బిచ్చగాడిలా మారిన మాజీ పోలీస్ ఆఫీసర్ కొడుకు! ఏం జరిగిందంటే?

విధి వైపరిత్యం ఇంజనీరింగ్‌ చదివిన ఓ వ్యక్తిని బిచ్చగాన్ని చేసింది. ఇంట్లో పరిస్థితుల ప్రభావంతో అలా మారగా.. ఓ కార్మికుడితో జరిగిన గొడవ అతని గతాన్ని తెలిసేలా చేసింది. ఒడిశాలోని ప్రముఖ పూరీ జగన్నాథుడి ఆలయం దగ్గర రిక్షా కార్మికుడితో ఓ యాచకుడు ఘర్షణకు దిగాడు. అది పెద్దగా మారడంతో పోలీసులు జోక్యం చేసుకునే వరకు వెళ్లింది. ఈ క్రమంలో పరస్పరం ఫిర్యాదులు చేసుకున్న క్రమంలో ఆ యాచకుడు ఇచ్చిన లేఖను చూసి పోలీసులు ఖంగుతిన్నారు. ఉన్నత […]

  • Tv9 Telugu
  • Publish Date - 3:47 pm, Sun, 19 January 20
బిచ్చగాడిలా మారిన మాజీ పోలీస్ ఆఫీసర్ కొడుకు! ఏం జరిగిందంటే?

విధి వైపరిత్యం ఇంజనీరింగ్‌ చదివిన ఓ వ్యక్తిని బిచ్చగాన్ని చేసింది. ఇంట్లో పరిస్థితుల ప్రభావంతో అలా మారగా.. ఓ కార్మికుడితో జరిగిన గొడవ అతని గతాన్ని తెలిసేలా చేసింది. ఒడిశాలోని ప్రముఖ పూరీ జగన్నాథుడి ఆలయం దగ్గర రిక్షా కార్మికుడితో ఓ యాచకుడు ఘర్షణకు దిగాడు. అది పెద్దగా మారడంతో పోలీసులు జోక్యం చేసుకునే వరకు వెళ్లింది. ఈ క్రమంలో పరస్పరం ఫిర్యాదులు చేసుకున్న క్రమంలో ఆ యాచకుడు ఇచ్చిన లేఖను చూసి పోలీసులు ఖంగుతిన్నారు.

ఉన్నత చదువులు చదువుకున్న వ్యక్తిలా ఇంగ్లీషులో రాసి ఉండడంతో.. అతని గత చరిత్ర ఏంటని ఆరా తీయగా.. ఉన్నత కుటుంబం నుంచి వచ్చిన వ్యక్తిగా గుర్తించారు. కాషాయ వస్త్రధారణలో సాధువులా ఉన్న వ్యక్తి ఓ మాజీ పోలీస్‌ ఆఫీసర్‌ కొడుకా అని తెలుసుకుని ఖంగుతిన్నారు. ఒకప్పుడు మిల్టన్‌ కంపెనీలో పనిచేసిన భువనేశ్వర్‌కు చెందిన గిరిజా శంకర్‌మిశ్రాగా అతన్ని గుర్తించారు. తండ్రి మరణించాక తల్లి కూడా చనిపోయింది. దీంతో మానసికంగా కుంగిపోయిన శంకర్‌మిశ్రా ఇల్లు వదిలి ఇలా మారాడు.

అన్నదమ్ములు, అక్కాచెల్లెల్లు ఉన్నతస్థానంలోనే ఉన్నారు. వాళ్ల దగ్గరకు వెళ్లేందుకు అతను ఇష్టపడడం లేదు. ఇటీవల సొంత ఊరుకు వెళ్లినా కుటుంబసభ్యులను మాత్రం కలుసుకోలేదు. పోలీసులు వారిని గుర్తించి అతన్ని అప్పగించాలని చూస్తున్నారు. శంకర్‌ మాససిక పరిస్థితి సరిగా లేకపోవడంతోనే ఇల్లు వదిలివచ్చినట్టు భావిస్తున్నారు. ఆకలి తీర్చుకునేందుకు యాత్రాస్థలాల్లో యాచన చేస్తున్నట్టు పోలీసులు తెలిపారు.