసరం ఉండదా.. శరీరంలో..
పురుషుల్లో ఆ సమస్యలకు కీవీ పండు బెస్ట్ మెడిసిన్..
పురుషుల్లో ఆ సమస్యలకు కీవీ పండు బెస్ట్ మెడిసిన్..
ఓటీటీలోకి వస్తోన్న నవీన్ పోలిశెట్టి అనగనగా ఒకరాజు..
ఓటీటీలోకి వస్తోన్న నవీన్ పోలిశెట్టి అనగనగా ఒకరాజు..
రాసిపెట్టుకోండి.. మనకు కప్పు తెచ్చేది ఆ ఇద్దరు మొనగాళ్లే..
రాసిపెట్టుకోండి.. మనకు కప్పు తెచ్చేది ఆ ఇద్దరు మొనగాళ్లే..
అకాల మరణం తర్వాత ఆ ఆత్మల పరిస్థితి ఏంటి..? ఏం చేయాలో తెలుసా..?
అకాల మరణం తర్వాత ఆ ఆత్మల పరిస్థితి ఏంటి..? ఏం చేయాలో తెలుసా..?
రామ్ చరణ్‏తో క్రేజీ హీరోయిన్ స్పెషల్ సాంగ్.. ఇది మాస్ కాంబో భయ్యో
రామ్ చరణ్‏తో క్రేజీ హీరోయిన్ స్పెషల్ సాంగ్.. ఇది మాస్ కాంబో భయ్యో
ఏప్రిల్ 1 నుంచి కొత్త ఇన్‌కమ్ ట్యాక్స్ రూల్స్.. ఇవి తెలుసుకోండి
ఏప్రిల్ 1 నుంచి కొత్త ఇన్‌కమ్ ట్యాక్స్ రూల్స్.. ఇవి తెలుసుకోండి