AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Jabardasth: ఇన్‌స్టాగ్రామ్ సబ్ స్క్రిప్షన్ స్టార్ట్ చేసిన జబర్దస్త్ బ్యూటీ.. నెల సంపాదన ఎంతో తెలుసా?

విష్ణు ప్రియ, అనన్య నాగళ్ల, అషురెడ్డి.. ఇప్పుడు మరో అందాల తార ఇన్ స్టా గ్రామ్ సబ్ స్క్రిప్షన్ స్టార్ట్ చేసింది. జబర్దస్త్ తో పాటు బిగ్ బాస్ షోలోనూ సందడి చేసిన ఈ ముద్దుగుమ్మకు సోషల్ మీడియాలోనూ భారీగా ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది.

Jabardasth: ఇన్‌స్టాగ్రామ్ సబ్ స్క్రిప్షన్ స్టార్ట్ చేసిన జబర్దస్త్ బ్యూటీ.. నెల సంపాదన ఎంతో తెలుసా?
Siri Hanmanth
Basha Shek
|

Updated on: May 06, 2026 | 8:45 AM

Share

ఇన్ స్టా గ్రామ్ పెయిడ్ సబ్ స్క్రిప్షన్ అంటూ సెలబ్రిటీలు ఇటీవల సరికొత్త ఆదాయ మార్గాన్ని ఎంచుకున్నారు. ఎక్స్ క్లూజివ్ కంటెంట్ అంటూ గ్లామరస్ ఫొటోస్, వీడియోలను షేర్ చేస్తూ భారీ ఆదాయం ఆర్జిస్తున్నారు. ఇప్పటికే బుల్లితెర సెలబ్రిటీలైన విష్ణు ప్రియ, అనన్య నాగళ్ల, అషు రెడ్డి ఇన్ స్టా గ్రామ్ పెయిడ్ సబ్ స్క్రిప్షన్ ప్రారంభించారు. దెబ్బకు వీరి సబ్ స్క్రైబర్లు కూడా అమాంతం పెరిగిపోయారు. తాజాగా మరో బిగ్ బాస్ బ్యూటీ సిరి హనుమంత్ కూడా ఈ లిస్ట్ లో చేరింది. పలు సీరియల్స్ లో నటించిన ఈ ముద్దుగుమ్మ పలు సినిమాలు వెబ్ సిరీస్ లలో మెరిసింది. బిగ్ బాస్ తెలుగు రియాలిటీ షోలనూ పాల్గొంది. విజేతగా నిలవకున్నా తన ఆట, మాట తీరుతో టాప్-5 కంటెస్టెంట్స్ లో ఒకరిగా నిలిచింది. అలాగే ఆ మధ్యన కొన్ని రోజుల పాటు జబర్దస్త్ యాంకర్ గానూ చేసింది. ప్రస్తుతం పలు టీవీ షోస్, ప్రోగ్రామ్స్ తో బిజీ బిజీగా ఉంటోన్న ఈ అందాల తారకు సోషల్ మీడియాలోనూ మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. ఇప్పటికే ఆమె సొంత యూట్యూబ్ ఛానెల్ ను రన్ చేస్తోంది. ఇంట్రెస్టింగ్ వీడియోలు అప్ లోడ్ చేస్తూ భారీగా ఆదాయం ఆర్జిస్తోంది. ఇక లేటెస్ట్ గా ఇన్‌స్టాగ్రామ్ సబ్ స్క్రిప్షన్ స్టార్ట్ చేసింది సిరి. తన ఎక్స్ క్లూజివ్ ఫొటోస్, వీడియోల కోసం ప్రతి నెలా రూ.390 చెల్లించాలంటోంది.

