‘ఇంటర్నెట్‌ను పునరుధ్ధరిస్తే బూతు సినిమాలు చూస్తున్నారు’

జమ్మూకాశ్మీర్ లో ఇంటర్నెట్ ను ప్రభుత్వం ఇటీవలే పునరుధ్ధరించింది. ఇందుకు అంతా ఎంతో సంతోషించారు. ముఖ్యంగా యువత కేరింతలు కొట్టింది. అయితే ఈ సర్వీసును నిషేధిస్తూ ఇన్నాళ్ళూ కేంద్రం తీసుకున్న నిర్ణయం సరైనదేనంటున్నారు నీతిఆయోగ్ సభ్యుడు వి.కె. సారస్వత్. కాశ్మీర్ ప్రజలు ఇప్పుడు బూతు చిత్రాలను చూసేందుకు ఇంటర్నెట్ సౌకర్యాన్ని వినియోగిస్తున్నారని ఆయన ఫైరయ్యాడు. ఈ కేంద్ర పాలిత ప్రాంతంలో ఈ సదుపాయాన్ని నిషేధించినంత మాత్రాన ఆర్థికపరిస్థితిపై పెద్ద ప్రభావమేమీ పడలేదని ఆయన అభిప్రాయపడ్డారు. నీతి ఆయోగ్ […]

'ఇంటర్నెట్‌ను పునరుధ్ధరిస్తే బూతు సినిమాలు చూస్తున్నారు'
Follow us

| Edited By: Ram Naramaneni

Updated on: Jan 19, 2020 | 5:51 PM

జమ్మూకాశ్మీర్ లో ఇంటర్నెట్ ను ప్రభుత్వం ఇటీవలే పునరుధ్ధరించింది. ఇందుకు అంతా ఎంతో సంతోషించారు. ముఖ్యంగా యువత కేరింతలు కొట్టింది. అయితే ఈ సర్వీసును నిషేధిస్తూ ఇన్నాళ్ళూ కేంద్రం తీసుకున్న నిర్ణయం సరైనదేనంటున్నారు నీతిఆయోగ్ సభ్యుడు వి.కె. సారస్వత్. కాశ్మీర్ ప్రజలు ఇప్పుడు బూతు చిత్రాలను చూసేందుకు ఇంటర్నెట్ సౌకర్యాన్ని వినియోగిస్తున్నారని ఆయన ఫైరయ్యాడు. ఈ కేంద్ర పాలిత ప్రాంతంలో ఈ సదుపాయాన్ని నిషేధించినంత మాత్రాన ఆర్థికపరిస్థితిపై పెద్ద ప్రభావమేమీ పడలేదని ఆయన అభిప్రాయపడ్డారు.

నీతి ఆయోగ్ సభ్యుని సంచలన ఆరోపణ

కాశ్మీర్లో ధీరూభాయ్ అంబానీ ఇన్స్‌టిట్యూట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ అండ్ కమ్యూనికేషన్ టెక్నాలజీ  నిర్వహించిన వార్షిక స్నాతకోత్సవానికి ఆయన హాజరయ్యారు. ఇక్కడ ఇంటర్నెట్ పునరుధ్ధరణ  మంచిదే అంటున్నారని, కానీ ముఖ్యంగా దీనినుపయోగించి యువకులు ‘గలీజ్ మూవీలు’ చూస్తున్నారని సారస్వత్ పేర్కొన్నారు. అలాగే ఢిల్లీ వంటి నగరాల్లో జరిగిన నిరసన ప్రదర్శనలను ‘రీక్రియేట్’ చేసే ఉద్దేశంతో పలువురు రాజకీయ నాయకులు ఈ కేంద్రపాలిత ప్రాంతానికి చేరుకుంటున్నారని, ఈ నిరసనలను రెచ్ఛగొట్టేందుకు సోషల్ మీడియాను వినియోగించుకుంటున్నారని ఆయన చెప్పారు. నిజానికి ఈ లోయలో టెర్రరిస్టులు ఇంటర్నెట్ ను దుర్వినియోగం చేయగలరన్న భయంతో కేంద్రం ఈ సౌకర్యాన్ని నిషేధించింది.  ఈ మధ్యే మొబైల్ ఫోన్, ఇంటర్నెట్ సదుపాయాలపై ఆంక్షలను దశలవారీగా ఎత్తివేసేందుకు కేంద్రం నడుం కట్టిన సంగతి తెలిసిందే.