లాక్ డౌన్ కట్టుదిట్టంగా అమలు చేస్తున్నా కేరళలో మళ్ళీ విజృంభిస్తున్న కరోనా వైరస్ కేసులు, మొదటిసారిగా 100 దాటిన కోవిడ్ మరణాలు

కేరళలో కరోనా వైరస్ కేసులు మళ్ళీ విజృంభిస్తున్నాయి.గత 24 గంటల్లో 32,762 కేసులు నమోదయ్యాయి. మొదటిసారిగా మరణాల సంఖ్య వంద దాటింది. 112 మంది కోవిద్ రోగులు మరణించారు. సెకండ్ కోవిద్ వేవ్ ని అదుపు చేసేందుకు..

లాక్ డౌన్ కట్టుదిట్టంగా అమలు చేస్తున్నా కేరళలో మళ్ళీ విజృంభిస్తున్న కరోనా వైరస్ కేసులు, మొదటిసారిగా 100 దాటిన కోవిడ్ మరణాలు
Follow us

| Edited By: Anil kumar poka

Updated on: May 19, 2021 | 9:01 PM

కేరళలో కరోనా వైరస్ కేసులు మళ్ళీ విజృంభిస్తున్నాయి.గత 24 గంటల్లో 32,762 కేసులు నమోదయ్యాయి. మొదటిసారిగా మరణాల సంఖ్య వంద దాటింది. 112 మంది కోవిద్ రోగులు మరణించారు. సెకండ్ కోవిద్ వేవ్ ని అదుపు చేసేందుకు ఈ నెల 8 నుంచి 16 వరకు రాష్ట్రంలో లాక్ డౌన్ విధించారు. అయితే దాన్ని మళ్ళీ ఈ నెల 23 వరకు పొడిగించారు. లక్షా 40 వేలకు పైగా శాంపిల్స్ టెస్ట్ చేశామని, పాజిటివిటీ రేటు 23.31 శాతం ఉందని ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. ముఖ్యంగా తిరువనంతపురం, త్రిసూర్, ఎర్నాకులం, మలప్పురం జిల్లాల్లో ట్రిపుల్ లాక్ డౌన్ విధించినా ప్రయోజనం లేకపోయింది. ఇంత జరుగుతున్నా ప్రజలు ఈ మహమ్మారికి తలవంచరాదని, ధ్జైర్యంగా ఉండాలని, తమ ప్రభుత్వం విధిస్తున్న ఆంక్షలు ఎంతో ప్రయోజనకరమని ముఖ్యమంత్రి పినరయి విజయన్ అంటున్నారు. కాగా తమ కొత్త ప్రభుత్వ ఏర్పాటులో ఆయన బిజీగా ఉన్న దృష్ట్యా ఈ కోవిద్ గురించి పట్టించుకోవడంలేదని విపక్ష కాంగ్రెస్ వర్గాలు ఆరోపిస్తున్నాయి. ఇటీవలి వరకు ఆరోగ్య శాఖ మంత్రిగా కె,కె.శైలజ రాష్ట్రంలో కోవిద్ అదుపునకు కృషి చేశారని, కానీ ఇప్పుడు ఆమె పదవిలో లేరు గనుక తిరిగి సమస్య మొదటికొచ్చిందన్న విమర్శలు వినవస్తున్నాయి. గత కొన్ని రోజులుగా రాష్ట్రంలో ఇంచుమించు రోజూ 90 వరకు కోవిద్ మరణాలు సంభవిస్తున్నాయి. మొదటిసారిగా మంగళవారం ఈ సంఖ్య వంద దాటింది. లోగడ కోవిద్ కేసులను సమర్థంగా ఎదుర్కొని దాన్ని అదుపు చేయడంలో దేశంలోనే మొదటి స్థానంలో ఉన్న కేరళ ఇప్పుడు ఆ ‘పాపులారిటీ’ ని కోల్పోయింది.

మరిన్ని చదవండి ఇక్కడ : Lockdown Violation : నాగిని డ్యాన్స్‌ వేపించిన పోలీసులు…వైరల్ అవుతున్న వీడియో.లాక్ డౌన్ నియమాలు అతిక్రమిస్తే ఇక అంతే ..

ఒక్క ఫోన్ చేస్తే చాలు..స్కార్పియో అంబులెన్స్ ఫ్రీ సర్వీస్..ఎక్కడంటే.. సొంత వాహనాన్ని పబ్లిక్ సర్వీస్ కు అంకితం చేసిన యువకుడు ..:viral video.

ప్రాణాలకు తెగించి నన్ను కాపాడాడు అంటున్న లెక్కల మాస్టర్ సుకుమార్..! Allu Arjun Saved Sukumar Life video.