‘నీట్’ పరీక్ష రాస్తా, పర్మిషన్ ఇవ్వండి, ‘కుర్ర ఉగ్రవాది’ అభ్యర్థన ‘

పుల్వామా దాడిలో ఉగ్రవాదులకు సహాయపడినందుకు నిందితుడిగా మారిన 20 ఏళ్ళ ' కుర్ర ఉగ్రవాది' తాను నీట్ పరీక్ష రాయాల్సి ఉందని, అందుకు అనుమతించాలని కోరుతూ ఎన్ఐ కోర్టులో అప్పీలు దాఖలు చేసుకున్నాడు.

  • Umakanth Rao
  • Publish Date - 1:27 pm, Wed, 2 September 20
'నీట్' పరీక్ష రాస్తా, పర్మిషన్ ఇవ్వండి, 'కుర్ర ఉగ్రవాది' అభ్యర్థన '

పుల్వామా దాడిలో ఉగ్రవాదులకు సహాయపడినందుకు నిందితుడిగా మారిన 20 ఏళ్ళ ‘ కుర్ర ఉగ్రవాది’ తాను నీట్ పరీక్ష రాయాల్సి ఉందని, అందుకు అనుమతించాలని కోరుతూ ఎన్ఐ కోర్టులో అప్పీలు దాఖలు చేసుకున్నాడు. వైజ్-ఉల్ ఇస్లాం అనే ఇతగాడు పుల్వామా ఎటాక్ సమయంలో జైషే టెర్రరిస్ట్ సంస్థకు ఈ-కామర్స్ సైట్ నుంచి పేలుడు పదార్థాలను ఆర్డర్ చేయడంలో తోడ్పడుతూ వచ్చాడట. ఆ కేసులో నిందితుడైన ఇస్లాం .. ఈ నెల 13 న జరిగే ‘నీట్’ఎగ్జామ్ రాస్తానని, పర్మిషన్ ఇవ్వాలని నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజన్సీ స్పెషల్ కోర్టును కోరాడు. పుల్వామా కేసుకు సంబంధించి ఎన్ఐఏ చార్జిషీట్ లో పేర్కొన్న 19 మంది నిందితుల్లో ఇతని పేరుకూడా ఉంది. ఇతని అభ్యర్థనపై రేపు కోర్టు విచారణ జరపనుంది. వైజ్ ఉల్ ఇస్లాం శ్రీనగర్ ని తన ఎగ్జామ్ సెంటర్ గా ఎంచుకున్నాడని తెలిపిన అధికారులు.. గత మార్చిలో ఇతడ్ని అరెస్టు చేసిన విషయాన్ని  గుర్తు చేశారు.