డేంజర్.. వణుకు పుట్టిస్తున్న వెస్ట్ నెయిల్ ఫీవర్.. ఒకరు మృతి.. ఇలాంటి లక్షణాలుంటే అలర్ట్..
కేరళను వెస్ట్ నెయిల్ ఫీవర్ భయపెడుతోంది. ఈ ఫీవర్‌తో ఇప్పటివరకు ఒకరు చనిపోవడం, మరో ఇరువై మంది ఆస్పత్రిలో చికిత్స పొందుతుండటం ఆందోళన కలిగిస్తోంది. మరీ ముఖ్యంగా రాష్ట్రంలోని మూడు జిల్లాలు... త్రిస్సూర్, మలప్పురం, కోజికోడ్‌లో ఈ ఫీవర్ వ్యాప్తి ఎక్కువగా ఉండటంతో రాష్ట్రప్రభుత్వం అలర్ట్ అయ్యింది.
కేరళను వెస్ట్ నెయిల్ ఫీవర్ భయపెడుతోంది. ఈ ఫీవర్‌తో ఇప్పటివరకు ఒకరు చనిపోవడం, మరో ఇరువై మంది ఆస్పత్రిలో చికిత్స పొందుతుండటం ఆందోళన కలిగిస్తోంది. మరీ ముఖ్యంగా రాష్ట్రంలోని మూడు జిల్లాలు… త్రిస్సూర్, మలప్పురం, కోజికోడ్‌లో ఈ ఫీవర్ వ్యాప్తి ఎక్కువగా ఉండటంతో రాష్ట్రప్రభుత్వం అలర్ట్ అయ్యింది. ప్రతిఒక్కరూ అప్రమత్తంగా ఉండాలంటూ ఆదేశాలు జారీ చేసింది. వెస్ట్ నైయిల్ ఫీవర్ అనేది ఒక రకమైన వైరల్ జ్వరమంటున్నారు కేరళలోని ఆరోగ్య నిపుణులు. ఇన్‌ఫెక్షన్ సోకిన క్యూలెక్స్ దోమ ద్వారా ఈ ఫీవర్ మనుషులకు సోకుతుందని చెబుతున్నారు. ఈ వెస్ట్ నైయిల్ ఫీవర్‌కు ఎలాంటి మందులు గానీ, టీకాలు గానీ లేవని పేర్కొన్నారు. ఈ వ్యాధి సోకిన వారికి ఉన్న లక్షణాల ఆధారంగానే ట్రీట్మెంట్ చేస్తారని చెబుతున్నారు. వెస్ట్ నైయిల్ ఫీవర్ సోకకుండా ప్రతిఒక్కరూ అన్ని రకాల జాగ్రత్తలు పాటించాలని ప్రజలకు వైద్య నిపుణులు సూచిస్తున్నారు.
ఇక రాష్ట్రంలో వెస్ట్ నెయిల్ ఫీవర్ వ్యాప్తి చెందడంతో ప్రజల్లో తీవ్ర ఆందోళనలు నెలకొన్నాయి. కొన్ని ప్రాంతాల్లో ఇంట్లోంచి బయటకు వెళ్లాలంటేనే జనం వణికిపోతున్నారు. ఈ భయాల నేపథ్యంలో కేరళ ఆరోగ్యశాఖ స్పందించింది. ఈ వెస్ట్ నైయిల్ ఫీవర్ రాష్ట్రంలో వ్యాప్తి చెందుతున్నప్పటికీ ప్రజలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని ధైర్యం చెబుతున్నారు. ఫీవర్‌కు సంబంధించిన ఏవైనా లక్షణాలు కనిపిస్తే తక్షణమే ఆస్పత్రికి వెళ్లి చికిత్స తీసుకోవాలని సూచిస్తున్నారు. ఇక ప్రస్తుతం ఈ ఫీవర్ సోకి చికిత్స పొందుతున్న 20 మంది పరిస్థితి బాగానే ఉన్నట్లు తెలిపారు ఆరోగ్యశాఖ అధికారులు.
మొత్తంగా… ఈ విషజ్వరంతో అలర్ట్ అయిన కేరళ ప్రభుత్వం… ఫీవర్ వ్యాప్తి ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లో మెడికల్ క్యాంపుల ఏర్పాటుకు ఆదేశాలు జారీ చేసింది. అలాగే కేరళ-తమిళనాడు సరిహద్దుల్లో రాకపోకలపై నిఘా పెట్టింది.
ఇలాంటి లక్షణాలు కనిపిస్తే.. అలర్ట్..
వెస్ట్ నెయిల్ ఫీవర్ వచ్చినప్పుడు ఈ క్రింది లక్షణాలు కనిపిస్తాయి..
- పొత్తి కడుపు నొప్పి
- జ్వరం, తలనొప్పి, గొంతు నొప్పి
- ఆకలి లేకపోవడం
- కండరాల నొప్పులు
- వికారం, వాంతులు, అతిసారం
- దద్దుర్లు..
- శరీరంలో వాపు
మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..