Kedarnath Temple: కేదర్‌నాథ్ యాత్ర రిజిస్ట్రేషన్లు నిలిపివేత.. ఎందుకంటే

కేదర్‌నాథ్ యాత్ర కోసం అధికారులు భ‌క్తుల రిజిస్ట్రేష‌న్లను నిలిపివేశారు. వాతావ‌ర‌ణ పరిస్థితులు స‌రిగా లేని కార‌ణంగా.. ఈ నెల 8వ తేదీ వ‌ర‌కు రిజిస్ట్రేష‌న్లు బంద్ చేసిన‌ట్లు పేర్కొన్నారు . అయితే కేదారీఘాటీలో రానున్న నాలుగు రోజుల పాటు వ‌ర్షాలు పడనున్నట్లు తెలుస్తోంది. దీంతో వాతావరణం చాలా ప్రమాదక‌రంగా మారే అవ‌కాశాలు ఉన్నట్లు హెచ్చరించారు.

Kedarnath Temple: కేదర్‌నాథ్ యాత్ర రిజిస్ట్రేషన్లు నిలిపివేత.. ఎందుకంటే
Kedarnath Temple
Follow us
Aravind B

|

Updated on: May 05, 2023 | 2:52 PM

కేదర్‌నాథ్ యాత్ర కోసం అధికారులు భ‌క్తుల రిజిస్ట్రేష‌న్లను నిలిపివేశారు. వాతావ‌ర‌ణ పరిస్థితులు స‌రిగా లేని కార‌ణంగా.. ఈ నెల 8వ తేదీ వ‌ర‌కు రిజిస్ట్రేష‌న్లు బంద్ చేసిన‌ట్లు పేర్కొన్నారు . అయితే కేదారీఘాటీలో రానున్న నాలుగు రోజుల పాటు వ‌ర్షాలు పడనున్నట్లు తెలుస్తోంది. దీంతో వాతావరణం చాలా ప్రమాదక‌రంగా మారే అవ‌కాశాలు ఉన్నట్లు హెచ్చరించారు. ఈ క్రమంలో రిజిస్ట్రేష‌న్లు బంద్ చేయాల‌ని ప్రభుత్వం నిర్ణయించింది. టూరిజం శాఖ ప్రకారం ఇప్పటికే దాదాపు 1.26 ల‌క్షల మంది యాత్రకు రిజిస్ట్రేష‌న్లు చేసుకున్నారు. మే 4వ తేదీ వ‌ర‌కు దాదాపు 1.23 ల‌క్షల మంది భ‌క్తులు కేదార్‌నాథ్‌ను ద‌ర్శించుకున్నట్లు తెలుస్తోంది.

మరోవైపు గురువారం రోజున కేదార్‌నాథ్ రూట్లో ఉన్న బైరాన్ గ్లేసియ‌ర్ కూల‌డంతో.. ఆ రూటును మూసివేశారు. డీడీఎం, ఎడీఆర్ఎఫ్‌, డీడీఆర్ఎఫ్‌, ఎన్డీఆర్ఎఫ్‌, వైఎంఎఫ్ ద‌ళాలు మంచు ముక్కల్ని తొల‌గించారు. చివరికి గుర్రాలు, గాడిద‌లు వెళ్లే రూటును కూడా ఇంకా తెరువ‌లేదు. ప్రస్తుతం న‌డ‌క రూట్లో ఉన్న మంచును తొల‌గిస్తున్నారు. అలాగే భైర‌వ్‌, కుబేర్ ఘాట్ రూట్లో కూడా గ్లేసియ‌ర్ కూల‌డంతో ఆ రూటును కూడా మూసివేశారు.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..

ఇవి కూడా చదవండి

ఆర్ధిక సంస్కరణల ఆద్యుడు.. ప్రజలకు 'ఉపాధి' కల్పించిన నాయకుడు
ఆర్ధిక సంస్కరణల ఆద్యుడు.. ప్రజలకు 'ఉపాధి' కల్పించిన నాయకుడు
మాజీ ప్రధాని మన్మోహన్‌ సింగ్‌కు ప్రముఖుల నివాళి
మాజీ ప్రధాని మన్మోహన్‌ సింగ్‌కు ప్రముఖుల నివాళి
నవ భారత రూపశిల్పి ఇకలేరు..
నవ భారత రూపశిల్పి ఇకలేరు..
ఎవరో నా పేరు మర్చిపోతే ఫీల్ అవుతానా.? సీఎం రేవంత్ ఏమన్నారంటే
ఎవరో నా పేరు మర్చిపోతే ఫీల్ అవుతానా.? సీఎం రేవంత్ ఏమన్నారంటే
ఇండియన్ సినిమా క్యాపిటల్‌గా హైదరాబాద్.. సీఎంతో సినీ ప్రముఖుల భేటీ
ఇండియన్ సినిమా క్యాపిటల్‌గా హైదరాబాద్.. సీఎంతో సినీ ప్రముఖుల భేటీ
ఉదయాన్నే ఖాళీకడుపుతో జీలకర్ర వాటర్ తాగితే,శరీరంలో ఉహించనిమార్పులు
ఉదయాన్నే ఖాళీకడుపుతో జీలకర్ర వాటర్ తాగితే,శరీరంలో ఉహించనిమార్పులు
బీఎస్‌ఎన్‌ఎల్‌ గుడ్‌న్యూస్‌.. ఒక నెల పాటు ఉచిత ఇంటర్నెట్‌ సదుపాయం
బీఎస్‌ఎన్‌ఎల్‌ గుడ్‌న్యూస్‌.. ఒక నెల పాటు ఉచిత ఇంటర్నెట్‌ సదుపాయం
మద్యం మత్తులో నిద్రిస్తున్న భర్త.. అదే అదునుగా చూసిన భార్య..
మద్యం మత్తులో నిద్రిస్తున్న భర్త.. అదే అదునుగా చూసిన భార్య..
చేసిన సినిమాలన్ని ప్లాప్.. అయినా తగ్గని క్రేజ్..
చేసిన సినిమాలన్ని ప్లాప్.. అయినా తగ్గని క్రేజ్..
ఒకప్పుడు క్రేజీ హీరోయిన్.. ఇప్పుడు మోటివేషనల్ స్పీకర్..ఎవరంటే
ఒకప్పుడు క్రేజీ హీరోయిన్.. ఇప్పుడు మోటివేషనల్ స్పీకర్..ఎవరంటే