కాగా ఇప్పటికే సిరి ఇన్ స్టా గ్రామ్ సబ్ స్క్రిప్షన్ లో సుమారు 426 మంది సబ్ స్క్రైబర్లు ఉన్నారు. వీరందరూ ప్రతినెల 390 రూపాయలు సబ్స్క్రిప్షన్ చేసుకుంటే నెలకు సుమారు 1.6 లక్షల రూపాయల ఆదాయం సిరికి వచ్చే అవకాశముంది. కాగా తెలుగులో ఇన్ స్టా గ్రామ్ సబ్ స్క్రిప్షన్ విధానానికి నాంది పలికింది విష్ణు ప్రియనే అని చెప్పవచ్చు. దీనిపై వ్యతిరేకత కూడా వచ్చింది. ఈ స్టార్ యాంకర్ పై కేసులు కూడా నమోదయ్యాయి. అయితే ఇదే ఆమెకు అనుకూలంగా మారింది. ఉన్నట్లుండి ఆమెకు సబ్ స్క్రైబర్లు పెరిగారు. దీంతో మరికొందరు సెలబ్రిటీలు విష్ణు ప్రియను అనుసరించారు. అయితే కొంతమంది సబ్ సబ్స్క్రిప్షన్ పేరుతో అందరికీ అవసరమయ్యే కంటెంట్ షేర్ చేసస్తుండగా, మరికొందరు మాత్రం గ్లామరస్ ఫోటోలు, వీడియోలను షేర్ చేస్తూ ఆదాయం పొందుతున్నారు. ఇప్పుడు ఈ జాబితాలోకి సిరి కహనుమంతు కూడా చేరింది. భవిష్యత్తులో మరి కొంతమంది సెలబ్రిటీలు కూడా ఇన్ స్టా గ్రామ్ సబ్ స్క్రిప్షన్ లోకి ఎంట్రీ ఇస్తారని తెలుస్తోంది.

ఇవి కూడా చదవండి

బిగ్ బాస్ సిరి లేటెస్ట్ ఇన్ స్టా గ్రామ్ పోస్ట్..

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Follow Us
ఏడేళ్ల చిన్నారి మహాదానం.. అవయవదానం చేసి ఆరుగురికి కొత్త జీవితం
ఏడేళ్ల చిన్నారి మహాదానం.. అవయవదానం చేసి ఆరుగురికి కొత్త జీవితం
మెరుగైన విద్యకు కేరాఫ్. ఈస్ట్ పాయింట్ గ్రూప్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్స్
మెరుగైన విద్యకు కేరాఫ్. ఈస్ట్ పాయింట్ గ్రూప్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్స్
విద్యార్థులకు కేంద్రం గుడ్‌న్యూస్.. రూ.33 కోట్లతో కొత్త స్కూళ్లు
విద్యార్థులకు కేంద్రం గుడ్‌న్యూస్.. రూ.33 కోట్లతో కొత్త స్కూళ్లు
ఆపదలో భయాన్ని దాచడమే తెలివి.. మేకపోతు గాంభీర్యం కథ
ఆపదలో భయాన్ని దాచడమే తెలివి.. మేకపోతు గాంభీర్యం కథ
సిమెంట్ స్తంభాల కింద చితికిన కూలీల బతుకులు!
సిమెంట్ స్తంభాల కింద చితికిన కూలీల బతుకులు!
పీఎఫ్ వడ్డీ ఎలా లెక్కిస్తారు..? మీ అకౌంట్లోకి ఎంత వస్తుంది..?
పీఎఫ్ వడ్డీ ఎలా లెక్కిస్తారు..? మీ అకౌంట్లోకి ఎంత వస్తుంది..?
రేషన్ కార్డు ఉన్నవారికి ఏపీ సర్కార్ సూపర్ గుడ్‌న్యూస్
రేషన్ కార్డు ఉన్నవారికి ఏపీ సర్కార్ సూపర్ గుడ్‌న్యూస్
ప్రభాస్ మూవీలో ఆ సీన్ చేయను.. నా వల్ల కాదంటూ ఏడ్చేసిన హీరోయిన్..
ప్రభాస్ మూవీలో ఆ సీన్ చేయను.. నా వల్ల కాదంటూ ఏడ్చేసిన హీరోయిన్..
గొప్ప మనసు చాటుకున్న హీరో నిఖిల్.. 1000 మంది స్కూల్ పిల్లలకు..
గొప్ప మనసు చాటుకున్న హీరో నిఖిల్.. 1000 మంది స్కూల్ పిల్లలకు..
ఎస్బీఐ ఖాతాదారులకు అలర్ట్. ఈ పొరపాటు చేస్తే ఖాతా ఖాళీ..
ఎస్బీఐ ఖాతాదారులకు అలర్ట్. ఈ పొరపాటు చేస్తే ఖాతా ఖాళీ..