AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Thalapathy Vijay: తమిళనాట విజయ్ గర్జన: కాంగ్రెస్ మద్దతుతో కోటపై దళపతి జెండా.!

తమిళనాడు ఎన్నికల ఫలితాలు ఊహించని మలుపు తిరిగిన సంగతి తెలిసిందే. 108 సీట్లతో సింగిల్ లార్జెస్ట్ పార్టీగా నిలిచిన విజయ్ TVK, ప్రభుత్వం ఏర్పాటు చేయడానికి కాంగ్రెస్ మద్దతు కోరింది. ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ ఈ విషయాన్ని ధృవీకరించడంతో రాజకీయ సమీకరణాలు వేగంగా మారుతున్నాయి.

Thalapathy Vijay: తమిళనాట విజయ్ గర్జన: కాంగ్రెస్ మద్దతుతో కోటపై దళపతి జెండా.!
Vijay 5
Ravi Kiran
|

Updated on: May 07, 2026 | 1:49 PM

Share

తమిళ రాజకీయాల్లో గత ఐదు దశాబ్దాలుగా సాగుతున్న డీఎంకే, ఏఐఏడీఎంకే ద్వైపాక్షిక ఆధిపత్యానికి దళపతి విజయ్ తెరదించారు. 2026 అసెంబ్లీ ఎన్నికల్లో తన ‘తమిళగ వెట్రి కళగం’ (TVK) పార్టీతో బరిలోకి దిగిన ఆయన, మొదటి ప్రయత్నంలోనే ఏకంగా 108 సీట్లు గెలుచుకుని అందరినీ ఆశ్చర్యపరిచారు. అయితే, సొంతంగా ప్రభుత్వం ఏర్పాటు చేయడానికి కావాల్సిన 118 సీట్లకు కేవలం 10 అడుగుల దూరంలో విజయ్ ఆగిపోవడంతో ఇప్పుడు పొత్తుల పర్వం మొదలైంది.

తాజాగా ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ వెల్లడించిన వివరాల ప్రకారం.. తమిళనాడులో ప్రభుత్వం ఏర్పాటు చేయడానికి విజయ్ తమ మద్దతు కోరినట్లు స్పష్టమైంది. “తమిళనాడులో కొత్త పరిస్థితులు ఏర్పడ్డాయి. విజయ్ ప్రతిపాదనపై అధిష్టానం చర్చించి నిర్ణయం తీసుకుంటుంది” అని వేణుగోపాల్ పేర్కొన్నారు. ప్రస్తుతం డీఎంకే కూటమిలో ఉన్న కాంగ్రెస్, విజయ్ వైపు మొగ్గు చూపితే తమిళనాట సరికొత్త రాజకీయ శకం ప్రారంభం కావడం ఖాయం.

ఈ ఎన్నికల్లో ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ తన సొంత నియోజకవర్గం కొలత్తూరులో టీవీకే అభ్యర్థి చేతిలో ఓడిపోవడం ఈ విజయ ప్రభంజనాన్ని సూచిస్తోంది. విజయ్ కేవలం తన క్రేజ్‌తోనే కాకుండా, పక్కా మేనిఫెస్టో, యువత మద్దతుతో డీఎంకే కంచుకోటలను బద్దలు కొట్టారు. అటు పీఎంకే(PMK), లెఫ్ట్ పార్టీలు, ఇతర చిన్న పార్టీల మద్దతు కోసం కూడా టీవీకే చర్చలు జరుపుతోంది.

ఒకవేళ కాంగ్రెస్ తన 5 సీట్లతో విజయ్‌కు మద్దతు ఇస్తే, విజయ్ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయడానికి మార్గం సుగమం అవుతుంది. మే 7వ తేదీన ఆయన ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపడతారని పార్టీ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. దశాబ్దాల తర్వాత ఒక నటుడు రాజకీయాల్లోకి వచ్చి ఇలాంటి అద్భుత విజయం సాధించడం తమిళనాడులో ఎంజీఆర్, జయలలిత కాలం నాటి జ్ఞాపకాలను గుర్తు చేస్తోంది.

Follow Us